Money
తెలంగాణలో మరికొద్ది గంటల్లో పోలింగ్ మొదలవబోతోంది. పార్టీలన్నీ పోల్ మేనేజ్ మెంట్ లో తలమునకలైపోయాయి. ఇంటికి ఎన్నిఓట్లు? ఎంత పేమెంట్? రైవల్ పార్టీ ఎంతిస్తోంది. మనం ఎంతిస్తే వర్కవుట్ అవుతుంది ఇలాంటి ఈక్వేషన్స్ కాలిక్యులేషన్ లో పార్టీలన్నీ బిజీ బిజీ. డోర్ టు డోర్ స్నేహపూర్వక మీటింగులు, చిన్న చిన్న పార్టీలు సందుల్లో గొందుల్లో యథాలాపంగా సాగిపోతున్నాయ్. తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే ఏపీలో దీనికి భిన్నమైన సీన్ కనిపిస్తోంది. తెలంగాణలో ఏ పార్టీ పవర్ లోకి వస్తుంది? ఆ పార్టీ వల్ల ఏపీలో సమీకరణాలెలా మారుతున్నాయ్ అన్న అంశంపై సీరియస్ చర్చలు, బెట్టింగులు జరుగుతున్నాయ్. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయ్? హంగ్ వస్తుందా? అధికారం ఒక పార్టీకి స్పష్టంగా వస్తుందా? ఇలాంటి అంశాలపై డిస్కషన్లు సాగుతున్నాయ్.
కాంగ్రెస్ ని విజయం వరిస్తుందా?
చాలా మంది ఈసారి కాంగ్రెస్ అధికారం లోకి వస్తుందని పందేలు కడుతున్నారు. బీఆర్ ఎస్ ఈసారి 40-50 సీట్లకు మించి గెలవలేదని కొందరు ఎక్కువ బెట్టింగ్ కడుతున్నారు. అధికారం మాదేనని ప్రకటించిన బీజేపి సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందని చాలా మంది ఊహిస్తున్నారు. అలాగే కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నియోజక వర్గాల్లో గెలుపు, ఓటములపై కూడా పందేలు సాగుతున్నాయ్. రేవంత్ మెజారిటీపైనా ఏపీలో ఎక్కువ మంది పందెం కాస్తున్నారు. హుజూరాబాద్ లో ఈటల గెలుపుపైనా, గజ్వేల్ లో కేసీఆర్ మెజారిటీ పైనా బెట్టింగులు సాగుతున్నాయి. కేటీఆర్ పోటీ చేస్తున్న సిరిసిల్ల కూడా ఈ బెట్టింగుల్లో ప్రధమ స్థానంలో ఉంది. కేటీఆర్ మెజారిటీపై ఏపీ భీమవరం, గోదావరి జిల్లాల్లో బెట్టింగ్ రాయుళ్లు ఓ రేంజ్ లో పందేలు కాస్తున్నారు.
గ్రేటర్ లో కాంగ్రెస్ పై బెట్టింగ్ Money
గ్రేటర్ హైదరాబాద్ లో కూడా ఈసారి కాంగ్రెస్ పాగా వేస్తుందన్నది మెజారిటీ ప్రజల అభిప్రాయం. ఖైరతాబాద్ లో పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి గెలుపుపైనా బెట్టింగులు కడుతున్నారు. ఇక జనసేనాని పైనా జోరుగా బెట్టింగ్స్ సాగుతున్నాయి. జనసేన పోటీ చేస్తున్న 8 సీట్లలోనూ డిపాజిట్లు గల్లంతవుతాయని ఎక్కువమంది పందెం కాసేందుకు రెడీ అవుతున్నారు. అదే టైమ్ లో పవన్ పార్టీ గెలుపుపై జనసేనలోనే ఎక్కువ అనుమానాలు, భయాలు ఉన్నాయి.
కాంగ్రెస్ సీఎం అభ్యర్ధి ఎవరు?
ఇక ఏపీలో ఎక్కువమంది బెట్టింగ్ కడుతున్నది ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎవరు సీఎం అవుతారన్నది. మెజారిటీ జనం రేవంత్ రెడ్డికే సీఎం పదవి వస్తుందని ఊహిస్తున్నారు. దళిత ముఖ్యమంత్రి డిమాండ్ తెరపైకి వస్తే మల్లు భట్టి విక్రమార్క అవుతారనే అభిప్రాయం ఉంది. సీఎం పదవికి సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యర్ధిత్వం కూడా కొందరు పరిగణనలోకి తీసుకుంటున్నారు.
అన్నింటికన్నా ఆసక్తికరమైన అంశం ఏమంటే ఈసారి బీఆర్ ఎస్ పవర్ లోకి రావడం డౌటేనన్నది. దక్షిణాదిన ఇప్పటి వరకూ ఏ సీఎం హాట్రిక్ కొట్టలేదని, కేసీఆర్ కూడా అధికారం చేపట్టే ఆస్కారం తక్కువేనని కొందరు భావిస్తున్నారు.ప్రభుత్వ వ్యతిరేకత ఆ పార్టీ పుట్టి ముంచుతుందని మరికొందరు అంచనా వేస్తున్నారు.
మొత్తం మీద క్రికెట్ కన్నా జోరుగా తెలంగాన పాలిటిక్స్ పై బెట్టింగులు ఊపందుకున్నాయి. ఈ ఎన్నికలు మరి ఏ పార్టీకి అదృష్టాన్ని తీసుకొస్తాయో? ఎవరి పుట్టి ముంచుతాయో. Money