Magnesium
మన శరీరంలో విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు అనేవి ఎప్పుడూ సమపాళ్లల్లో ఉండాలి. వీటిల్లో ఏవి తక్కువైనా మనిషి అనేక సమస్యలతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. దీన్ని వల్ల శరీరం బలహీనంగా మారి ఇతర అనారోగ్య సమస్యలకు కారణం అవుతాయి. మన శరీరానికి అన్ని రకాల విటమిన్లు, ఖనిజాలు అవసరం. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము. ముఖ్యంగా విటమిన్లు A, B, C, D, జింక్, ఐరన్ పోషకాలు తప్పనిసరిగా మన శరీరానికి అందించాలి. అందులో ముఖ్యమైంది మెగ్నీషియం. కండరాలు సరిగ్గా పనిచేయాలన్నా శరీరంలో జీవరసాయన ప్రక్రియలు సరిగ్గా ఉండాలన్నా మెగ్నీషియం తప్పనిసరిగా అవసరం. మెగ్నీషియం నాడీ వ్యవస్థను అదుపులో ఉంచుతుంది. ఇది మానవ శరీరానికి కావాల్సిన అత్యంత ముఖ్యమైన ఖనిజాల్లో ఒకటి.
నరాల బలానికి మెగ్నీషియం కీలకం Magnesium
మానసిక స్థితిని కంట్రోల్లో ఉంచే న్యూరోట్రాన్స్మీటర్ల ఉత్పత్తిలో కూడా మెగ్నీషియం పాల్గొంటుంది. ఎప్పుడైతే శరీరంలో మెగ్నీషియం లోపం ఏర్పడుతుందో అప్పుడు నియంత్రణ లేకపోవడం, నిరాశ, ఆందోళన వంటివి ఏర్పడతాయి. బీపీని కంట్రోల్ చేయడంలో కూడా మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. దీని లోపం వల్ల రక్తపోటు కంట్రోల్లో ఉండదు. గుండె చప్పుడును నియంత్రిచడంలోనూ మెగ్నీషియం పాత్ర కీలకం. విటమిన్ డి వంటి ఇతర పోషకాలను అందించడంలో సహాయపడుతుంది. రక్త ప్రవాహాన్ని నియంత్రించడం నుంచి కండరాల పనితీరు వరకు మెగ్నీషియం ముఖ్యపాత్ర పోషిస్తుంది.
ఆకలి మందగించడమే ముఖ్య సంకేతం…
మన శరీరానికి కావలసినంత మెగ్నీషియం అందకపొతే ఆకలి మందగించడం, తినాలని అనిపించకపోవడం, ఆహరం మీద ధ్యాస లేకపోవడం వంటి సమస్యలు వస్తుంటాయి. మెగ్నీషియం శరీరంలోని గ్లూకోజ్ ని తగ్గేలా చేయడంలో సహయపడుతుంది. దీని మూలంగా మన శరీరంలో మెగ్నీషియం లెవెల్స్ తగ్గనప్పుడు ఆకలి వేయదు. మన శరీరంలో మెగ్నీషియం తగ్గిందని తెలియడానికి ముఖ్య సంకేతంగా దీనిని భావించవచ్చు.
తలనోప్పి, వికారం మరియు కంటి సమస్యలు తలెత్తుతాయి..
శరీరంలో మెగ్నీషియం లెవెల్స్ తక్కువగా ఉంటే తరచూ తలనొప్పి, మైకం కమ్మడం, వికారంగా ఉండటం వంటి సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. మరియు కంటి సమస్యలను కూడా ఎదుర్కోవల్సి ఉంటుంది. కళ్లు మండటం, నొప్పులు రావడం, కళ్ల నుండి నీరు కారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇటువంటి సమస్యలు తీవ్రమైన ఆందోళనకు దారి తీస్తాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
హృదయ స్పందనలో కూడా మార్పులు
మెగ్నీషియం లెవెల్స్ శరీరంలో తగ్గినప్పుడు హృదయ స్పందనలో మార్పులు వస్తాయి. మరియు గుండెను ప్రభావితం చేస్తుంది. గుండె సాధారణంగా కోట్టుకోవడం కంటే వేగంగా కోట్టుకుంటుంది. ఈ సమస్య కూడా మన శరీరంలో మెగ్నీషియం తగ్గిందనడానికి ముఖ్య సంకేతమని చెప్పుకోవచ్చు.
కీళ్ళ నోప్పులు మరియు కండరాల తిమ్మిర్లు Magnesium
ఎముకలు, కండరాలు బలంగా మరియు ధృఢంగా ఉండాలంటే మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మెగ్నీషియం లోపిస్తే కండరాలు కూడా బలహీనంగా మారతాయి. అంతే కాకుండా పొటాషియం స్థాయిలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది కూడా కండరాల తిమ్మిరి, నొప్పులకు దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకొవడం ఉత్తమం.