karthika masam
కార్తీకమాసంలో చేసే స్నానం, దీపం, పూజ, దానం విశిష్ట ఫలితాలను ఇస్తాయని చాలా మంది నమ్మకం. శివ శివ అంటూ నామస్మరణ చేసినా, కార్తీక దామోదర అంటూ కీర్తించినా శుభ ఫలితాలు లభిస్తాయని అందరి విశ్వాసం. ముఖ్యంగా కార్తీకమాసంలో శివ నామస్మరణ, శివుని పూజ అత్యంత ఫలవంతం. కార్తీకమాసం సోమవారం చేసే స్నానం, పూజ, జపం అచరించినవారు అశ్వమేథ యాగం చేసిన ఫలితం పొందుతారని విశ్వాసం. ఈ మాసంలో సోమవారానికి మరింత విశిష్టత ఉంటుంది. ఈ ఏడాది కార్తీకమాసంలో మొదటి సోమవారం అంటే నవంబర్ 20వ తేదీన వచ్చింది. శివ కేశవులకు ప్రీతిపాత్రమైన కోటి సోమవారం రోజున చేసే పూజలు మరింత ప్రతిఫలాన్ని ఇస్తాయి. ఆ రోజు శివాలయ సందర్శనం, అభిషేకం, ఉపవాసం, నక్తం మరియు ఏకభుక్తం వంటివి ఎవరి శక్తి మేరకు వారు ఆచరించడం మంచిదని శాస్త్ర పండితులు వెల్లడిస్తున్నారు. ఈ మొదటి సోమవారం చేసే దీపారాధన, ఆకాశదీప దర్శనం, దానం, ధర్మం వంటివి రెట్టింపు ఫలితాలు ఇస్తాయని అందరి విశ్వాసం.
కార్తీకమాసం యొక్క ప్రత్యేక విశిష్టత… karthika masam
ఈ మాసం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. చాలా మంది ఈ నెల రోజులు పూజ చేస్తూ.. ముఖ్యంగా సోమవారం ఉపవాసం ఉండి అత్యంత భక్తి శ్రద్దలతో శివయ్యని పూజిస్తుంటారు. మరికొందరు ఉపవాస దీక్షను చేస్తూ సాయంత్రం నక్షత్ర దర్శనం అనంతరం శివయ్యకు పూజ చేసి ఆపై ఉపవాస దీక్షను విరమిస్తారు. అయితే కోటి సోమవారం రోజు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుందని అందరి నమ్మకం. అందుకే ఇవాళ ( నవంబర్ 20న) కోటి సోమవారం కనుక ఉపవాస దీక్ష చేపట్టి ఆ పరమేశ్వరుడి అనుగ్రహన్ని పోందండి.
ఉపవాస దీక్ష ఎలా చేయాలంటే…
కార్తీక సోమవారం సూర్యోదయానికి ముందే శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేసి ఉపవాసం ఉండాలి. సాయంత్రం ప్రదోషకాల సమయంలో ఇంటిలోని పూజ గదిలో దీపారాధన చేసి నక్షత్ర దర్శనం అనంతరం శివాలయానికి వెళ్లి పరమేశ్వరుడిని దర్శించుకుని ఆలయంలో దీపారాధన చేయాలి. ఓం నమఃశివాయ పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి. అనంతరం భోజనం చేసి ఉపవాస దీక్షను విరమించుకోవాలి. ఇలా చేయడం వలన కోటి సోమవారాలు చేసిన ఫలితం దక్కుతుందని నమ్మకం.
కార్తీకమాసం యొక్క విశిష్టత… karthika masam
కార్తీకమాసం మహత్యం గురించి మొదటగా వశిష్ట మహర్షి జనక మహరాజునకు వివరించగా.. శౌనకాది మునులకు సూతుడు చెప్పాడు. ఈ నెలలో ప్రతిరోజూ పుణ్య ప్రదమైనదే. రోజూ చేసే స్నానం, అర్చనలు, అభిషేకాలు విశిష్టమైనవి . నదీస్నానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ పూజ, వన మహోత్సవ వేడుకలు వంటివి ఎక్కువగా ఆచరిస్తుంటారు. ఇక ఈ మాసంలో మహ విష్ణువు నదుల్లో మాత్రమే కాదు.. చెరువుల్లో, దిగుడు బావుల్లో, పిల్లకాలువల్లో నివసిస్తాడని అందరి నమ్మకం. కనుకనే ఈ నెలలో సూర్యోదయానికి ముందే చేసే స్నానం గంగ, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మదా, తపతి, సింధు మెదలైన నదుల్లో స్నానం చేసిన ఫలితం లభిస్తుందని విశ్వాసం. ఈ నెలలో శివకేశవులను, శ్రీ కృష్ణుడిని పూజించడం, తులసి కళ్యాణం అత్యంత ఫలవంతం. ఈ మాసంలో ప్రతిరోజూ పుణ్యప్రదమైనదే. అయితే ఏ రోజున ఏ తిధి వచ్చింది? ఏ దేవునికి పూజించాలి ఎలా చేయాలి ఏం చేస్తే మంచిది అనేది తెలుసుకుని దాని ప్రకారం పూజలను చేయడం అత్యంత ఫలితం లభిస్తుంది. karthika masam