Dry Fruits
అన్ని కాలాలు వేరు.. చలి కాలం వేరు. ఈ శీతా కాలంలో ప్రత్యేకంగా ఆరోగ్య పరంగా, ఆహార పరంగా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. చలి కాలంలో రోగ నిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది. అలాగే జీర్ణ సమస్యలు ఎక్కువగా తలెత్తే అవకాశాలు ఉంటాయి. దీంతో మితమైన ఆహారం తీసుకోవాలి. అదే విధంగా చర్మంపై కూడా అనేక మార్పులు వస్తుంటాయి. చలికి స్కిన్ పొడి బారడం, గీతలు పడటం, డల్ గా మారడం వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి. కాబట్టి వింటర్ సీజన్ లో ప్రత్యేకమైన కేర్ తీసుకోవడం ఎంతో అవసరం. ఇలా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే.. ఈ డ్రై ఫ్రూట్స్ ని ఆహరంలో భాగంగా చేర్చుకోవడం వల్ల బాగా హెల్ప్ చేస్తాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బాదం:
బాదంలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఈ, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటివి పుష్కలంగా ఉంటాయి. వీటిని చలి కాలంలో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్య పరమైన సమస్యలతో పాటు చర్మ సమస్యలు కూడా తగ్గు ముఖం పడతాయి. కాబట్టి ప్రతి రోజు క్రమం తప్పకుండా రోజుకు రెండు లేదా మూడు పప్పులు తీసుకుంటే ఆరోగ్యనికి ఎంతో మేలు జరుగుతుంది.
ఖర్జూరం: Dry Fruits
చలి కాలంలో ఖర్జూరం విరివిగా లభిస్తుంది. వీటిల్లో సహజమైన స్వీట్ నేచర్ ఉంటుంది. అలాగే ఇది తిన్న వెంటనే రోగ నిరోధక శక్తితో పాటు, ఎనర్జీ లెవల్స్ కూడా పెరుగుతాయి. డేట్స్ ని స్నాక్స్ లా కూడా తీసుకోవచ్చు. అంతే కాకుండా స్మూతీస్, డిజర్ట్ వంటి వాటిల్లో కూడా ఉపయోగించవచ్చు. చలి కాలంలో వీటిని ఆహరంగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.
ఎండు ద్రాక్ష: Dry Fruits
శీతా కాలంలో ఎండు ద్రాక్ష తినడం వల్ల ఇమ్యునిటీ బాగా అందుతుంది. ఎండు ద్రాక్షలో ఐరన్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చలి కాలంలో వీటిని తినడం వల్ల మంచి ప్రయోజనాలు అందుతాయి.
డ్రై ఆప్రికాట్స్: Dry Fruits
ఎండిన ఆప్రికాట్స్ లో విటమిన్ ఎ, పొటాషియం, డైటరీ ఫైబర్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని స్నాక్స్ లా, సలాడ్స్ వంటి వాటిల్లో ఉపయోగించు కోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆహర నిపుణులు వెల్లడిస్తున్నారు.
వాల్ నట్స్:
వాల్ నట్స్ లో కూడా ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఐరన్, మాంగనీస్ వంటి ముఖ్యమైన పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చలి కాలంలో వీటిని తీసుకోవడం వల్ల ఇమ్యునిటీతో పాటు చర్మం కూడా అందంగా మారుతుంది.
ఇలా చలికాలంలో డ్రైఫూట్స్ ని ఆహరంలో భాగంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యనికి మరిన్ని ప్రయోజనాలుంటాయి. అదే విధంగా ఎటువంటి చర్మ సమస్యలను అయినా దూరం చేస్తాయి. ఎటువంటి సమస్యలను అయినా ఈజీగా నయం చేసుకోవచ్చు.