Kaathal – The Core
72 ఏళ్లు వచ్చిన యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు మమ్ముట్టి. 1971 అనుభవాలె పాలిచకల్ మూవీ లో నటించి ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు మమ్ముట్టి. 400కి పైగా సినిమాలు చేసి కళాంమ్మతల్లి ఒడిలో ఒదిగాడు. కేరళ సినిమాలో మెగా స్టార్ గా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, ఆంగ్ల, పలు భాషల్లో చిత్రాల్లో నటిస్తున్నాడు. థియేటర్స్ సందడి చేయడానికి కాథల్-ది కోర్ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు మమ్ముట్టి. ఈ సినిమాలో ముమ్ముట్టి-జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించారు. మొదటి సారి వీరిద్దరూ కలిసి నటించిన సినిమా కాథల్-ది కోర్. జీయో బేబి దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా నవంబర్ 23న థియేటర్స్ లో రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని త్వరలోనే ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ కేరళలోనూ ప్రదర్శంచనున్నారట. రేపు విడుదల కానున్న తరుణంలో సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ వార్తతో చిత్ర పరిశ్రమంతా షాక్ అయింది. ఈ వార్తలు సోషల్ మీడియాలో హట్ టాపిక్ గా మారాయి.
సినిమాను బ్యాన్ చేసిన ముస్లిం దేశాలు
కాథల్-ది కోర్ సినిమాను రెండు దేశాల్లో బ్యాన్ చేశారట. అలాగే మరికొన్ని దేశాలు కూడా అదే బాటలో ఉన్నట్లు సమాచారం. ఇక ఈ వార్త సిని ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. విడుదలకి ముందే ఈ సంఘటన జరగటం సంచలనంగా మారింది. ఆ రెండు దేశాలు ..కువైట్, కతార్ దేశాలు రిలీజ్ కి ముందే వాళ్ల దేశాల్లో బ్యాన్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. బ్యాన్ చేసే సన్నివేశాలు అసలు ఆ సినిమాలో ఏం ఉన్నాయి?
నిషేధానికి అదే కారణమా?
కాథల్-ది కోర్ సినిమా స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేలా ఉందట. అందుకే ఆ రెండు దేశాల్లో నిషేధించడానికి ప్రధాన కారణం అంటున్నారట. ఈ సినిమాలో మమ్ముట్టి హోమోసెక్సువల్ గే పాత్రలో నటించారట. అందుకే అక్కడ సెన్సార్ అభ్యంతరం చెప్పిందని సమాచారం.
మూవీ స్టోరి: Kaathal – The Core
ఉద్యోగం నుంచి రిటైర్ అయిన జార్జ్ పాత్రలో మమ్ముట్టి తన భార్య ఓమన పాత్రలో జ్యోతిక కలిసి నివసిస్తుంటారు. పంచాయతీ ఎన్నికలకు పోటీ చేయాలని నిర్ణయించుకుని నామినేషన్ వేస్తాడు మమ్ముట్టి. ఆ తర్వాత రెండు రోజులకు ఓమన అతడి నుంచి విడాకుల కోసం కోర్టును వెళ్లుతుందట. అదే గ్రామంలో డ్రైవింగ్ స్కూల్ నడుపుతోన్న ఓ స్నేహితుడితో జార్జ్ గత కొన్నేళ్లుగా స్వలింగ సంపర్క బంధం కొనసాగిస్తున్నాడని ఓమన ఆరోపిస్తుందట. జార్జ్ లైంగిక సంబంధాన్ని తాను నేరంగా చూడడం లేదని కేవలం విడాకులు కోరుతున్నట్లు చెబుతుందట. ఓమన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తాడు జార్జ్. కోర్టులో కేసు వేసిన తరువాత ఏం జరిగింది? జార్జ్ కి ఓమన కి విడాకులు వస్తాయా? జార్జ్ ఎన్నికల్లో పోటీలో గెలిచాడా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే
కథల ఎంపిక బాగుంటుంది : జ్యోతిక ఓ ఇంటర్య్వూలో జ్యోతిక మాట్లాడుతూ మమ్ముట్టి కొత్త ప్రయోగాలు చేసేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటారని, వైవిధ్యమైన కథలను ఎంచుకుంటారని చెప్పింది. ఆయనతో కలిసి నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా, గౌరవం ఉందని తెలిపింది జ్యోతిక.