కోలీవుడ్ సీనియర్ హీరో, MDMK అధినేత విజయ్ కాంత్ (Vijayakanth) ఆరోగ్యం విషమంగా ఉందని తమిళ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అనారోగ్యం వల్ల ప్రస్తుతం చెన్నైలోని మయత్ అనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నవంబర్ 18న గొంతునొప్పి, జలుబు తో హాస్పిటల్ లో జాయిన్ అయినట్లు ఎండిఎంకె అధికారికంగా ప్రకటించింది. విజయ్ కాంత్ కు సాధారణ పరీక్షలు చేశారని….ఆయన ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని సభ్యులు, తెలిపారు.. ఇప్పుడు మాత్రం విజయ్ ఆరోగ్య కుదుటపడలేదని ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని వార్తలు వస్తున్నాయి.
పల్మనరీ చికిత్స అందిస్తున్న డాక్టర్లు: (Vijayakanth)
నిన్నటి వరకు విజయ్ కాంత్ బాగానే ఉన్నారని కానీ గత 24 గంటల నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా లేనందున… విజయ్ కు పల్మనరీ చికిత్స అందిస్తున్నామంటూ ఆయన త్వరలో కోలుకోవాలని ఆశిస్తున్నామంటూ వైద్యులు తెలియజేయడం జరిగిందట. విజయ్ కాంత్ ఆరోగ్యం క్షీణిచడంతో , సిని ఇండస్ట్రీ, రాజకీయ నాయకులు, ఫ్యాన్స్ అందోళన పడుతున్నారు.
14 రోజుల పాటు ఆస్పత్రిలోనే
విజయ్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఇంకా 14 రోజుల పాటు విజయ్ ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుందంటున్నాయి ఆస్పత్రి వర్గాలు. ఆయన త్వరగా కొలుకొవాలంటూ రాజకీయ నాయకులు, ఫ్యాన్స్ ప్రార్ధన చేస్తున్నారు.
డయాబెటిస్ కారణంగా కుడికాలి మూడు వేళ్ళు తొలగింపు:
విజయ్ కాంత్ డయాబెటిక్ పేషెంట్.. కరోనా టైమ్ లో ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతింది. ప్రస్తుతం ఆయనకు గొంతు నొప్పి, జలుబు ఎక్కువగా ఉన్నాయి. ఊపిరి ఆడకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావటంతో విజయ్ కాంత్ ను… కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించాను. డయాబెటిస్ కారణంగా గతంలో ఆయన కుడికాలి మూడు వేళ్లని తొలగించారట.
బర్త్ డే రోజున వీల్ చైర్ లో వచ్చిన విజయ్: (Vijayakanth)
గతంలోనూ విజయ్ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని అందరికి తెలుసు. విజయ్ కాంత్ పుట్టిన రోజు సందర్భంగా డిఎండికె ప్రధాన కార్యాలయంలో వాలంటీర్లును కలిశారు. అయితే అప్పట్లోనే ఆయనను వీల్ చైర్ లో కూర్చో బెట్టి తీసుకు రావాల్సి వచ్చింది.
రాజకీయల్లో చురుకుగా ఉన్న ప్రేమలత:
అనారోగ్య పరిస్థితుల కారణంగా విజయ్ కాంత్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన ఆరోగ్యం కుదుట పడిన తరువాత రాజకీయల్లోకి వస్తారని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. అప్పటి వరకు విజయ్ కాంత్ భార్య ప్రేమలత విజయ్ ప్రభాకరన్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు . ఈమధ్య కాలంలో కేవలం ప్రేమలత మాత్రమే రాజకీయల్లో యాక్టివ్ గా ఉంటున్నారు.
రాజకీయాలకు దూరం (Vijayakanth)
ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో విజయ్ రాజకీయల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించాడు. ఆనారోగ్య సమస్యల కారణంగా విజయ్ కాంత్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని సమాచారం. కానీ చాలా మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయను చూడాలని విజ్ఞప్తి చేయటం వల్ల ఇటీవలే ఆయన పార్టీ శ్రేణులను కలిశారు. ఇలా ఆయన ఆరోగ్యం సరిగా ఉండకపోవడంతో ఆయన ఫ్యాన్స్, రాజకీయ నాయకులు తీవ్ర అందోళన పడుతున్నారు. ఇప్పుడు ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. రెండు వారాలు గడిస్తేగానీ ఆయన ఆరోగ్యంపై ఎటువంటి స్థిరమైన ప్రకటనా చేయలేమని వైద్యులు చెబుతున్నారు.