ICCWC
ఎంత బాగా ఆడినా ఒకోసారి కలసి రాదంతే.. వెయ్యి దేవుళ్లకు మొక్కినా… అద్భుతమైన ప్రతిభ కనపరచినా.. ఒక్కోసారి బ్యాడ్ లక్ వెంటాడుతుంది. అంతే… టీం ఇండియా అభిమానులు నిన్న మొక్కని దేవుడంటూ ఉండి ఉండడు.. సొంత గడ్డ మీద అదీ ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన ప్రపంచ కప్ ఫైనల్ పోటీ ఆతిధ్యమిస్తున్న దేశం గెలుచుకోవడం సహజాతి సహజం.. కానీ నిన్న అందుకు విరుద్ధంగా జరిగింది. సీరీస్ మొదటినుంచి ఓటమి అన్నది లేకుండా , ఆడిన ప్రతీ మ్యాచ్ గెలిచి చివరకు ఫైనల్ లో బొక్క బోర్లా పడింది టీమిండియా.. కోట్లాది మంది ఆశలను నిరాశ చేస్తూ నిన్న జరిగిన ఉత్కంఠభరితమైన పోటీలో వాల్డ్ కప్ ను ఆస్ట్రేలియా ఎగరేసుకుపోయింది. వరసగా ఆరోసారి కప్పు కొట్టుకు పోయింది ఆసీస్ టీమ్..
సిరాజ్ కి నో బౌలింగ్… ICCWC
టీమిండియా ప్లానింగ్ లో లోపమే మ్యాచ్ ఓడిపోడానికి కారణమా? కెప్టెన్ రోహిత్ శర్మ బౌలర్లను సరైన టైమ్ లో సరిగా వినియోగించలేదనే విమర్శలున్నాయి. నిన్నటి మ్యాచ్ లో మొదట్లో పేసర్లకు వికెట్లు పడుతున్నప్పుడు సిరాజ్ కు రోహిత్ బౌలింగ్ ఇచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. సిరాజ్ కూడా ఒకటో రెండో వికెట్లు పడగొడితే.. గెలుపుకు ఛాన్స్ ఉండేది. ఫైనల్ అని తెలిసినప్పుడు రోహిత్ శర్మ దూకుడుగా కాకుండా ఓపిగ్గాఆడి ఉండాల్సింది. వికెట్ బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్నప్పుడు సంయమనంతో ఆడాల్సింది, ఆస్ట్రేలియా అదే చేసింది. ప్రారంభంలోనే మూడు వికెట్లు కోల్పోయినా ఆ తరువాత చాలా ఓపిగ్గా ఆడింది.
రోహిత్ అజాగ్రత్త బ్యాటింగ్…
టాస్ గెలవనప్పుడు భారీ స్కోరే లక్ష్యంగా బ్యాటింగ్ ఉండాలి. నిన్నటి మ్యాచ్ లో టీమిండియా కేవలం 240 పరుగులకే ఆలౌట్ అయింది. ప్రపంచ కప్ చరిత్రలోనే టీమిండియా ఆలౌట్ అవడం ఇదే తొలిసారి. భారీ స్కోర్ చేసి ఉంటే ఆసీస్ కు ఆ టార్గెట్ చేరడం కష్టంగా మారేది.. రోహిత్ శర్మ మరింత జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తే బాగుండేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. పవర్‌ప్లే 9 ఓవర్లలో భారత్ స్కోరు 10వ ఓవర్లో పార్ట్ టైమ్ బౌలర్ గ్లెన్ మాక్స్ వెల్ వచ్చాడు. రోహిత్ తన తొలి మూడు బంతుల్లో 10 పరుగులు చేశాడు. ఇదిలావుండగా నాలుగో బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో భారత ఇన్నింగ్స్ జోరుకు బ్రేక్ పడింది. ICCWC
రాంగ్ టైమ్ లో విరాట్ ఔట్…
రోహిత్ ఔట్ అయిన తర్వాత అయ్యర్ 4 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత రాహుల్‌తో కలిసి విరాట్ 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ జట్టును భారీ స్కోరు దిశగా తీసుకెళ్తుండగా, పాట్ కమిన్స్ వేసిన బంతిని విరాట్ ఆడాడు. ఇక్కడి నుంచి భారత ఇన్నింగ్స్ ఇరుక్కోవడంతో తర్వాత వచ్చిన బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడలేకపోయారు.
రాహుల్ స్లో బ్యాటింగ్.. ICCWC
కోహ్లీ వికెట్ పడిపోవడంతో కేఎల్ రాహుల్ ఒత్తిడిలో పడి వికెట్ కాపాడుకునే క్రమంలో నెమ్మదిగా ఆడడం ప్రారంభించాడు. మిడిల్ ఓవర్లలో 97 బంతుల వరకు బౌండరీలు రాలేదు. కేఎల్ రాహుల్ 107 బంతుల్లో 61.68 స్ట్రైక్ రేట్‌తో 66 పరుగులు చేశాడు. ఒక్క ఫోర్ మాత్రమే చేశాడు.
విఫలమైన స్పిన్నర్లు…
పవర్‌ప్లేలో ఆస్ట్రేలియా జట్టు 60 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇక్కడి నుంచి రోహిత్ శర్మ బౌలింగ్, ఫీల్డింగ్‌లో దూకుడు తగ్గించాడు.పవర్‌ప్లే తర్వాత రోహిత్ 6 ఓవర్లు జడేజా, కుల్దీప్లకు బౌలింగ్ ఇచ్చాడు. దీనిపై హెడ్, లాబుషాగ్నే ఇన్నింగ్స్ రీ బిల్డ్ చేసే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. వీరిద్దరూ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాకు అనుకూలంగా మార్చారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 20 ఓవర్ల తర్వాత మంచు కురుస్తోంది. దీంతో బంతి తడిసిపోవడంతో భారత స్పిన్నర్లు చేతులెత్తేశారు. జడేజా, కుల్దీప్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. బ్యాటర్స్ కి బ్యాటింగ్ సులువుగా మారింది.
మొత్తం మీద టీమిండియా ఓటమి క్రికెట్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. టీమిండియా డ్రెస్ లోనే క్రికెట్ అభిమానులు కూడా బ్లూ షర్టులు ధరించి మ్యాచ్ చూడ్డానికి రావడం కాస్త విచిత్రం.. స్టేడియంలో శ్రీరాముని పాటలు, జై శ్రీరామ్ నినాదాలు కాస్త ఇబ్బందిగా అనిపించాయి. ఇంత నైతిక మద్దతు అభిమానుల నుంచి ఉన్నా.. రోహిత్ టీమ్ తడబడి చతికిలబడిపోవడం నిరాశ కలిగించింది.