Trisha
హీరోయిన్ త్రిష పై అసభ్యకరమైన మాటలు మాట్లాడిన తమిళ నటుడు మన్సూర్ఆలీఖాన్ పై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. తమిళనాడు పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మన్సూర్ వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మహిళల పట్ల కనీస గౌరవం లేని వ్యక్తి అంటూ విరుచుకుపడుతున్నారు మహిళా సంఘాల నేతలు. మన్సూర్ మాటలకు పలువురు సెలబ్రేటీలు రాజకీయ నాయకులు, అభిమానులు కూడా మన్సూర్ పై ఫైర్ అవుతున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే అతగాడిపై పెద్ద ఎత్తున ట్రోలింగే మొదలైంది. దాంతో తానేం తప్పు చేశాడో తెలుసుకున్నాడు మన్సూర్ ఆలీఖాన్.
ఇంతకీ మన్సూర్ ఏమన్నాడు? Trisha
మన్సూర్ అలీఖాన్ మాట్లాడిన మాటలకి అందరు ఫైర్ అవ్వడానికి కారణాలు ఏంటి…అసలు ఈయన ఏం మాట్లాడాడు? అన్న విషయానికి వస్తే… తాను చాలా సినిమాల్లో రేప్ సీన్లలో నటించినట్లు, ఆ పాత్రలలో జీవించినట్లు మన్సూర్ తెలిపాడు. అలాగే లియో సినిమాలో హీరోయిన్ త్రిష తో ఓ రేప్ సీన్ చేసే అవకాశం ఉంటుందని తాను భావించానని కానీ అదేం లేకపోవడం తనను నిరాశపరిచిందనీ అన్నాడు. ఓ ఇంటర్వ్యూలో మన్సూర్ మాట్లాడిన ఈ మాటలు సంచలనంగా మారాయి. తోటి కళాకారిణి పట్ల ఎవరైనా ఇలా మాట్లాడతారా? మన్సూర్ అసలు మనిషేనా? సంస్కారముందా? అంటూ అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మన్సూర్ పై ఫైర్ అయిన త్రిష
మన్సూర్ మాట్లాడిన మాటలపై ఇటు త్రిష కూడా తీవ్రంగా స్పందించింది. ఆ మాటలు నా దృష్టికి వచ్చాయి.. అలాంటి నీచమైన వ్యక్తితో అలాంటి సీన్ పంచుకోనందుకు చాలా ఆనందంగా ఉంది. ఇకపై కూడా నటించకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటాను…. ఇలాంటి నీచమైన వ్యక్తులు సిని పరిశ్రమకు చీడ పురుగులు లాంటి వారు అంటూ ఫైర్ అయింది త్రిష. ఇలాంటి వాళ్లు ఉండటం వల్ల మన జాతికే సిగ్గుచేటు అంటూ ఆవేశంగా మాట్లాడింది. తమిళనాడు ఇండస్ట్రీలోని ప్రముఖులు, దర్శకుడు లోకేశ్ కనగరాజ్, నటి మాళవికా మోహనన్, గాయని చిన్మయి, త్రిష అభిమానులు త్రిషకి మద్దతుగా నిలిచారు. మన్సూర్ అలీఖాన్ ప్రవర్తనపై మండిపడుతున్నారు. Trisha
త్రిషని క్షమాపణలు కోరిన మన్సూర్
అందరూ తిరగబడే సరికి మన్సూర్ కి తానేం తప్పు చేశాడో తెలిసివచ్చినట్లుంది. దెబ్బకి త్రిషను క్షమాపణలు కోరుతూ సోషల్ మీడియాలో ఓ నోట్ ను షేర్ చేశాడు. అందులో త్రిషపై తనకెంతో మంచి అభిప్రాయం ఉందన్నాడు. ఆమెను గౌరవిస్తున్నానని చెప్పాడు. సరదగా చేసిన కామెంట్లకు ఇలాంటి దుమారం చెలరేగుతుందనుకోలేదు. నా మాటలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు. నా కామెంట్లపై విపరీత అర్ధాలు తీసి నా పై రాజకీయాలు చేస్తున్నారు. నా సినిమా ఆఫర్ల పై ప్రభావితం చేసేందుకే ఇలా చేస్తున్నారు. స్త్రీల పట్ల నాకెంతో గౌరవం ఉంది. నేను గతంలో చాలా మంది నటీమణులతో పనిచేశాను. నేనెప్పుడూ ఎవరితోనూ అసభ్యకంరంగా ప్రవర్తించలేదు… అని తమిళంలో ఆ నోట్ లో రాసుకొచ్చాడు మన్సూర్ అలీఖాన్. Trisha