Turmeric
పసుపు… ఇది తెలియని వారుండరు. పసుపుకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఇది ఆరోగ్యానికి మేలు చేసే అనేక లక్షణాలను, ప్రయోజనాలను కలిగి ఉంటుంది. దీనిలో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. పసుపు శుభానికి సంకేతంగా భావిస్తారు. దీనిని ఎక్కువగా వంటల్లోనూ, పూజల్లోనూ, శుభకార్యలల్లోనూ వాడుతుంటాము. ఇది అనేక వ్యాధులని నయం చేయడంలో ఎంతో సహయపడుతుంది. ఆరోగ్యానికి మేలు చేసే ఈ పసుపులో కాల్షియం, ఐరన్‌తో పాటు అనేక విటమిన్లు ఉంటాయి. పసుపును ఎన్నో వ్యాధులకు చికిత్స చేయడానికి, వాటి నివారణ కొరకు చక్కగా ఉపయోగిస్తారు. పసుపులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, యాంటిక్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి. ఇది రుచికి చేదుగా ఉంటుంది. కానీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. పసుపును సౌందర్య లేపనంగా కూడా వాడుతుంటారు. పసుపు తీసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్యమైనది… Turmeric
పసుపు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది మోకాలి నొప్పుల్ని నయం చేస్తుంది. క్రిములను కూడా నశింపజేస్తుంది. తల భారాన్ని తగ్గిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. పసుపు ఫ్రీ రాడికల్స్ తోనూ, వ్యాధులతోనూ పోరాడే శక్తిని కలిగి ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాల విస్తరణను నిరోధిస్తుంది. పసుపులోని అత్యంత శక్తివంతమైన కర్కుమిన్ ఉండడంతో ఇది ఆర్థరైటిస్, చర్మ క్యాన్సర్, గాయాలు, కాలేయ వ్యాధులు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు మూలికా చికిత్సగా ఉపయోగపడుతుంది. కాలేయం పనితీరును మెరుగుపరచడానికి పసుపు చక్కగా పనిచేస్తుంది. కాలేయం దెబ్బతినడానికి ప్రధాన కారణాలలో ఆక్సీకరణ ఒత్తిడి. దీనిలోని కర్కుమిన్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది కాలేయాన్ని కాపాడుతుంది. దీనిలో కర్కుమిన్ రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి డయాబెటిస్ చికిత్సకు సహాయపడుతుంది. ఊపిరితిత్తుల్లో ఏర్పడే రుగ్మతలను నయం చేస్తుంది.
అన్ని ఆరోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం…
పసుపులో క్యాన్సర్ తో పోరాడే గుణాలు ఉంటాయి. పసుపు క్యాన్సర్ ను తగ్గిస్తుంది. నిత్యం మనం పసుపు తీసుకోవడంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాల కారణంగా గాయాలు , దీర్ఘకాలిక వాపు కారణంగా కలిగే నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. పసుపు వినియోగం ఎముకలను బలపరుస్తుంది. పాలలో పసుపు వేసుకుని తాగడం వల్ల ఎముకలలో ఏమైనా సమస్యలుంటే తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. కాలేయం పనితీరును మెరుగుపరచడానికి పసుపు చక్కగా పనిచేస్తుంది. కాలేయం దెబ్బతినడానికి ప్రధాన కారణాలలో ఆక్సీకరణ ఒత్తిడి. పసుపులోని కర్కుమిన్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది కాలేయాన్ని కాపాడుతుంది. పసుపులో కర్కుమిన్ రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి డయాబెటిస్ చికిత్సకు సహాయపడుతుంది.
కాంతివంతమైన చర్మం మీ సొంతం…
ముఖంపైనున్న మొండి మచ్చలు తొలగిపోవడానికి పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది. మరియు మొటిమలు దూరమవుతాయి. ముఖంపై ముడతలు తగ్గిపోతాయి. చర్మం కూడా ప్రకాశవంతంగా తయారవుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మంచి వాసనతో కూడిన పసుపు చర్మ వ్యాధులను దూరం చేస్తుంది. అవాంఛిత రోమాలను తొలగిస్తుంది. వంటలలో వాడటం ద్వారానూ, పాలలో పసుపు వేసుకుని తాగడం ద్వారానూ అనేక లాభాలను పొందవచ్చు.