Ginger
చలికాలం వచ్చిందంటే చాలు రాని సమస్యలంటూ ఉండవు. ముఖ్యంగా జలుబు, దగ్గు, చర్మ సమస్యలు , ఒళ్లు నొప్పులు వంటి ఎన్నో సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. మన శరీరాన్ని అనారోగ్య సమస్యల నుండి కాపాడుకోవడానికి పౌష్టికాహరంతో ఎంతో అవసరం. శీతాకాలంలో చలి వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు దరి చేరకుండా జాగ్రత్తపడాలి. అందుకోసం అల్లం ఎంతో సహయపడుతుంది.
ఇందులో సోడియం, యాంటీ ఇన్ ప్లమేటరీ, యాంటీ ఆక్పిడెంట్, పోటాషియం, విటమిన్ బి మరియు విటమిన్ సి, ఫోలేట్స్, జింక్, మెగ్నీషియం వంటి ఎన్నో లక్షణాలు ఉంటాయి. అల్లాన్ని శీతాకాలంలో ఆహరంలో కలిపి వండుకోవడం వల్ల అనేక వ్యాధుల నుండి నివారణ పొందవచ్చు. అల్లం ఆహరంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
అనారోగ్యం ఏదైనా ఈజీగా మటుమాయం…
శీతాకాలంలో అల్లం అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఉపయోగపగడుతుంది. తరచూ ఇబ్బందికి గురిచేసే జలుబు, ఫ్లూ వంటి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టాలంటే ఆహరంలో అల్లంని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. కావున ఈ చలికాలంలో అల్లంని తరచూ తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అల్లం థర్మోజెనిక్ లక్షణాలకు ప్రసిద్ధి చెందినది. ఇది శరీరంలోని వేడిని పెంచడంలో సహయపడుతుంది. మన శరీర ఉష్ణోగ్రతను పెంచి చలితో ఇబ్బందిపడకుండా కాపాడుకోవడంలో సహయపడుతుంది. శరీరం ఎటువంటి వ్యాధుల బారినా పడకుండా కాపాడుకోవడంలో కూడా దోహదం చేస్తుంది.
ఆయుర్వేదంలో వినియోగం Ginger
పూర్వం అల్లాన్ని అయుర్వేధాలల్లో విరివిగా ఉపయోగించేవారు. ఇది మన శరీరంపై ప్రభావవంతంగా పనిచేస్తుంది. అల్లాన్ని ఎక్కువగా టీ వంటి వాటిలో ఉపయోగిస్తారు. తేనీటిలో అల్లాన్ని ఉడకబెట్టి తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. అల్లం శరీరంలోని ఇన్ఫెక్షన్ నివారించి శరీరాన్ని రక్షిస్తుంది. శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది.
చర్మ సమస్యలకు చెక్ Ginger
అల్లంలోని యాంటీ ఇన్ ప్లమేటరీ గుణాలు , యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండటంతో చలికాలంలో చక్కగా ఉపయోగపడుతుంది. ఈ కాలంలో తరచుగా చర్మం పొడిబారడం వంటి సమస్యలను పోగొట్టడంలో అల్లం ఉపయోగపడుతుంది. చర్మం యొక్క ఆరోగ్యాన్ని పెంచడంలో కూడా దోహదం చేస్తుంది. దీనిలో విటమిన్లు మరియు మినరల్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
మలబద్ధకాన్ని నివారించడంలో… Ginger
శీతాకాలంలో ఆహరంలో మార్పుల వల్ల ఎన్నో సమస్యలను అధిగమించాల్సి ఉంటుంది. మలబద్ధకం, గ్యాస్ , అజీర్తి బాగా ఇబ్బంది పెడతాయి. అల్లం ఉదర సంభంధిత వ్యాధులను నివారించడంలో చక్కగా పని చేస్తుంది. అల్లం జీర్ణక్రియను ప్రోత్సహించడంలో సహయపడుతుంది. అంతే కాకుండా అజీర్ణం, ఉబ్బరం మరియు అనేక జీర్ణ సమస్యల నివారణకు అల్లం ది బెస్ట్ మెడిసన్…
ఫ్యాట్ కంట్రోల్ మరియు లివర్ సమస్యలు దూరం…
ఫ్యాటీ లివర్ తగ్గించుకోడానికి అల్లం సహకరిస్తుంది… అన్నం తిన్న గంట తరువాత అల్లంతో టీ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఫ్యాటీ లివర్ వంటి సమస్యలను ఈజీగా దూరం చేసుకోవచ్చు. అల్లం రక్తప్రసరణను సంమృద్ధిగా మెరుగుపరుస్తుంది. చలికాలంలో అనేక సమస్యలతో బాధపడే వారికి అల్లం మంచి మెడిసిన్ గా సహయపడుతుంది