Rahul Dravid
వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీతో టీమిండియా హెడ్ కోచ్‌గా తన పదవి కాలం పూర్తి చేసుకున్న రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ బంపరాఫర్ ఇచ్చింది. అతని కాంట్రాక్ట్‌ను మరో రెండేళ్లు పొడిగించాలని నిర్ణయించింది. కానీ హెడ్ కోచ్‌గా కొనసాగేందుకు ద్రవిడ్ సుముఖంగా లేడని ప్రచారం జరుగుతోంది. దాంతో టీ20 ప్రపంచకప్ వరకు అయినా హెడ్ కోచ్‌గా కొనసాగాలని ద్రవిడ్‌ను రిక్వెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది జూన్‌లోనే టీ20 ప్రపంచకప్ జరగనుండటంతో ద్రవిడ్ అయితేనే టీమ్‌కు మేలు జరుగుతుందని బీసీసీఐ భావిస్తోంది. ద్రవిడ్‌ను కొనసాగించాలనే బీసీసీఐ నిర్ణయానికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా ఆమోదం తెలిపినట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.
సౌతాఫ్రికా టూర్ కీలకం Rahul Dravid
అలాగే సౌతాఫ్రికా పర్యటనకు రాహుల్ ద్రవిడ్‌నే పంపించాలని బీసీసీఐ నిర్ణయించింది. డిసెంబర్ 10 నుంచి జనవరి 7 వరకు ఈ పర్యటన కొనసాగనుండగా టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్ట్ లు ఆడనుంది. బీసీసీఐ ప్రతిపాదనకు రాహుల్ ద్రవిడ్ అంగీకరించడంతో ప్రపంచకప్ వరకు ఉన్న అతని సహాయక సిబ్బందిని కూడా కొనసాగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేకు కాంట్రాక్ట్ పొడిగింపు దక్కింది.
లక్ష్మణ్ కు నో ఛాన్స్…
వీవీఎస్ లక్ష్మణ్ ఎన్సీఏ డైరెక్టర్‌గా బిజీగా ఉండటంతో అతనికి టీమిండియా హెడ్ కోచ్‌గా అదనపు బాధ్యతలు ఇవ్వలేమని బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి. పైగా అండర్ 19 ప్రపంచకప్‌కు అతను కుర్రాళ్లను సిద్దం చేయాల్సి ఉందని గుర్తు చేశారు.
టీ20 కోచ్ పదవి ఆశీష్ వద్దన్నాడా?
టీమిండియా టీ20 ఫార్మాట్ కోచింగ్ బాధ్యతలను ఆశిష్ నెహ్రాకు అప్పగించాలని బీసీసీఐ భావించిందని, కానీ ఈ పదవిని తీసుకునేందుకు అతను నిరాకరించాడని ప్రచారం జరగుతోంది. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ కోచ్ గా టైటిల్ అందించడంతో పాటు రన్నరప్ గా నిలబెట్టడంతో అతనికి ఈ బాధ్యతలు ఇవ్వాలని బీసీసీఐ భావించిందట. కానీ అతను తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంపై బీసీసీఐ గానీ, ఆశీష్ నెహ్రా గానీ ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు.
ద్రవిడ్ కు జై షా ప్రశంసలు… Rahul Dravid
ద్రవిడ్ ప్రస్థానం అద్భుతమని జై షా అన్నాడు. ప్రపంచకప్‌లో టీమిండియా వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి తన సత్తాను నిరూపించుకుంది. ఇందులో రాహుల్ ద్రవిడ్ పాత్ర చాలా ఉంది. ఈ ప్రదర్శన కారణంగా రాహుల్ ద్రవిడ్ మళ్లీ ప్రధాన కోచ్ అయ్యే అర్హత సాధించాడని జై షా అన్నాడు.రాహుల్ ద్రవిడ్ ముందుకు వెళ్లేందుకు అన్ని విధాలా సాయం చేస్తామని బీసీసీఐ అధ్యక్షుడు స్పష్టం చేశారు.ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్టును ఎంతకాలం పొడిగించారనేది వెల్లడికాకపోయినా అతని ముందు పెద్ద సవాల్ ఉందని బీసీసీఐ స్పష్టం చేసింది.