kalonji seeds
కలోంజి సీడ్స్.. చాలా మందికి ఈ పేరు కోత్తగా ఉండవచ్చు. కాని దీని మేలు అంతా ఇంతా కాదు. వీటిని నల్ల జీలకర్ర అనికూడా పిలుస్తారు. ఈ విత్తనాల వాడకం పూర్వం నుండే ఉంది.అయుర్వేదంలో వీటిని పలు అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని ఆహరంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఇమ్యునిటీ లెవెల్స్ అనేవి బాగా పెరుగుతాయి.ఇది పలు అనారోగ్య సమస్యలు , ఇన్ ఫెక్షన్లు శరీరాన్ని ఎటాక్ చేయకుండా కాపాడతాయి. వీటిని ఆహరంలో భాగంగా తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు.
కలోంజిలోని పోషకాలు…
ఈ నల్లటి విత్తనాలల్లో విటమిన్లు, పైబర్, అమైనో యాసిడ్స్, ప్రోటిన్లు, ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ ఫ్యారాసైడ్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలన్ని ఆరోగ్యనికి ఎంతో మేలు చేస్తాయి.
రోగనిరోధక శక్తిని పెంచడంలో…
ఈ విత్తనాలల్లో పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిని ఆహరంగా తీసుకోవడం వల్ల తక్షణమే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.దీని వల్ల ఇతర రోగాలతో పోరాడే శక్తి శరీరానికి లభిస్తుంది.కాబట్టి ఎటువంటి వ్యాధులు మరియు ఇన్ ఫెక్షన్లు వచ్చినా వీటితో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.మరియు హెల్దీగా ఉండొచ్చు.
షుగర్ ని కంట్రోల్ ఉంచడంలో…
షుగర్ సమస్యతో బాధపడే వారు ఏ ఆహర పదార్ధాలనైనా తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. అలాంటివారు ఈ కలోంజి విత్తనాలను తీసుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. వీటిని ఆహరంలో భాగంగా చేర్చుకోవాలి అనుకుంటే ముందు వైద్యుల సలహలు తీసుకోవడం ఉత్తమం.
మెమరీ పవర్ ని పెంచడంలో…
మెమరీ పవర్ ని మెరుగుపరచడంలో కలోంజి సీడ్స్ ఎంతగానో సహయపడతాయి. ఆ సీడ్స్ పొడిలో కోంచెం తేనే కలుపుకుని క్రమం తప్పకుండా ప్రతిరోజు తీసుకోవడం వల్ల మెమరీ పవర్ పెరుగుతుంది. చిన్న పిల్లలకు కూడా దీనిని పెట్టవచ్చు. దీన్ని ఆహరంగా తీసుకోవడం వల్ల మతిమరుపు, అల్జీమర్స్ వంటివి కూడా దూరమవుతాయి.
గుండె ఆరోగ్యనికి చాలా మంచిది…
చాలా మంది ఈ మధ్య కాలంలో గుండె సంబంధిత సమస్యలతో భాధపడుతున్నారు. చిన్న వయస్సులోనే హార్ట్ స్ట్రోక్స్, హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోతున్నారు. ఈ సమస్యలతో ఇబ్బందిపడేవారు తరచూ కలోంజి విత్తనాలను తీసుకోవడం వల్ల చాలా మంచిది. ఇది రక్తనాళాల్లో పేరుకుపొయిన కొవ్వుని కరిగిస్తుంది. దీంతో రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. మరియు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
బరువు తగ్గడానికి మరియు చర్మానికి మంచి మెడిసిన్…
వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు కలోంజి సీడ్స్ ని తీసుకోవచ్చు. ఈ విత్తనాలను దోరగా వేయించి పొడి చేసి దానిని మనం తీసుకునే ఆహరంలో, సలాడ్స్, జ్యూస్ లు వంటి వాటిలో కలుపుకుని తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు. చర్మ సమస్యలను పరిష్కరించడంలో కూడా ఈ సీడ్స్ ఎంతో సహయపడతాయి. ఇవి సొరియాసిస్, మొటిమలను తగ్గిస్తాయి.