Tomato
మన అందరం టమోటాలను ఎక్కువగా వంటలు, కూరల్లో ఉపయోగిస్తాము. ఇది ఆహారం రుచిగా ఉండటం కాకుండా ఆరోగ్య పరంగా కూడా చాలా ప్రయోజనాలున్నాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫైబర్, ఫోలేట్‌తో పాటు క్యాల్షియం సమృద్ధిగా తీసుకోవచ్చు. వీటిని కూరల్లోనే కాకుండా సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. మరిన్ని ప్రయోజనాలు పొందడానికి టమోటా జ్యూస్, సూప్‌ల రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే కొన్ని అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ప్రతి రోజు పరగడుపున ఒక గ్లాస్ టమోటా జ్యుస్ త్రాగితే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. కీళ్లనొప్పులు, కండరాల నొప్పులు ఉన్నవారు టమోటాకు దూరంగా ఉండాలి.
యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం
టమాటాల్లో బీటా కెరోటిన్, లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటి కారణంగానే టమోటాకి ఎరుపు రంగు ఉంటుంది. టమాటాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియంట్లు శరీరంలో కణజాలం నశించకుండా కాపాడతాయి. అలాగే గుండె జబ్బులు రాకుండా కూడా కాపాడతాయి. టమోటాలో ఉండే ఫైబర్ జీర్ణ క్రియ పనితీరును మెరుగుపరచి మలబద్దకం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. టమోటాలో సమృద్ధిగా ఉండే ఫైటో న్యూట్రియంట్లు రక్తం గడ్డకట్టకుండా కాపాడతాయి. దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి.
టమాట జ్యుస్ తో ప్రయోజనాలు… Tomato
గుండెకు ప్రయోజనకరం…
టమాటోలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది గుండెకు చాలా మేలు చేస్తుంది. ఇందులో లైకోపీన్, బీటా కెరోటిన్, విటమిన్ సి వంటి పోషకాలు అధికంగా ఉన్నాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. టమోటాలో సమృద్ధిగా ఉండే లైకోపీన్, విటమిన్ సి, ఇ, బీటాకెరోటిన్లు రక్తంలో చెడు కొలస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలస్ట్రాల్ ని పెంచి గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి. టమాటాతో చూపు స్పష్టంగా ఉంటుంది. శుక్లాలు రాకుండా ఉంటాయి
కళ్లకు, మధుమేహనికి మేలు…
టమోటా రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్లకు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా కంటి చూపును మెరుగుపరుస్తుంది. కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవచ్చు. టమోటా రసంలో విటమిన్ సి, పొటాషియం, కెరోటిన్, విటమిన్ ఇ, ఫోలేట్, కెరోటిన్, ఫ్లేవనాయిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఇమ్యూనిటీ, ట్యాక్సిన్లు కోసం… Tomato
టమోటా రసంలో విటమిన్ సి ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలతోపాటు లైకోపీన్, బీటా కెరోటిన్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను పటిష్ఠంగా మార్చడంలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని మెరుగుపర్చుకోవడానికి టమోటా రసం రెగ్యులర్‌గా తీసుకోవచ్చు. టమోటా రసం శరీరం నుండి విష పదార్థాలు తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే దీన్ని రోజూ తీసుకోవడం వల్ల మూత్రపిండాలు, కాలేయం పనితీరు మెరుగుపడుతుంది.
బరువు, చెడు కొలెస్టాల్ తగ్గించేందుకు…
టమోటో రసంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది . టమోటాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఇబ్బంది పెడుతుంటే రోజూ ఒక గ్లాసు టమోటా జ్యూస్ తీసుకోవచ్చు.