చైనాలో మళ్లీ కరోనా CORONA తిరగబెడుతోందా? ఈసీజన్ లో అనూహ్యంగా పెరుగుతున్న శ్వాసకోశ వ్యాధులు, నిండుతున్న ఆస్పత్రులు చూస్తుంటే మళ్లీ వైరస్ విజృంభిస్తోందేమోనన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్యసంస్థ దీనిపై వివరణ ఇవ్వాలని చైనాను కోరినా ఆదేశం పట్టించుకున్న పాపాన పోలేదు. తాజాగా తమ దేశంలో ఎలాంటి కొత్త వైరస్ లు పుట్టుకు రాలేదని, కేవలం జలుబు, దగ్గు లాంటి సీజనల్ వ్యాధులతోనే జనం ఆస్పత్రుల పాలవుతున్నారని ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ నుంచి చైనాలో శ్వాసకోస సంబంధిత సమస్యలతో ఆస్పత్రులు నిండుతున్నాయని చైనా ఇంటెలిజెన్స్ విభాగం సమాచారముంది.
స్కూళ్లకు తాత్కాలిక శెలవులు
బీజింగ్, లియోనింగ్ నగరాల్లోని ఆసుపత్రులు బాధిత చిన్నారులతో కిక్కిరిసిపోతున్నాయి.
దీంతో ఈ అంటువ్యాధి ప్రబలకుండా చైనాలోని స్కూళ్లకు తాత్కాలికంగా సెలవులు ప్రకటించారు.
టీచర్లలో కూడా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తుండడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
చైనాలో కరోనా నియంత్రణ కోసం విధించిన ఆంక్షలు ఎత్తివేయడంతో ఇన్ప్లూఎంజా, మైకో ప్లాస్మా, న్యూమోనియా, శ్వాసకోశ సిన్సిటియల్ వైరస్ వంటి అంటువ్యాధులు వస్తున్నాయి.
ఈ వ్యాధికారక వ్యాప్తికి చైనా అధికారుల నిర్లక్ష్యమే కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
మూడేళ్ల నుంచి ఇదే తీరు CORONA
డబ్ల్యూహెచ్ఓ ప్రకారం గత మూడు సంవత్సరాల్లో ఇదే కాలంలో ఉత్తర చైనాలో ఇన్ఫ్లుఎంజా అనారోగ్యం పెరుగుతోంది. పిల్లలలో శ్వాసకోశ వ్యాధుల పెరుగుదల, న్యుమోనియా కేసులు పెరగడంపై సమాచారం ఇవ్వాలని డబ్ల్యూహెచ్ఓ చైనాను కోరింది.. ఇన్ఫ్లుఎంజా, శిశువులను ప్రభావితం చేసే ఆర్ఎస్వీ, మైకోప్లాస్మా న్యుమోనియాతో సహా తెలిసిన వ్యాధికారక వ్యాప్తిలో ఇటీవలి పోకడలపై కూడా డబ్ల్యూహెచ్ఓ అదనపు సమాచారాన్ని కోరింది. ఈలోగా టీకాలు వేసుకోవడం, అనారోగ్య వ్యక్తుల నుంచి దూరంగా ఉండడం, మాస్కులు ధరించడం వంటి నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలను కోరింది.
కరోనా గురించి చెప్పినదీ ఈ సంస్థే?
చైనాలో వ్యాపిస్తున్న ఈన్యుమోనియా వ్యాధి గురించి ప్రోమెడ్ బయటపెట్టింది. ప్రోమెడ్ అనేది ప్రపంచ దేశాల్లో మనుషులు, జంతువుల్లో వ్యాపించే వ్యాధుల గురించి ట్రాక్ చేసే సర్వైవలెన్స్ ప్లాట్ఫామ్. ఈ ప్రోమెడే చైనాలోని న్యుమోనియో వ్యాప్తి గురించి బయటి ప్రపంచానికి చెప్పింది. 2019లో చైనాలో పుట్టిన కరోనా గురించి ఈ ప్రోమెడ్ సంస్థనే మొదట బయటపెట్టింది. అయితే చైనాలో ప్రస్తుత న్యుమోనియా వ్యాధి ఎప్పుడు మొదలైందనే విషయం స్పష్టంగా తెలియదని ప్రోమెడ్ తెలిపింది. అయితే ఈ న్యుమోనియా కూడా మరో కరోనా మహమ్మారి మాదిరిగా మారుతుందా? లేదా అనేది కూడా ఇప్పుడే చెప్పలేమని వివరించింది. అయితే దీని కారణంగా మరోసారి కరోనా తరహా విలయం తప్పదేమోననే భయం కూడా పలువురిలో ఉంది.
CORONA కొట్టిన దెబ్బ మమూలుది కాదు
2019 చివర్లో చైనా నుంచి వ్యాప్తి చెందిన కరోనా మహమ్మారి మొత్తం ప్రపంచాన్ని తన గుప్పెట్లో చేసుకుని ఎలా భయపెట్టిందో అందరికీ తెలిసిందే. ప్రపంచం మొత్తం కరోనా దెబ్బకు స్థంబించిపోయింది. కోట్లాదిమంది కరోనా వ్యాధికి గురయ్యారు. లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. మరణ మృదంగం మోగించిన కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం కోలుకుంటోంది. చైనా నుంచి మొదలైన ఈ వ్యాధి మొత్తం ప్రపంచాన్ని రెండున్నరేళ్లు వెంటాడింది. ఇప్పుడు అదే చైనా నుంచి మరో కొత్త వ్యాధి వ్యాపిస్తుండటం ఆందోళనగా మారింది. విద్యాసంస్థలు మూతపడనున్నాయంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
CORONA