Sallar
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ప్రభాస్. ఇక ఈ డైనోసర్ సలార్ మూవీతో మన ముందుకు వస్తున్నాడు. ఈ మూవీని కెజియఫ్ సిరీస్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా స్టార్, పాన్ ఇండియా డైరెక్టర్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రానుంది. ఇప్పటి వరకు వరస పోస్ట్ పోన్ లతో కొనసాగిన సలార్ మూవీని డిసెంబర్ 22న రిలీజ్ చేయడానికి రెడీ గా ఉంది. ప్రభాస్ బర్త్ డే రోజున ఏ సినిమా లేకపోవటంతో నిరాశ పడ్డారు ఫ్యాన్స్ ఇక ఈ వార్తతో ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. రిలీజ్ డెట్ చెప్పి ఫ్యాన్స్ ను సంతోషరిచిన మేకర్స్ ఇక రిలీజ్ దగ్గర పడుతున్న తరుణంలో ట్రైలర్ డెట్ రివీల్ చేసి ఫ్యాన్స్ ఉన్న ఉత్సాహాన్ని మరికొంచెం రెట్టింపు చేశారు మేకర్స్. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేవు… తెగ సంబర పడుతున్నారు.
ట్రైలర్ డేట్ ఫిక్స్: Sallar Salar
నెల రోజుల్లో రిలీజ్ కి దగ్గర పడుతున్న తరుణంలో సలార్ ట్రైలర్ డేట్ ను ఫిక్స్ చేశారట. పది రోజుల్లో సలార్ ట్రైలర్ బయటకి రానుందట. డిసెంబర్ 1న సాయంత్రం 7:19 నిమిషాలకి సలార్ ట్రైలర్ రానుందట. ట్రైలర్ రిలీజ్ డేట్ రావటంతో ఫ్యాన్స్ పుల్ జోష్ లో ఉన్నారు. పది రోజుల్లో రాబోతుందంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. గతంలో ప్రభాస్ ఫేస్ రివీల్ చేయకుండా కట్ చేసిన సలార్ టీజర్ రిలీజైన 24 గంటల్లో 100 మిలియన్ వ్యూస్ రాబట్టింది. సలార్ టీజర్ వ్యూస్ లతో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇక ట్రైలర్ ఏ రేంజ్ లో డిజిటల్ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి. ప్రభాస్ లేకుండానే టీజర్ రికార్డ్ ను సృష్టించింది మరి ఇక ట్రైలర్ హైప్ నెక్ట్స్ లెవల్ కి వెళుతుందని గ్యారెంటీగా చెప్పవచ్చు.
సలార్, డంకీ సినిమాల మధ్య బిగ్గెస్ట్ వార్?
టాలీవుడ్ లో ప్రభాస్ సినిమా సలార్ డిసెంబర్ 22న రిలీజ్ అవుతుంది… బాలీవుడ్ లో షారుక్ ఖాన్ మూవీ డంకీ డిసెంబర్ 21న రిలీజ్ అవుతుంది. అయితే ప్రభాస్, షారుఖ్ ఖాన్ మధ్య బిగ్గెస్ట్ వార్ జరగబోతుంది. ఒక్క రోజు గ్యాప్ లో కింగ్ ఖాన్, డైనోసర్ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీస్ తో మన ముందుకు వస్తున్న స్టార్స్ సినిమాలకు ఫ్యాన్స్ మధ్య కూడా వార్ జరుగుతుంది. ఇప్పటికే సోషల్ మీడియార్ లో ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఫామ్ లో ఉన్న కింగ్ ఖాన్ దెబ్బకి డైనోసర్ పని అయిపోతుందని షారుఖ్ ఫ్యాన్స్ అంటుంటే సలార్ దెబ్బకి డంకీ సినిమా గల్లంతవుతుందంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. డంకీ, సలార్ సినిమాలు పోటా పోటిగా రానున్నాయి… ఏ సినిమా ఎంత హిట్ అవుతుందో ఎన్ని కోట్లు కలక్షన్ రాబడుతుంది అనే విషయం తెలియాలి అంటే డిసెంబర్ 21-22 వరకు ఎదురు చూడాలి.