Devara-War
RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా హవా నడిపిస్తున్నాడు ఎన్టీఆర్. తాతకి తగ్గ మనవడిగా ఇప్పటికే రుజువు చేసుకున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివ-యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ దేవర. రెండు భాగాలుగా రాబోతున్న ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపిస్తున్నాడు. దేవర మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అది విన్న ఆడియన్స్ షాక్ అవుతున్నారు. ఇక టాలీవుడ్ కే పరిమితం అయిన ఈ గ్లోబల్ స్టార్ ఇప్పుడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఈ సినిమా నుంచి లెటేస్ట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. వరుస అప్డేట్ లతో ఫ్యాన్స్ ని ఆనంద పరుస్తున్నారు మేకర్స్.
దేవర మూవీలో నాటు నాటు కు మించిన సాంగ్ ?
RRR మూవీలో నాటు నాటు పాట ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ పాటకి వేసిన మాస్ స్టెప్స్ కి ఫిదా కాని వారంటూ లేరు. నాటు నాటు స్టెప్స్ కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ సైతం చిందులేసారు. ఈ పాటకి ఆస్కార్ కూడా వచ్చింది. కొరియోగ్రఫీ చేసిన ప్రేమ రక్షిత్ కి మంచి పేరు వచ్చింది. ఇక దేవర మూవీలో కూడా ఓ పాటకి మంచి స్టెప్స్ ను కొరియోగ్రఫీ చేయనున్నాడట రక్షిత్.
ఇక పాటలో ఏకంగా 200 మంది డాన్సర్స్ తో అదిరిపోయే సాంగ్ ప్లాన్ చేశాడట ప్రేమ్ రక్షిత్. ఇక ఈ పాట కోసం భారీ సెట్ కూడా వేయనున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో దేవర మూవీని రిలీజ్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే పాన్ ఇండియా రేంజ్ ని ప్రతిబింబించే పాటగా దీన్ని డిజైన్ చేస్తునాడట రక్షిత్. ఇప్పటికే గోవా షెడ్యూల్లో ఎన్టీఆర్, జాన్వికపూర్ పై రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరించినట్లు సమాచారం. దేవర మూవీకి కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.
బాలీవుడ్ లోకి ఎంట్రీ: Devara-War
టాలీవుడ్ లో తన సత్తా చూపించిన ఎన్టీఆర్ ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. యష్ రాజ్ ఫిలింస్ బ్లాక్ బస్టర్ వార్ కి సీక్వెల్ గా వార్-2 రానున్న సంగతి తెలిసిందే. వార్-2 లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. హృతిక్ రోషన్ పై ఉన్న సన్నివేశాలను స్పెయిన్ లో చిత్రికరించారట. ఇక దేవరతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ వార్-2 లో నటించడానికి ఫిబ్రవరిలో ఈసినిమా సెట్ లోకి అడుగుపెట్టబోతున్నాడట. ఎన్టీఆర్ పై భారీ యాక్షన్ షెడ్యూల్ ను మొదట చిత్రకరించబోతున్నారట. ఎన్టీఆర్ కి జోడిగా హీరోయిన్ ఎవరు అనేది ఇంక అధికార ప్రకటన లేదు. అయితే ఎన్టీఆర్ కి జోడిగా శార్వారి హీరోయిన్ గా నటిస్తుందని సిని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈమెకు బాలీవుడ్ లో పెద్దగా క్రేజ్ లేదు. ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వటంతో ఫ్యాన్స్ తెగ సంబర పడుతున్నారు. అయితే దానికి తగ్గట్టే నిరాశ పడుతూ సలహాలు ఇస్తున్నారు ఫ్యాన్స్. హీరోయిన్ గా ఎన్టీఆర్ సరసన శార్వారి వద్దంటూ సోషల్ మీడియాలో గోల చేస్తున్నారు. ఎన్టీఆర్ సరసన స్టార్ హీరోయిన్లను ఎంపిక చేయాలి కానీ శార్వారిని ఎందుకు ఎంపిక చేశారని డైరెక్టర్ పై మండి పడుతున్నారు ఫ్యాన్స్. అయితే ఎన్టీఆర్ సరసన శార్వారి నటిస్తుందని అధికారిక ప్రకటన లేదు కానీ ఫ్యాన్స్ మాత్రం గోల చేస్తున్నారు. ఎన్టీఆర్ కి జోడిగా ఏ హీరోయిన్ నటిస్తుందో చూడాలి.