Multi Vitamins
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలనే కోరుకుంటారు. దీనికి మంచి ఆహరం తీసుకోవడం ఉత్తమం. అయితే చాలా మంది నిర్దిష్ట వయస్సు తర్వాత ప్రతి ఒక్కరూ మల్టీ విటమిన్లను తీసుకోవాలని ఆహర నిపుణులు చెబుతున్నారు. మనం తీసుకునే ఆహరం నుండి శరీరానికి పోషకాలు లభ్యమవుతాయి. అయితే కొందరు తినే ఆహరంతో పాటు మల్టీ విటమిన్లని కూడా ఆహరంగా తీసుకుంటున్నారు. 40 ఏళ్లు పైబడిన వారు ఎక్కువగా తీసుకుంటారు. కొన్నిసార్లు డాక్టర్ సలహాపై, మరికొన్ని సార్లు సలహా లేకుండా కూడా విటమిన్లు తీసుకుంటారు.
మల్టీ విటమిన్లు అంటే ఏంటి…
ఇందులో మల్టీ విటమిన్లు, విటమిన్లు, ఖనిజాలు, అనేక ప్రోటిన్లు కలిగి ఉన్న ఆహార పదార్ధాలు. ఇది మనం తీసుకునే ఆహారం ద్వారా తగినంత పరిమాణంలో పొందలేని పోషకాలను అందించడానికి రూపొందించబడింది. మల్టీ విటమిన్లు మాత్రలు, ద్రవపదార్థాలు, పౌడర్లు వంటి అనేక రూపాల్లో అందుబాటులో ఉన్నాయి. కొనుగోలు చేయడానికి ముందు వాటిల్లో ఉన్న అన్ని విషయాలను చదివి తెలుసుకోవాలి.
ఈ మల్టీ విటమిన్లు ఎవరికి ఎక్కువ అవసరం… Multi Vitamins
ఆరోగ్యంగా ఉన్నప్పటికీ మన శరీరానికి కావలసిన అన్ని పోషకాలు మనకు అందుతున్నాయో లేదో నిర్ధారించుకోవడం చాలా కష్టం. నేటి ఆధునిక జీవనశైలి, వేగవంతమైన జీవితంలో మనం తరచుగా అనేక పోషకాలు లోపం ఉన్నాయని తెలుసుకుంటున్నాం. మన అనారోగ్యకరమైన జీవనశైలి తరచుగా పోషకాహార లోపాలను కలిగిస్తుంది. అందుకే పెరుగుతున్న వయస్సు, బాధ్యతతో, మన అదనపు ఆహారం, విటమిన్ల అవసరం పెరుగుతుంది. కాబట్టి ఈ మల్టీ విటమిన్లను తీసుకోవలసి వస్తుంది.
ఎవరు మల్టీవిటమిన్లను తీసుకుంటారంటే…
శాఖాహారం మాత్రమే తిసుకునే వారికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. విటమిన్ బి-12, కాల్షియం, విటమిన్ డి, ఐరన్ , జింక్ వంటి పోషకాలు ఆకుపచ్చని కూరగాయల నుండి మనకు ఎక్కువగా లభిస్తాయి. అయితే శాకాహార ఆహారం అంటే సమతుల్య ఆహారం తీసుకోవడం వలన తగినంత పోషకాలు లభిస్తాయి. పెరుగుతున్న వయస్సుతో శరీరంలో అనేక విటమిన్ల లోపం ఉండవచ్చు. వయస్సు పెరిగే కొద్ది ఆహరం నుండి విటమిన్లను గ్రహించే శక్తి శరీర సామర్థ్యం కూడా బలహీనపడటం ప్రారంభమవుతుంది. అటువంటి సమయంలో మనకు ప్రత్యేక మల్టీ విటమిన్ అవసరం.
ప్రెగ్నెంట్ సమయంలో ఎంతో అవసరం… Multi Vitamins
గర్భిణీ స్త్రీలకు ప్రినేటల్ విటమిన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ సమయంలో శిశువుకి, తల్లికి తగిన పోషకాలను అందించడంలో ఒక అద్భుతమైన మార్గం. గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన మరియు పిండం అభివృద్ధికి కొన్ని విటమిన్లు, ఖనిజాలు అవసరం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులుకు కొన్నిసార్లు శరీరంలో విటమిన్ లోపానికి కారణమవుతాయి. ఇది శరీరంలో అవసరమైన పోషకాల లోపానికి దారి తీస్తుంది.
వీటివల్ల దుష్పలితాలుంటాయా… Multi Vitamins
వీటి వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేనప్పటికీ దానిపై వ్రాసిన ప్రతి విటమిన్ పరిమాణాన్ని తెలుసుకోవడం ఎల్లప్పుడూ మంచిది. అలాగే ఇది సహజంగా లభించే పోషకాలకు ప్రత్యామ్నాయం కాదు. తినడానికి ముందు, మన ఆహారం నుండి అన్ని పోషకాలను తగినంత పరిమాణంలో పొందేలా చూసుకోవాలి. అయితే ఎవరైనా మల్టీవిటమిన్ నుండి ప్రయోజనం పొందవచ్చని భావిస్తే.. వాటిని తీసుకోవడం వల్ల ఎటువంటి హాని ఉండదని నిపుణులు చెబుతున్నారు.