Australia’s Mitchel Marsh
వాల్డ్ కప్ ముగిసి రెండు రోజులు గడుస్తున్నా… ఇంకా దాని చుట్టూనే చర్చలు జరుగుతున్నాయ్. ఆసీస్ కప్పును ఎగరేసుకు పోవడం కోట్లాది మంది టీమిండియా అభిమానులను నిరాశకు గురిచేసింది. మరోవైపు గెలుచుకున్న కప్పును మరీ తీసి పారేస్తున్నారంటూ ఆసీస్ ఆటగాళ్లపైనా ట్రోలింగ్ మొదలైంది. దీనికి ఓ కారణముంది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ మిచెల్ మార్ష్ ప్రపంచ కప్ పై కాళ్లు పెట్టుకు కూర్చోడం నెట్టింట వైరల్ గా మారింది. గెలిచిన మూడ్ లో షాంపేన్ బాటిల్ తో రిలాక్స్ అవుతున్న ఆస్ట్రేలియన్ బ్యాట్స్ మెన్ మిచెల్ వాల్డ్ కప్ పై కాళ్లు చాపుకు కూర్చున్నాడు. ఈ ఫోటో చూసిన వారంతా ఇదేం బుద్ధంటూ బుగ్గలు నొక్కుకుంటున్నారు. ప్రపంచ కప్ అంటేనే ఒక మధురానుభూతి.. ఇంత మంచి గెలుపును ఎంత బాగా దాచుకోవాలి గుండెల్లో.. ఆస్ట్రేలియాకు కప్ ఇవ్వడం మొరటోడికి మొగలి పువ్వు ఇచ్చినట్లే ఉందంటూ సోషల్ మీడియాలో ఆ టీమ్ పై పెద్ద పెట్టున దాడి జరుగుతోంది. వాల్డ్ ట్రోఫీని ఇంత అగౌరవంగా ట్రీట్ చేస్తారా అంటూ ట్వీట్ల వర్షం హోరెత్తుతోంది.
మరో ఫోటో వైరల్ చేసిన ఆసీస్ Australia’s Mitchel Marsh
అయితే ఈ అంశంపై ఆస్ట్రేలియా మొదట్లో పెద్ద పట్టించుకోలేదు. కానీ విమర్శలు ఎక్కువవుతుండటంతో అది మార్పింగ్ ఫొటో అంటూ బుకాయించింది. వాల్డ్ కప్ ను టెక్నాలజీతో తీసేసి మిచెల్ పక్కనున్న టేబుల్ పై కాళ్లు పెట్టుకున్నట్లుగా మరో ఫొటో వైరల్ చేసింది. ఆస్ట్రేలియా గెలుపును జీర్ణించుకోలేక అక్కసుతోనే ఎవరో ట్రోఫీపై కాళ్లు పెట్టుకున్నట్లు మార్ఫ్ చేశారని చెప్పడం ఆస్ట్రేలియా ఉద్దేశం కావొచ్చు.. కానీ అప్పటికే లేట్ అయిపోయింది. మిచెల్ పై ఇటు ఇండియాలోనూ క్రికెట్ ప్రేమికులు విరుచుకుపడ్డారు.
వాల్డ్ కప్ అంటే మనది గౌరవ భావం
1983లోనూ, ఆ తర్వాత వాల్డ్ కప్ ను గెలిచినప్పుడు ఇండియా కప్పును ఎంత గౌరవంగా తీసుకొచ్చింది ఇంటికి. ధోనీ ప్రపంచకప్ ను ఏదో దేవుడి విగ్రహాన్ని తెచ్చినంత గౌరవ భావంతో ఇంటికి తీసుకొచ్చాడు. ఇక సచిన్ అయితే కప్ ను ముద్దాడి తన గౌరవాన్ని చాటాడు. ఇలా మన క్రికెటర్లందరూ ప్రపంచ కప్ కు ఇవ్వాల్సినంత గౌరవం ఇచ్చారు. సాధారణంగా ఇలా పోటీలలో కప్పు గెలిస్తే దానిని అద్దాల బీరువాలోనో, షో కేస్ లోనో పెట్టుకుంటాం మనం… కానీ ఆస్ట్రేలియాకి మాత్రం ప్రపంచ కప్ విలువ తెలీదంటూ సోషల్ మీడియాలో క్రికెట్ ప్రేమికులు కామెంట్లు పెట్టారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. WC
విజయం అలవాటైతే నిర్లక్ష్యం ?
ప్రతీ సారీ గెలుపు విజేతలో ఇలా నిర్లక్ష్యాన్ని లెక్క లేని తనాన్ని పెంచుతుందా? ఆస్ట్రేలియా ఇప్పటి వరకూ గెలవని ట్రోఫీ అంటూ లేదు. వన్డే వాల్డ్ కప్, టీ 20 వాల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఐసీసీ టెస్ట్ ట్రోఫీ ఇలా ప్రతీ సీరిస్ ను గెలుచుకుంది. ఓ మాటలో చెప్పాలంటే వాళ్లకి గెలుపు అలవాటైన అంశం. చాలా మామూలు విషయం.. అందుకే వాల్డ్ కప్ కూడా వాళ్లకు పెద్ద అంశంగా కనపడి ఉండదు. ఏ క్రీడారంగమైన ఆస్ట్రేలియా గెలుపు శాతం ఎక్కువే.. ఒలింపిక్స్ లోనూ ఆ దేశం పతకాలు గట్టిగానే గెలుస్తుంది. కాబట్టి గెలుపు వాళ్లకి సాధారణ అంశం.. మనకు ప్రయత్నిస్తే, అదృష్టం కలిసొస్తేనే అతి కష్టం మీద దక్కే పతకాలు వాళ్లకు అలవోకగా వచ్చేస్తాయి. దానికి వాళ్ల టాలెంట్ కారణం కావొచ్చు. అందుకే వాళ్లకు కప్పులు, మెడల్స్ పెద్ద లెక్క కాకపోవచ్చు. మిచెల్ కప్పుపై కాళ్లు పెట్టుకుని రిలాక్స్ అవడానికీ అదే కారణం అయి ఉండొచ్చు. ఇది పెద్ద అంశం కాదని కొందరు అంటున్నా.. అన్నిరోజుల వరస మ్యాచ్ ల కష్టం కప్పు రూపంలో ప్రతిఫలించినప్పుడు దానిని గౌరవిస్తే వచ్చే మజా వేరు.. కానీ విజయం కామన్ అయిపోయినప్పుడు కప్పు మీద కాళ్లు పెట్టుకుంటే ఆ కిక్కే వేరప్పా అంటొంది ఆస్ట్రేలియా.. ఏం చేద్దాం? WC