NBK
యాక్షన్ మూవీస్ కి పెట్టింది పేరు నందమూరి బాలకృష్ణ. మూవీ కెరీయర్ స్టార్ట్ చేసి దాదాపుగా 50 ఏళ్లు అవుతోంది.. ఆయన నటనకి గాను నటసింహ బిరుదు దక్కించుకున్నాడు. యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు ఈ నటసింహ. నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలుస్తున్నాయి. ఈ మధ్యకాలంలో బాలయ్య నటించిన మూవీస్ 100కోట్ల కలెక్షన్ రాబట్టినవే ఎక్కువగా ఉన్నాయి. రీసెంట్ గా భగవంత్ కేసరి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.
ఈ సినిమా నేడు ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ లో భగవంత్ కేసరి సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. వరస సినిమాలు చేస్తూ హిట్ లతో దూసుకుపోతున్నాడు బాలయ్య. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో మరొక మూవీతో మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మైంట్స్ సంస్థ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట.
విలన్ రోల్ లో బాలీవుడ్ నటుడు?
బాలయ్య-బాబీ కాంబినేషన్ మూవీలో మలయాళం నుంచి దుల్కర్ సల్మాన్ ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడట. ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు గౌతమ్ వాసుదేవ మీనన్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడట. బాబీ ఈ మూవీలో విలన్ రోల్ కోసం వెతుకులాట మొదలు పెట్టాడట. ఎవరు సెట్ అవుతారు అని అన్ని భాషల చిత్ర పరిశ్రమల్లోనూ వెతుకుతున్నాడని సమాచారం. తాజాగా విలన్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం.
ఈ మూవీలో విలన్ గా బాలీవుడ్ హీరో బాబీడియోల్ ని ఎంపిక చేశాడట బాబీ. బాలయ్య మూవీ అన్ని ఇండస్ట్రీ వాళ్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారని అర్థం అవుతుంది. దీన్ని బట్టి తొలిసారి బాలయ్య మూవీ పాన్ ఇండియా సినిమా చేయనున్నారని అర్థం అవుతుంది.
మొదటి సారిగా బాలయ్య సినిమా హిందీలో NBK
ఇన్నాళ్లూ తెలుగుకే పరిమితమైన బాలయ్య ఇక ఇప్పుడు ఇతర భాషలపై దృష్టి సారిస్తున్నాడట.తాజాగా అందిన సమాచారం ప్రకారం బాలయ్య సినిమాను హిందీలో రిలీజ్ చేయబోతున్నారట.రీసెంట్ గా ఆయన నటించిన భగవంత్ కేసరి సినిమా హిందీలో విడుదల కానుందట.ఆ సినిమాకు బాలయ్యే స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నాడట.హిందీ వర్షన్ లో బాలయ్య చెప్పిన హిందీ డైలాగులకూ ఫిదా కానీ వారంటూ లేరు.బాలయ్య గళం, డబ్బింగ్ తో హిందీలోనూ ఈ సినిమా కుమ్మేస్తుందని అంచనాలున్నాయి.
ఓటీటీలో బాలయ్య సందడి NBK
వెండి తెరలో బిజీగా ఉన్న బాలయ్య ఓటీటీలో కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాడు..ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన ఆహాలో అన్ స్టాపబుల్ షోకి హోస్ట్ చేస్తూ ఇప్పటికే రెండు సీజన్ లు పూర్తి చేసుకోని 3వ సీజన్ ను సక్సస్ పుల్ గా హోస్ట్ చేస్తున్నాడు..అన్ స్టాపబుల్ 3వ సీజన్లో తాను నటించిన భగవంత్ కేసరితో టీమ్ తో ముచ్చటించి అందరిని అలరించాడు.ఇక యానిమల్ టీమ్ తో నూ ముచ్చట్లు పెట్టాడు.ఇక రెండవ ఎపిసోడ్ నేడు స్ట్రీమింగ్ అవుతోంది.అటు ఓటీటీలో నేడు(నవంబర్ 25న) భగవంత్ కేసరి సినిమా, ఆహాలో అన్ స్టాపబుల్ ఎపిసోడ్ రెండూ ఒకే రోజు స్ట్రీమ్ అవుతున్నాయి.. బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకోవచ్చు ఇక…
NBK