sleeping
చాలా మంది మధ్యాహ్నం కాస్త నిద్రపోవడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి చిన్న న్యాప్స్ మనలో నూతన ఉత్తేజాన్ని ఇస్తాయి. అయితే సెలవు ఉన్నప్పుడు వర్క లేనప్పుడు చాలా మంది అదే పనిగా ఎక్కువసేపు పడుకుంటారు. అది మంచిది కాదు అంటున్నారు నిపుణులు. ఈ మధ్యాహ్నం నిద్ర వల్ల ఎన్ని ప్రయోజనాలో, అన్ని నష్టాలు కూడా వున్నాయి. పని ఎక్కువగా ఉన్నా శరీరం కాస్త విశ్రాంతిని కోరుకుంటుంది. రాత్రిపూట పనిచేసే వ్యక్తులు ఎక్కువసేపు మెలకువగా ఉంటారు. దాని వల్ల అలసట పెరుగుతుంది. ఒత్తిడి స్థాయి కూడా క్రమంగా పెరుగుతుంది.
ఈ పరిస్థితి చాలా కాలం పాటు కొనసాగితే క్రానిక్ ఫెటీగ్ తీవ్రమవుతుంది.
మధ్యాహ్నం పడుకోవడం మంచిదేనా… sleeping
పగలు చిన్న నిద్ర తీసుకోవడం సర్వసాధారణం. కానీ మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరం.ఇది మీ రాత్రిపూట నిద్రను ప్రభావితం చేస్తుంది. కాబట్టి మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రపోకుండా ఉండటం చాలా ముఖ్యం. ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల స్ట్రోక్ ముప్పు 20 శాతం కంటే ఎక్కువ పెరుగుతుందని మెడికల్ జర్నల్ ఆఫ్ అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ నిపుణులు తెలిపారు. మధ్యాహ్నం 90 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోయే వారికి పక్షవాతం వచ్చే ప్రమాదం 25 శాతం ఉంటుందని వెల్లడైంది.
అలసట దూరం…
ఉదయం నుంచి మధ్యాహ్నానికి మనం పనిచేసి అలసిపోతాము. ఎందుకంటే మన శరీరం సిర్కాడియన్ రిథమ్‌ను అనుసరిస్తుంది. ఇందులో ప్రతి 12 గంటలకొకసారి శరీర ఉష్ణోగ్రత కాస్త తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రధానంగా మధ్యాహ్నం ఉంటుందని చెప్తున్నారు. అందుకే వ్యక్తి మధ్యాహ్నం కాస్త అలసటగా ఫీల్ అవుతూ ఉంటారని చెప్తారు. కాబట్టి 30 నిమిషాలకు మించకుండా నిద్రపోవడం వల్ల అలసట నుంచి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు. sleeping
మంచి నిద్రవల్ల కలిగే ప్రయోజనాలు… sleeping
దీన్ని వల్ల చాలా ప్రయోజనాలు వున్నాయి. మధ్యాహ్నం నిద్ర హై బీపీని సులభంగా దూరం చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇది రక్తపోటును కూడా తగ్గిస్తుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా దూరం చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇంకా చెప్పాలంటే డయాబెటిస్, ఈసీఓడీ, థైరాయిడ్ సమస్యలకు పరిష్కారంగా మధ్యాహ్నం నిద్ర ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
రిఫ్రెష్ అవడానికి..
మధ్యాహ్నం సమయంలో అప్రమత్తంగా ఉండటం కష్టం. దీనిని పోస్ట్-లంచ్ డిప్ అని పిలుస్తారని డాక్టర్స్ అంటున్నారు. ఇది ప్రధానంగా మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల మధ్య ఉంటుంది. ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రత కొద్దిగా తగ్గుతుంది. దీని కారణంగా మనకు నీరసం, చురుకుదనం కూడా తగ్గుతుంది. కాబట్టి కొంచెం నిద్రపోవడం రిఫ్రెష్‌గా ఉండటానికి సహాయపడుతుంది.sleeping
నిద్ర లేకపోవడం వల్ల కలిగే సమస్యలు…sleeping
ఎక్కువసేపు నిద్రపోవడం మంచి అలవాటు కాదు. కానీ నిద్ర లేకపోవడం వల్ల కూడా సమస్యలు ఉంటాయి. కొందరు రాత్రి సమయంలో ఎక్కువ సేపు పడుకోరు. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. తగినంత నిద్ర లేకపోవడం వల్ల మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, ఊబకాయం, డిప్రెషన్‌కు కారణమవుతాయి. అందుకే మనం ప్రతిరోజూ తగినంత నిద్రపోవడానికి ప్రయత్నించాలి.