Rashmika
రష్మికా మందన్న తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. తన గ్లామర్ తో, క్యూట్ మాటలతో ప్రేక్షకులను మైమరిచేలా చేస్తుంది. రష్మికను అందరూ నేషనల్ క్రష్ అని ముద్దుగా పిలుచుకుంటారు. పుష్ప-1, యానిమల్ సినిమాల్లో నటించి కుర్రాళ్ల కలలరాణిగా మారింది ఈ బ్యూటి. ఈ మధ్యకాలంలో ఏ ఇండస్ట్రీకి లోకి అడుగుపెట్టినా నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతున్నాయి….. రోజు రోజుకి ఈమె క్రేజ్ కూడా బాగా పెరుగుతుంది.
రీసెంట్ గా నటించిన సినిమాలకు గాను తానే అన్ని భాషల్లో డబ్బింగ్ కూడా చెప్పుకుంటుంది. పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా తన హవా నడుపుతుంది. వరస సినిమా ఆఫర్లతో దూసుకుపోతుంది ఈ అమ్మడు….. యానిమల్ మూవీ సక్సస్ ను ఎంజాయ్ చేస్తున్న రష్మిక తన నెక్ట్స్ మూవీ గురించి లెటేస్ట్ అప్డేట్ ఇచ్చింది. రష్మిక తన నెక్ట్స్ మూవీలో…డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించబోతుందట.
లేడి ఓరియెంటెడ్ మూవీలో నటించబోతున్న రష్మిక: Rashmika
ఇప్పటివరకూ హీరోకి జోడిగా నటించి అందరిని ఆకట్టుకున్న ఈ బ్యూటి…. ఇక ఫస్ట్ టైమ్ లేడీ ఓరియెంటెడ్ మూవీకి ఒకే చెప్పింది.. అన్నీ తానే అయ్యి సినిమాను భుజాలపై మోయడానికి రెడీ అయిపోయింది రష్మిక. ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీలో లేడీ ఓరియెంటెడ్ పాత్రలో రష్మికా మందన్నను చూడబోతున్నాం. ఇక ఈ మూవీలో నేషనల్ క్రష్ ను కొత్త క్యారెక్టర్ లో చూపించబోతున్నాం అంటున్నారు మేకర్స్.
రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ మూవీ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటుందా? Rashmika
రష్మిక మూవీ కెరీర్ లో కొత్త స్టైల్ ను స్టార్ట్ చేసింది. ది గర్ల్ ఫ్రెండ్ ఓ డిఫరెంట్ స్టోరీతో రూపొందుతుందని సమాచారం. ఈమూవీ కోసం రష్మిక మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటుందని టాక్. ఫైటింగ్ , యాక్షన్ సీక్వెన్స్ లో ఈ సినిమా రానుందట. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ టైటిల్ లవ్ స్టోరీ అని అందరూ అనుకుంటున్నారు కానీ ఈ సినిమా ఫైటింగ్ యాక్షన్ లతో కొనసాగుతుందట.
ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లోని శివార్లలో జరగనుందట.
మొదటి దశ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందట. మొదట 20 రోజుల షూటింగ్ లో రష్మికతో యాక్షన్ సన్నివేశాలను చిత్రికరించబోతున్నారని తెలుస్తుంది. రష్మిక ఈ మూవీలో రెండు డిఫరెంట్ షెడ్స్ లో కనిపించబోతుందట. ఈ సినిమాలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని మేకర్స్ అంటున్నారు. దిగర్ల్ ఫ్రెండ్ మూవీలో విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారని సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటి వరకు మూవీ టీం అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రముఖులు:
ది గర్ల్ ఫ్రెండ్ మూవీని చీ.లా.సౌ మూవీతో జాతీయ అవార్డును అందుకున్నా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్ మూవీమేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి గీతాఆర్ట్స్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తున్నాయి. విద్య కొప్పినేని. ధీరజ్ మొగిలినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు.