ANIMAL
అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ వంగ దర్శకత్వం వహించిన సినిమా యానిమల్. ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించారు. డిసెంబర్ 1న థియేటర్స్ లో గ్రాండ్ గా ఈ మూవీ రిలీజ్ అయింది. నాన్న ఎమోషన్స్ తో మాస్ యాక్షన్ గా తెరకెక్కింది ఈ సినిమా. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల అయింది.
కలెక్షన్ ల వర్షం: ANIMAL
నిన్న థియేటర్స్ లో రిలీజ్ అయిన యానిమల్ మూవీ కలెక్షన్ ల వర్షం కురిపించింది. మొదటి రోజు యానిమల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 116 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి సునామి సృష్టించింది. ఇంతటి కలెక్షన్ రావటంతో యావత్ సిని ఇండస్ట్రీ షాక్ కి గురి అయ్యింది. వీకెండ్ కాని రోజున సినిమా రిలీజయి కలెక్షన్ ల వర్షం కురిపించింది యానిమల్ మూవీ. రణబీర్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులని మెప్పిస్తే సందీప్ వంగా తన డైరెక్షన్ తో అదరగొట్టాడు.
ఖాన్ సినిమాలను మించి కలెక్షన్స్
బాలీవుడ్ లో ముగ్గురు ఖాన్స్ ని మించి రాకపోయినా ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా బాగానే కలెక్షన్ చేస్తుంది అనుకున్నారు మేకర్స్ కానీ…. రణబీర్ కపూర్ నటించిన యానిమల్ మూవీ ఖాన్స్ ని మించి 116 కోట్ల కలెక్షన్స్ తెచ్చింది. సౌత్ లో పెద్దగా మార్కెట్ లేని హీరో ఈ రేంజ్ లో కలెక్షన్ చేయడం బాలీవుడ్ లో అందరిని ఆశ్చర్యపరిచింది.
బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన రణబీర్:
యానిమల్ మూవీ ఇండియాలో మొదటి రోజు 65 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా ఓవర్సీస్ లో 50 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బాలీవుడ్ లో షారుఖ్ మూవీ పఠాన్ మొదటి రోజు ఇండియాలో 57కోట్లు, సల్మాన్ టైగర్-3 మూవీ మొదటి రోజు 44 కోట్లు కలెక్ట్ చేశాయి. యానిమల్ మూవీతో రణబీర్ బాలీవుడ్ లో ఖాన్స్ మించి సూపర్ స్టార్ అయ్యాడు.
ఓటీటీ ప్లాట్ ఫామ్ లో: ANIMAL
యానిమల్ ఓటీటీ రైట్స్ ను నెట్ ప్లిక్స్ దక్కించుకుందని సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 26 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ వార్తకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
నాన్న సెంటిమెంట్ మూవీకి అస్సెట్
రణ్ విజయ్ సింగ్ బల్బీర్(రణబీర్ కపూర్)కి తండ్రి మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది. తండ్రి బల్బీర్ సింగ్(అనిల్ కపూర్) ఓ వ్యాపార వేత్త. బిజీ లైఫ్ లీడ్ చేస్తు కొడుకుతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోతాడు. ఇక తండ్రి కొడుకుల మధ్య దూరం పెరుగుతుంది. కొడుకును బోర్డింగ్ స్కూల్ కు పంపిస్తాడు తండ్రి. అక్కడ రణ్ విజయ్ గీతాంజలి(రష్మిక)తో ప్రేమ లో పడతాడు. తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోమన్నాడని కొడుకు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అవుతాడు. ఆ క్రమంలో తండ్రిపై హత్యా ప్రయత్నం జరుగుతుంది…. తన తండ్రి శత్రువులపై కొడుకు విజయ్ ఎలా రివెంజ్ తీర్చుకున్నాడనే నేపథ్యంలో కొనసాగుతుంది.