RAVI TEJA
సినిమా బ్యాక్ గ్రౌండ్ ఏమి లేకుండా సొంత ట్యాలెంట్ ని నమ్ముకోని సిని ఇండస్ట్రీ లో నిలదొక్కుకున్న వ్యక్తి రవి తేజ. కష్టే ఫలి అనే పదానికి నిలువేత్తు నిధర్శనం రవి తేజ. క్యారెక్టర్ అర్టిస్టుగా సిని ఇండస్ట్రీకి పరిచయం అయి ఇప్పుడు హీరోగా తన హవా కొనసాగిస్తున్నాడు..అటు హీరోగా ఇటు ప్రోడ్యుసర్ గా బిజీగా మారిపోయాడు. తన నటనతో ప్రజలని అలరించి వారి మనసులలో మహ నటుడిగా నిలిచిపోయాడు మన మాస్ మహరాజ రవితేజ. తన నటనతో కుర్రకారును బాగా ఆకట్టుకున్నాడు………టాలీవుడ్లో హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పుడు ఈగల్ సినిమాలో నటించబోతున్నాడు.
అనుదీప్ మరియు రవితేజ కాంబినేషన్ లో న్యూ మూవీ: RAVI TEJA
హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా ప్రేక్షకులను కేవలం వినోదాన్ని పంచాలనే ఒకే ఒక్క కాన్సెప్ట్ తో సినిమా మీద సినిమాలను అందిస్తున్నాడు మాస్ మహరాజ్. ఈగల్ తో మన ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే అంతేకాదు ఈ జోరు కొనసాగిస్తూ మళ్ళీ మరొక మూవీకి ఓకే చెప్పాడు ఈ మాస్ మహరాజ్. యంగ్ డైరెక్టర్ అనుదీప్ కేవి దర్శకత్వంలో ఈమూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి జాతి రత్నాలు, ప్రిన్స్ లాంటి మంచి విజయాలను అందుకున్నాడు డైరెక్టర్ అనుదీప్…ఇప్పుడు రవితేజ తో తన తదుపరి సినిమాను చేయబోతున్నారని తెలిసి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో డైరెక్టర్ ఉన్నట్లు సమాచారం.మరి ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తారేమో చూడాలి.డైరెక్టర్ హరి శంకర్ దర్శకత్వంలో రవితేజ ఒక సినిమా చేయబోతున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి.అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ మాత్రం రాలేదు.
సంక్రాంతి బరిలో ఈగల్..???
టైగర్ నాగేశ్వర్రావు తర్వాత….. మాస్ మహరాజా రవితేజ హీరోగా తాజా ’ఈగల్’ సినిమాలో నటిస్తున్నాడు.దీనికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు.తాజాగా మేకర్స్ మూవీ టీజర్ ను విడుదల చేశారు.టీజర్ సినిమాపై మరింత ఆసక్తి రేపుతోంది .సస్పెన్స్,యాక్షన్,థ్రిల్లర్ మూవీగా సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.యాక్షన్ కథాంశంతో రూపోందుతున్న ఈ సినిమాలో రవితేజ కోత్త గెటప్ లో కనిపించనున్నాడు. ఈగల్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రీలీజ్ కానుందట.ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ పైన మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. దీంతో ఈ సివిమా కోసం అభిమానులు ఎంతో అతృతగా ఎదురుచూస్తూన్నారు.
ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్,కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.మధుబాల,నవదీప్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రానికి దావ్ జాంద్ సంగీత దర్శకుడు.. మాస్ మహరాజ్ రవితేజ ఇటీవలే టైగర్ నాగేశ్వరరావు సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఇది స్టువర్టుపురం గజదొంగ ఆయన నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు.ఇందులో నుపూర్ సనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రవితేజ ఈ సినిమాలతో మళ్లీ ఇండస్ట్రీలో నిలబడిపోతాడని టాక్..మరి ఫ్యాన్స్ అంచనాలను ఈ హీరో ఎంత వరకూ నిలబెట్టుకుంటాడో..