Ileana-Husband
తన అందంతో, సైజ్ జీరో నడుముతో కొంటె కుర్రాలకు కలల రాణి పేరు సంపాదించింది ఇలియానా. ఒకప్పుడు కుర్రకారు ఇలియానా అంటే పడి చచ్చేవారు.. మగధ శిల్పం అంటూ మైమరచిపోయేవారు. దేవదాసు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. పోకిరీ,జల్సా లాంటి సినిమాలతో పిచ్చ క్రేజ్ సంపాదించింది. టాలీవుడ్ లో నటించింది కొన్ని సినిమాలే అయిన స్టార్ హీరోలతో జోడి కట్టింది ఈ గోవా సుందరి. చివరగా తెలుగులో అమర్ అక్బర్ అంథోనీ నటించింది. తాజాగా సోషల్ మీడియా ఫ్యాన్స్ తో చిట్ చాట్ మొదలు పెట్టింది ఈ బ్యూటీ. అందులో కొన్ని ఆసక్తి కరమైన విషయాలు బయట పెట్టింది. చిట్ చాట్ లో తన భర్త ఎవరో రివీల్ చేసింది ఈ గోవా బ్యూటీ.
ఇలియానా భర్త ఎవరు Ileana-Husband
ఇలియనా ఫ్యాన్స్ తమ ప్రశ్నలకు సమాధానం దొరికిందంటూ సంతోష పడుతున్నారు. తాజాగా ఇలియనా సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ మొదలు పెట్టింది. అందులో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు క్యూట్ గా సమాధానం ఇచ్చింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ మీరు మీ బిడ్డను ఒంటరిగా ఎలా పెంచుతున్నారు అంటూ ప్రశ్నించారు. ప్రశ్నకి బదులుగా ఇలియనా నేను సింగిల్ పేరెంట్ కాదు అంటూ తన భర్త ఫోటో రివీల్ చేసి సస్పెన్స్ కి తెర దించింది.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలోనే డేట్ నైట్ అంటూ లవ్ సింబల్ ను జోడించి ఉన్న ఫోటోను ఇన్ స్టా లో రివీల్ చేసిన విషయం అందరికి తెలిసిందే. తాజాగా ఆ ఫోటోలో ఉన్న వ్యక్తే తన భర్త అని స్పష్టంగా చెప్పింది. దీంతో ఇలియానా బిడ్డకు తండ్రి ఎవరన్న ప్రశ్నకు సమాధానం దొరికెసిందంటూ సంతోష పడుతున్నారు ఫ్యాన్స్ . ఇక ఇదే చిట్ చాట్ లో మాట్లాడుతూ త్వరలోనే మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తానని ప్రస్తుతం అమ్మగా తన భాద్యతను నిర్వర్తిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఇంటరాక్షన్ లో ఇలియానా భర్త ఎవరో తెలిసినందుకూ ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు. అయితే ఇలియానా బోయ్ ఫ్రెండ్ నే పెళ్లాడిందా? లేక మరెవరినైనా చేసుకుందా అన్నది మాత్రం క్లారిటీ లేదు.
బేబి బంప్ తో కనిపించి అందరికి షాక్ Ileana-Husband
మూవీస్ కి బ్రేక్ ఇచ్చి సడన్ గా బేబీ బంప్ తో కనిపించి అందిరిని షాక్ గురిచేసింది ఈ బ్యూటీ. పెళ్లి చేసుకోకుండా బేబీ బంప్ తో కనిపించడం…లవర్ పేరు చెప్పకుండా సడన్ గా తల్లి కాబోతున్నా అంటూ అనౌస్స్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఈ ఏడాది అక్టోబర్ 1న మగబిడ్డకి జన్మనిచ్చింది. ఆ బాబు ఫేస్ ను కూడా రివీల్ చేసింది. ఆ బాబుకి కోవా ఫీనిక్స్ డోలర్ అని పేరు పెట్టింది.
మూవీస్ అఫర్స్ లేక కెరీర్ కు బ్రేక్
టాలీవుడ్ లో ఆఫర్స్ లేకపోవటంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి వరస సినిమాల్లో నటిస్తుంది. తెలుగులో పెద్దగా ఆఫర్స్ లేక బాలీవుడ్ లో ఆఫర్స్ ఉండటంతో తన సత్తా చూపించింది గోవా బ్యూటీ. రిసెంట్ గా బాలీవుడ్ లో కూడా గ్యాప్ ఇచ్చింది ఈ లేడీ. బాబు పెద్దయ్యాక మళ్లీ కెరీర్ పై దృష్టి పెడతానంటోంది ఇలియానా. మరి ఈ బ్యూటీకి ఏం అవకాశాలు వస్తాయో చూడాలి.