Srikanth
వయసు పెరిగినా వన్నె తగ్గని హీరో శ్రీకాంత్. హీరోగా, కారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా ఏ పాత్రకైనా న్యాయం చేసే సమర్ధత అతగాడి సొంతం.. 120కి పైగా సినిమాల్లో నటించి ఇంకా తన స్పెషాలిటీని చాటుతూనే ఉన్నాడు.. ఇప్పుడు దేవర, కోట బొమ్మాళీ పీఎస్ సినిమాలతో మన ముందుకు రానున్నాడు. దేవర మూవీ సంబంధించిన కొన్ని సన్నివేశాలను గోవా లోని, గోకర్ణలో ప్రాంతాల్లో షూట్ చేశారు. ఆ షూటింగ్ లో ఎన్టీఆర్ తో పాటు జాన్వీకపూర్, శ్రీకాంత్ పాల్గొన్నారు. ఆ చిత్రీకరణలో అనుకోని సంఘటన ఒకటి జరిగింది.
షూటింగ్ టైమ్ లో శ్రీకాంత్ కి ఏమయ్యింది? Srikanth
దేవర సినిమాను చిత్రికరిస్తున్న సమయంలో శ్రీకాంత్ కాలుకి గాయం అయ్యిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తెలియజేశాడు. గాయం అయిందని శ్రీకాంత్ స్వయంగా చెప్పే సందర్భం ఎక్కడ వచ్చిందనుకుంటున్నారా? అది ఎక్కడో కాదు బిగ్ బాస్ షోలో గెస్ట్ గా వచ్చిన సమయంలో. కోటబోమ్మాళీ పీఎస్ సినిమా రిలీజ్ కి దగ్గరపడుతున్న సమయంలో మూవీ ప్రమోషన్స్ లో సందడి చేస్తున్నారు చిత్రం బృందం. అందులో భాగంగా నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షోకి శ్రీకాంత్ వాళ్ల టీమ్ గెస్ట్ గా వచ్చారు. ఇక అక్కడ శ్రీకాంత్ కాలుకి పట్టిని చూశాడు నాగార్జున. వెంటనే ఏమైందని ప్రశ్రించాడు. శ్రీకాంత్ దానికి బదులుగా దేవర షూటింగ్ లో గాయమైందని సమాధానం ఇచ్చాడు. దీనికి నాగార్జున రియాక్ట్ అవుతూ ఈ గాయానికి కారణం తారక్ కాదు కదా అని జోక్ గా ప్రశ్నించాడు. దానికి శ్రీకాంత్ అయ్యెయ్యో తారక్ ఏమి కారణం కాదంటూ సమాధానం ఇచ్చాడు శ్రీకాంత్.
గాయనికి కారణం
గోవా , గోకర్ణ ప్రాంతాల్లో దేవర మూవీ షూటింగ్ చేస్తున్నాం. బీచ్ లో షూటింగ్ స్పాట్ కి కొంచెం దూరం ఇసుకలో నడిచి వెళ్లాలి. ఆ సందర్భంలో ఇసుకలో కాలు బెణికింది. చిన్న దెబ్బే అనుకోని పట్టించుకోలేదు. కానీ నిద్ర లేచిన తరువాత చూస్తే కాలు వాచిపోయి కనిపించింది. డాక్టర్ దెగ్గరకి వెళ్తే రెస్ట్ తీసుకోవాలని అన్నారు. కానీ వినకుండా నేను షూటింగ్ కి వెళ్ళిపోయాను దేవర మూవీ షూటింగ్ పూర్తి చేసే వచ్చాను అని శ్రీకాంత్ చెప్పుకోచ్చాడు. ఇలా శ్రీకాంత్ గాయం విషయం నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో సినిమా కోసం కాలికి అయిన గాయాన్ని కూడా పట్టించుకోకుండా షూటింగ్ పూర్తి చేసుకోవటంతో ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. డాక్టర్ రెస్ట్ తీసుకోవాలి అని చెప్పినా వినకుండా శ్రీకాంత్ పడిన కష్టానికి నటన పై ఉన్న డెడికేషన్ కి ప్రేక్షకులు గ్రేట్ అంటున్నారు.
దేవర మూవీలో నటిస్తున్న ప్రముఖులు Srikanth
ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా దేవర. ఇక ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుందట. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, షైన్ టామ్, మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు. ఈ మధ్యకాలంలో శ్రీకాంత్ విలన్ రోల్ లో కనిపిస్తున్నాడు మరి… దేవర మూవీలో శ్రీకాంత్ విలన్ గానా లేక కీలకపాత్రలో కనిపించబోతున్నాడో లేదో చూడాలి. మిక్కిలినేని సుధాకర్ తో కలిసి నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.