Mokshagna
నటసింహ నందమూరి బాలకృష్ణ మాస్ సినిమాల్లో నటిస్తూ, పవర్ ఫుల్ డైలాగులతో, ఫైట్ లతో ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తాడు. నటసింహకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. 40 సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో తన నటనతో బాలయ్య మెప్పిస్తున్నాడు. ఆ నటనకి ఫిదా కానీ వారంటూ ఉండరు.
బాలయ్య కొడుకు మోక్షజ్ఞ మూవీ ఎంట్రీ ఎప్పుడెప్పుడని ఫ్యాన్స్ చాలా అతృతగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా బాలయ్య మోక్షజ్ఞ మూవీ ఎంట్రీ 2024లో ఉండబోతుందని అఫిషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఏ డైరెక్టర్ తో ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్త సోషల్ మీడియా చర్చగా మారింది. తాజాగా డైరెక్టర్ కూడా ఒకే చేసినట్లు తెలెస్తోంది….. ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ డైరెక్టర్ ఎవరంటే…. Mokshagna
బాలయ్య తన తనయుడి ఎంట్రీని త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల్లో పెట్టినట్లు మూవీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. బాలయ్య మూవీని త్రివిక్రమ్ నిర్మిస్తున్న సందర్భంగా మోక్షజ్ఞ ఎంట్రీ కి త్రివిక్రమ్ సాయం పట్టడానికి సిద్ధమైవుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు కానీ వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్-బాలయ్య కాంబో చూడలేకపోయిన మోక్షజ్ఞ ఎంట్రీ త్రివిక్రమ్ చేతిలో ఉంటే మాత్రం వీరిద్దరి కాంబినేషన్ లో అయినా ఒక మూవీ చూడగలం.
గతంలో వర్కవుట్ కాలేదు మరి ఇప్పడైనా అవుతుందా? Mokshagna
మోక్షజ్ఞ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రావాలి కానీ అది వర్కవుట్ కాలేదు. బాలయ్య తన వందవ సినిమాలో బిజీగా ఉండటం వల్ల త్రివిక్రమ్ మోక్షజ్ఞ కాంబో మూవీకి బాలయ్య ఓకే చేయలేదట. బాలయ్య ఇప్పుడు మళ్లీ మరోసారి త్రివిక్రమ్ కు అదే అవకాశం ఇచ్చాడట. నటసింహ వందో సినిమాకు కొడుకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు.
బాలయ్య- త్రివిక్రమ్ నిర్మాణంలో రానున్న మూవీ:
ఇప్పటివరకు నందమూరి బాలకృష్ణ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాలేదు. ఇక ముందు కూడా జరుగుతుందనే అంచనాలు కూడా లేవు. అందుకు కారణం బహుశ బాలయ్య అంటే ఊర మాస్ త్రివిక్రమ్ అంటే క్లాస్ అందుకే ఈ కాంబినేషన్ సెట్ అవ్వటం లేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఐతే త్రివిక్రమ్ బాలయ్యను డైరెక్ట్ చేయట్లేదు కానీ త్రివిక్రమ్ నిర్మాణ భాగస్వామ్యంలో ఓ సినిమా రాబోతుందట. బాలయ్య భగవంత్ కేసరి తర్వాత బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు… ఈ సినిమాలో త్రివిక్రమ్ నిర్మాణ భాగస్వామి అన్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి త్రివిక్రమ్ సంస్థ ఫార్చ్యూన్ ఫోర్ ఆ చిత్రాన్ని నిర్మిస్తుంది.
త్రివిక్రమ్ మాటలు తూటాలుగా:
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ రైటర్ గా ఒక ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పాటు చూసుకొని తెలుగులో తనదైన శైలిలో కథ, మాటలను తూటలుగా సింపుల్ స్టోరీతో తెరకెక్కిస్తాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు ఇండస్ట్రీ హిట్ లుగా నిలిచాయి. త్రివిక్రమ్ ఇప్పుడు మహేష్ బాబు తో గుంటూరు కారం మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గుంటూరు కారం తరువాత మోక్షజ్ఞ ను మూవీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తాడో లేదో చూడాలి.