ఐటమ్ సాంగ్స్ కి పెట్టింది పేరు సిల్క్ స్మిత. తన డాన్స్ తో సౌత్ ఇండస్ట్రీ లోని యూత్ ని ఉర్రుతలూగించిన అందాల భామ……తన నటన, డాన్స్ తో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. అభిమానుల చేత ఇండియన్ మార్లిన్ మన్రో గా జేజేలు కొట్టించుకుంది. హీరోయిన్స్ కంటే ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుంది. కుర్రకారుల కలల రాణి చనిపోయి పాతికేళ్లు దాటినా ఇప్పటికీ ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు.
తక్కువ టైమ్ లో స్టార్ గా మారింది ఈ బ్యూటీ. ఐటమ్ సాంగ్స్ కి డాన్స్ కి మాత్రమే పరిమితం కాకుండా సీతాకోక చిలుక, వసంత కోకిల చిత్రల్లోనూ నటించి అందరిని ఆకట్టుకుంది. 1996 సెప్టెంబర్ 23న సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. నేడు డిసెంబర్ 2న సిల్క్ బర్త్ డే…. ఈ సందర్భంగా తన మరొక బయోపిక్ తీస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
డ్రీం గర్ల్ పై తెలుగులో బయోపిక్:
అందరి కలల రాణి సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా ఆమె బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారట. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారట. జయరామ్ అనే నూతన డైరక్టర్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సిల్క్ స్మిత. ది అన్ టోల్డ్ స్టోరీ అనే టైటిల్ ఒకే చేశారు. చంద్రికా రవి సిల్క్ స్మిత పాత్రలో నటించబోతుందట. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.
అందులో చంద్రికా రవి చూడటానికి అచ్చం సిల్క్ స్మిత లాగ కనిపిస్తుంది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మళ్లీ మా సిల్క్ స్మిత వచ్చిందంటూ సంతోషంతో కామెంట్స్ పెడుతున్నారు ఫ్యాన్స్. గతంలో సిల్క్ స్మిత బయోపిక్ బాలీవుడ్ లో డర్టీ పిక్చర్ పేరుతో తెరకెక్కింది. సిల్క్ స్మితగా విద్యాబాలన్ నటించింది. ఇక ఇప్పుడు చంద్రికా రవి ఎలా నటిస్తుందో చూడాలి. ఈమె వీర సింహారెడ్డి సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించింది.
పాత్ర పేరే ఇంటిపేరుగా మార్పు
కన్నడంలోని వండిచక్రం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది సిల్క్ స్మిత . ఆ సినిమాలో ఆమె పాత్ర పేరు సిల్క్. అదే పేరు ఆమెకు స్థిరపడిపోయింది. అసలు పేరు విజయలక్ష్మి. సొంత ఊరు ఏలూరు. పదిహేనేళ్లపాటు సినిమా ఇండస్ట్రీని ఊపేసింది ఈ అమ్మడు. తన 17ఏళ్ల కెరీర్ లో 450పైగా సినిమాల్లో నటించింది. తన నటనతో,డాన్స్ తో ఎంతో మందిని ఆకట్టుకుంది. హీరోయిన్ల కంటే ఎక్కువ రెమ్యూరేషన్ తీసుకునేది ఈ హాట్ బ్యూటీ
బాధను భరించలేక ఆత్మహత్య చేసుకుందా?
హీరోయిన్ గా, ఐటమ్ సాంగ్స్ ఆఫర్స్ తగ్గటంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది సిల్క్ స్మిత. అక్కడ తీవ్రంగా నష్టపోయింది. అలాగే వ్యక్తిగతంగా లవ్ ఫెయిల్యూరూ ఆమెను కుంగదీసింది. ఒకవైపు అప్పులు, ఇంకోవైపూ ప్రేమ రాహిత్యం ఆమెను వెంటాడాయి. ఈ బాధలతో ఆమె మానసిక క్షోభతో కుంగిపోయింది.
చివరకు డిప్రెషన్ లోకి వెళ్లిపోయి 1996 సెప్టెంబర్ 23న చెన్నైలోని తన నివాసంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని చనిపోయింది. సిల్క్ స్మిత మరణం తెలుగు తెరకు తీరని లోటు.. అతి తక్కువ టైమ్ లోనే ఊహించని స్థాయికి చేరుకుని మళ్లీ అదే వేగంతో ఆమె కెరీర్ పడిపోయింది. సిల్క్ స్మిత వెండితెరపై ఎగసి పడిన కెరటం..