ALOE VERA
మన దేశంలో లభించే వివిధ రకాల మూలికలు, ఔషద మొక్కలతో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇవి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను నివారించడంలో ఉపయోగపడతాయి. హెల్త్ ని కాపాడుకోవడం లో ఉపయోగపడే ఈ మెడిసినల్ ప్లాంట్ లల్లో కలబంద ఒకటి. ఈ కాలంలో అలొవెరా గురించి తెలియని వారుండరు ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎన్నో సమస్యల నుండి విముఖ్తి పొందడానికి ఎదొక విధంగా వాడుతూనే ఉంటున్నారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కలబంద మొక్కలు విరివిగా పెరుగుతాయి. ఇవి పెరిగేందుకు ఎక్కువగా నీరు కూడా అవసరం ఉండదు. కాబట్టి ఈ మొక్కలు విరివిగా పెరుగుతాయి.
ALOE VERA లోని పోషకవిలువలు…
దీని ఆకులలో 94 శాతం నీరు ఉంటుంది. గుజ్జుల్లో 20 రకాల ఆమోనీ ఆసిడ్లు, కార్భోహైడ్రేట్స్ మరియు ఇతర రసాయన బార్భలోయిన్ అనే గ్లూకో సైట్స్ ఉంటాయి. అంతే కాకుండా మాంగనీస్. మెగ్నీషియం, కాల్షియం, కాపర్, జింక్ వంటి మూలకాలు కూడా ఉంటాయి.
అలోవెరాను డైట్ లో చేర్చుకుంటే ఇన్ని ప్రయోజనాలా…
కలబందను మన ఆహరంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. కలబంద గుజ్జును తీసుకోని దానిలో కాస్త చక్కెర కలిపి తినడం వల్ల , కలబంద రసాన్ని తీసి కలకండతో కలిపి సేవించడం ద్వారా శరీరంలోని వేడి తగ్గి శరీరానికి చల్లదనాన్ని, ఆరోగ్యాన్ని పొందవచ్చు. దీని రసాన్ని తీసుకుని పాలు లేదా నీళ్లతో కలిపి తీసుకుంటే సెగ రోగం, గనేరియా మెహ వ్యాధుల నుండి ఉపశమణం పొందవచ్చు. కలబంద గుజ్జు చలవ చేస్తుంది. నేత్ర రోగాలకు, కాలిన గాయాలను మాన్పుటకు, స్త్రీలల్లో వచ్చే గర్భాశయ వ్యాధుల్లోనూ, ప్లీహము దీర్ఘకాలీక పుండ్లను నివారణకు, కండ్ల కలకలకు, మూల వ్యాధి కాలేయం సంబంధ వ్యాధుల్లోనూ, మూత్ర కోశ సంబంధ వ్యాధుల్లోనూ, రుతు సంబంధ చికిత్సకు మంచిగా సహయపడుతుంది. కలబంద గుజ్జుని ఉడికించి వాపులు, గడ్డలు పై కడితే తగ్గిపొతాయి. పరగడుపున కలబందను తినడం వల్ల ఉదర సమస్యలు తొలగిపోతాయి.
కాంతివంతమైన చర్మం కోసం అలోవెరా…
కలబంద ఆకులను గుజ్జులా చేసి దానిలో కొబ్బరినూనెను కలుపుకోని ఆ మిశ్రమాన్ని మోచేతులు, పాదాల వద్ద నల్లగా ఉన్న ప్రాంతాల్లో పూస్తే చర్మంపై ఉన్న నల్ల మచ్చలు తగ్గుతాయి. దీని రసాన్ని లేపనంలా పూసుకోవడం వలన చర్మ వ్యాధులు, సూర్యరశ్మి తాపాలు, x-ray వలన ఎర్పడిన చర్మరోగాలు వంటి వాటి నుండి ఉపశమనం పొందవచ్చు. చర్మసౌదర్యానికి, ముఖము కాంతివంతంగా రావడానికి దీనిని ప్యాకుల్లోనూ, వివిధ ముఖలేపనాల్లోనూ ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. రోజ్ వాటర్ తో కలిపి అలోవెరాను కలుపుకుని ,చర్మంపై పూస్తే పొడిబారిన చర్మం కళకళలాడుతుంది. దీని రసాన్ని ముల్తానీ మట్టి లేక చందనపు పొడి కలుపుకుని ముఖంపైనున్న మొటిమలకు పూస్తే మొటిమలు మాయమవుతాయి.
పొడవైన కురుల కోసం ALOE VERA
కలబంద గుజ్జు జుట్టు ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే అమైనో ఆమ్లాలు మరియు ప్రొటీలిటిక్ ఎంజైమ్స్ చర్మం ఆరోగ్యాన్నీ మెరుగుపర్చడానికి మరియు జుట్టు పెరుగుదలను పెంచడానికి సమర్ధవంతంగా సహయ పడతాయి. ఇది వెంట్రుకలు రాలిపోవడాన్ని తగ్గిస్తుంది అలాగే జుట్టు చివర భాగంలో విరిగిపోకుండా జుట్టుని ఒత్తుగా చేస్తుంది. చుండ్రు తగ్గించడానికి యాంటీ ఫంగల్ మరియు యాంటి వైరల్ లక్షణాలు కలిగి ఉంది. దీనిలో తేమ శాతం అధికంగా ఉంటుంది ఇది జుట్టుని మృదువుగా చేయడంలో సహయపడుతుంది.