Megastar
మెగా స్టార్ చిరంజీవి నటనకు, డాన్స్ కి ఫిదా కానీ వారంటూ ఉండరు. ఇప్పటికి 150కి పైగా సినిమాల్లో నటించాడు. తన నటనకు గాను ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఇప్పుడు చిరు 156 మూవీతో మన ముందుకు వస్తున్నాడు. ఈ మూవీకి హీరోయిన్స్ ఎంపిక చాలా కష్టంగా మారిందంటున్నారు దర్శక నిర్మాతలు.
ఐదుగురు హీరోయిన్స్ కోసం వెతుకులాట కష్టంగా మారిందా?
మెగా స్టార్ 156వ మూవీ అయిదు లోకాలను కలుపుతూ హీరో చేసే సాహస యాత్ర నేపథ్యంలో వశిష్ట కథ రాసుకున్నాడట. మూవీ కథ ప్రకారం సినిమాలో ఐదుగురు హీరోయిన్ లు ఉంటారని గతంలోనే ప్రకటించారు. సాధారణంగా సీనియర్ హీరోలకు ఒక హీరోయిన్ ని సెట్ చెయ్యడం దర్శకులకు సవాల్ గా మారుతోంది. అలాంటిది ఏకంగా అయిదుగురు కావాలంటే చాలా కష్టం. ముందుగా అనుష్కను మొదట హీరోయిన్ అనుకున్నారు కానీ డేట్స్ ఇవ్వలేనని చెప్పడంతో ఇప్పుడామె స్థానంలో త్రిషని తీసుకున్నారంటూ టాక్. మృణాల్ ఠాకూర్ కూడా ఈ మూవీలో హీరోయిన్ గా నటించబోతుందని సమాచారం. ఇంకా ముగ్గురు హీరోయిన్ లు కావాలి అంటున్నాడు వశిష్ట. మూవీని అనౌన్స్ చేసి ఇప్పటికే రెండు నెలలు అవుతున్నా కానీ హీరోయిన్స్ వెతుకులాట మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.
సిగ్నల్ ఇచ్చిన ఇద్దరు హీరోయిన్ లు:గ్రీన్ Megastar
ఐదుగురు హీరోయిన్స్ లో ఇద్దరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. బ్యాలన్స్ పాత్రలకోసం ప్రస్తుతం వేట కొనసాగుతోంది. మెహ్రీన్. తమన్నా, రాశి ఖన్నా, పూజా హెగ్డే, రీతూ వర్మ ఇలా వీలైనన్ని ఆప్షన్లు పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. ఇండస్ట్రీలో ఇతర హీరోయిన్ లను సంప్రదిస్తున్నారని సమాచారం. చివరకు చిరు 156వ మూవీ కి ఐదుగురు కథనాయకిలు దొరుకుతారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.
సినీ ప్రముఖులు:
చిరు-156వ మూవీని వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీకి విశ్వంభర అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి MM కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చిత్ర సాంకేతిక బృందంలో రచయిత సాయి మాధవ్ బుర్రా, సినిమాటోగ్రాఫర్ గా చోటా కె నాయుడు ఉన్నారు. ఈ మూవీ జగదేగ వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ గా ఉండబోతుందని సమాచారం. UV క్రియేషన్స్ ఈ మూవీని నిర్వహిస్తుంది. మూవీకి సంబంధించిన తాజాగా అప్డేట్ ఇచ్చారు మూవీ మేకర్స్. విలన్ పాత్రలో హీరో దగ్గుబాటి రానా నటించనున్నాడు. ఈ సినిమాలో ఆరు పాటలు ఉంటాయని కీరవాణి చెప్పారు.
భారీ బడ్జట్ తో చిరు156 మూవీ: Megastar
మెగా స్టార్ 156మూవీలో గ్రాఫిక్స్ ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. అందుకే సీజీ వర్క్స్ కోసమే ఎక్కువ భాగం ఖర్చవుతుందని టాక్. అందుకే 200 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ రూపొందుతుందని సమాచారం. మెగాస్టార్ 156 వ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో ఉండబోతుందట.
మూవీ స్టోరి Megastar
ఈ మూవీ మూడు లోకాల చుట్టూ తిరిగే కథ అని సమాచారం. దేవ, మానవ, పాతాళలోకాల్లో ఓ పాప చుట్టూ తిరిగే ఫాంటసీ కథ అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ ఇప్పట్లో మాత్రం రాదు.. కనీసం రెండేళ్లు పడుతుందట.. 2025 సంక్రాంతి బరిలో నిలుస్తుందని టాక్..