SSMB
సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.ఆయన గ్లామర్ కు, స్టాల్ కి ఫిదా కానీ వారంటు ఉండదు. ఇటు సిని ఇండస్ట్రీలో మెప్పిస్తూ అటు పేదలకు హెల్ప్ చేయడంతో…. ప్రేక్షకుల మనసుల్లో దేవుడిగా కొలువుంటున్నాడు ఈ సూపర్ స్టార్. ఇక ఇప్పుడు సరా సరా శులం…సుర్రంటాది కారం ఎడ పెడ చూడం….ఇది ఎర్రెకించే బేరం…. మాస్ పాటలతో మన ముందుకు వస్తున్నాడు మహేష్ బాబు. మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ గుంటూరు కారం.
గుంటూరు కారం మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, పాటలని బట్టి మహేష్ బాబు ను మాస్ క్యారెక్టర్ లో త్రివిక్రమ్ చూపించబోతున్నాడని అర్థం అవుతుంది. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి దానికి తగ్గట్టే సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. గుంటురు కారం మూవీ షూటింగ్ లో వర్క్ చేస్తూ SSMB 29 మూవీని మహేష్ బాబు ఒకే చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి నిర్మిస్తునాడు. మరి మహేష్ బాబు SSMB 30 మూవీని ఏ డైరెక్టర్ కు ఒకే చెప్పబోతున్నాడు అని వార్తలు వైరల్ అవుతున్నాయి.
SSMB 29 మూవీ 1000కోట్ల బడ్జెట్ తో రానుందా?
రాజమౌళి-మహేబాబు సినిమా త్వరలో రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఈ సినిమాను గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ గా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పేశాడు రాజమౌళి. ఈ సినిమా దాదాపుగా వెయ్యి కోట్ల బడ్జెట్ తో ఉంటుందని ఇండస్ట్రీలో టాక్.
రీసెంట్ గా యానిమల్ ఈవెంట్ లో జక్కన్న-మహేష్ ఒకే స్టేజ్ మీద కనిపించడంతో ఫ్యాన్స్ కేకలు విజిల్ వేస్తూ ఫుల్ ఖుష్ అయ్యారు. స్టేజ్ మీద మూవీ గురించి కొంచం కూడా మాట్లాడలేదు జక్కన్న. ఇక రాజమౌళి మూవీ ఎప్పుడు స్టాట్ చేస్తుడో అని మహేష్ ఫ్యాన్స్ అత్రుతగా ఎదురు చూస్తున్నారు.
SSMB 30 మూవీ ఏ డైరెక్టర్ తో ఉండబోతుంది:
రాజమౌళి-మహేష్ మూవీ పూర్తి చేసుకున్న తరువాత నెక్ట్స్ డైరెక్టర్ ఎవరో ఇంక అనౌన్స్ చేయలేదు మహేష్ బాబు. ప్రేక్షకులు మాత్రం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి, కొరటా శివ, సుకుమార్ పేర్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. కానీ యానిమల్ ఈవెంట్ లో రాజమౌళి, సందీప్ రెడ్డి, మహేష్ బాబు ఒకే స్టేజ్ షేర్ చేసుకోవటం హాట్ టాపిక్ గా మారింది. సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన యానిమల్ మూవీ ఈవెంట్ కి మహేష్ రావటంతో SSMB 30 ఆల్ మోస్ట్ ఫిక్స్ అంటున్నారు ఫ్యాన్స్. రాజమౌళి తరువాత SSMB 30 మూవీ సందీప్ రెడ్డి వంగతో ప్రాజెక్ట్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
డెవిల్ టైటిల్ తో మహేష్ బాబు మూవీ:
సందీప్ రెడ్డి మహేష్ బాబు మూవీ టైటిల్ కూడా రివీల్ చేశాడు. డెవిల్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
సందీప్ రెడ్డితో SSMB 30 ఉండబోతుందా?
యానిమల్ మూవీ తరువాత సందీప్ రెడ్డి ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమా 2025లో రిలీజ్ కానుందని సమాచారం. మహేష్, రాజమౌళి మూవీ ప్రాజెక్టు కూడా అదే సమయంలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మహేష్ బాబు సందీప్ రెడ్డి కాంబో ఖాయమని చెప్పవచ్చు. ఇదే కనుక నిజం కావాలి అంటే స్పిరిట్, రాజమౌళి మహేష్ బాబు సినిమాలు రిలీజ్ అవ్వాలి. అప్పటికి గానీ SSMB 30 మూవీ ఏ డైరెక్టర్ తో ఉండబోతోందన్న అంశంపై క్లారిటీ రాదు.