JSP
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో సెటైర్లు పేలుతున్నాయ్.. ముఖ్యంగా తెలంగాణలో ఎనిమిది చోట్ల పోటీ చేసి ఎక్కడా డిపాజిట్లు దక్కించుకోలేకపోవడం పవన్ రాజకీయ భవిష్యత్తు పెద్ద జీరో అని చెప్పకనే చెబుతోంది. ఇక పార్టీ ఎందుకు మూసేసుకోండంటూ ప్రత్యర్ధి పార్టీ సెటైర్లు వేస్తోంది. తెలంగాణలో గెలుస్తాం ముఫ్పై సీట్లు, నలభై సీట్లు కావాలి అంటూ గొంతెమ్మ కోర్కెలు కోరిన జనసేన నేతలంతా ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. ఇచ్చిన ఎనిమిది సీట్లలోనూ గెలవలేని వారు రాష్ట్రమంతా పదుల సంఖ్యలో సీట్లిస్తే మరింత అతిపెద్ద పరాభవాన్ని మూట కట్టుకున్నవారయ్యేవారు. ఇంత జరుగుతున్నా అభిమానులకు బుద్ధి రాటం లేదు.. పవన్ కూడా యధా రాజా తధా ప్రజా లాగ వాళ్ల అత్యుత్సాహానికి, హద్దులు మీరిన అభిమానానికి బలవుతున్నాడు.
పోటీ చేసి తప్పు చేశారా? JSP
తెలంగాణ ఎన్నికల్లో పవన్ పోటీ చేయకుండా బీజేపికి మద్దతుగా ప్రచారం చేసి ఊరుకుని ఉంటే బాగుండేది.. కానీ తెగించి పోటీ చేయడం అతిపెద్ద తప్పు.. తెలంగాణలో బీజేపితో కలసి పోటీ చేసి ఏపీలో బీజేపి కి చెప్పకుండానే టీడీపీతో పొత్తు పెట్టుకున్న ఘనుడు పవన్.. అదేదో తన తెలివైన నిర్ణయంగా అతడు భావిస్తుండోచ్చు.. కానీ రాజకీయ మిత్ర త్వంలో కొన్ని కొన్ని ధర్మాలు పాటించాల్సి ఉంటుంది.. రోడ్ మ్యాప్ ఇవ్వాలంటూ కొన్నాళ్లు హడావుడి చేసిన పవన్ టీడీపీతో పొత్తు విషయంలో మాత్రం బీజేపికి కనీసం ముందు చెప్పలేదు.. అంటే పవన్ కావాలనే ఇలా ప్రవర్తించారన్నది స్పష్టమవుతోంది. తనతో బంధం ఉండాలో లేదో బీజేపి నిర్ణయించుకోవాలని ఆయన ఈస్టెప్ తీసుకున్నట్లుగా అర్దమవుతోంది.
బీజేపి పట్టుకు వేళ్లాడుతోందా?
మరి పవన్ ఇంతలా బీజేపిని వదుల్చుకోవాలని చూస్తుంటే బీజేపి మాత్రం మేం పవన్ తో పొత్తులోనే ఉన్నాం అంటూ పవర్ స్టార్‌ను పట్టుకుని వేళ్లాడుతోంది. ఈ నేపధ్యంలో తెలంగాణ ఎన్నికలు జరిగాయి. ఇక్కడ బీజేపి అనూహ్యంగా పుంజుకుంది.. ఒక స్థానం నుంచి ఏకంగా ఎనిమిది స్థానాలు గెలిచే స్థాయికి ఎదిగింది. అసలింకా బండి సంజయ్ ను తప్పించకుండా ఉండి ఉంటే ఏకంగా పాతిక సీట్ల వరకూ గెలుచుకునే అవకాశం ఉండి ఉండేదేమో… కానీ బీజేపి హై కమాండ్ బండిని తప్పించి తన కొమ్మను తానే నరుక్కుంది. అయినా తెలంగాణలో బీజేపి పెర్ఫార్మెన్స్ అద్భుతంగానే ఉన్నట్లు లెక్క.. మిత్రపక్షమైన పవన్ మాత్రం అతిపెద్ద జీరో అని అర్ధమైపోతోంది.
జగన్ పై దూకుడు తగ్గించిన పవన్ JSP
తెలంగాణ ఎన్నికలు జనసేనకు తెస్తున్న తల నొప్పులు ఇన్నీ అన్నీ కావు.. ఇక్కడ డిపాజిట్లు రాని పవన్ ఏపీలో వచ్చి ఏదేదో చేసేస్తా.. గెలిచేస్తా అంటే అక్కడి జనం ఏం చెవిలో పూలు పెట్టుకోలేదు. పైగా రాజకీయ సమీకరణలు ఇకపై అక్కడ కూడా మారబోతున్నాయి. కేసీఆర్ కు ఎదురైన అనుభవం చూశాక జగన్ జాగ్రత్త పడుతున్నారు. అక్కడ కనీసం యాభై మంది సిట్టింగులను మార్చాలని నిర్ణయించుకున్నారు. సో వైసీపీ తన జాగ్రత్తల్లో తానుంటోంది.. ఎటొచ్చి జనసేన రెంటికీ చెడ్డ రేవడిగా మారిపోయింది. పరిస్థితి ఎంతలా దిగజారిందంటే.. నేను జగన్ ను ద్వేషించడం లేదు.. అతనిపై నాకు కోపం లేదు ఊరూ వాడా.. చెప్పండయ్యా బాబూ అని పవన్ ఇప్పుడు మొత్తుకుంటున్నారు.
గతంలో జగన్ ను పవన్ దూషించినంత అసహ్యంగా మరెవరూ దూషించి ఉండరు.. ఏయ్ జగన్.. ఇటు రా.. నా ముందొచ్చి నిలబడు.. నువ్వెంత.. నీ బతుకెంత? నీ స్థాయి ఎంత?నువ్వొక వీధి రౌడీవి… నీకు తల్లిదండ్రులు సభ్యతా,సంస్కారం నేర్పలేదా? అంటూ అడ్డగోలుగా మాట్లాడిన పవన్ ఇప్పుడు సడెన్ గా రూట్ మార్చి జగన్ పై తక్కువ విమర్శలు చేయాలని నిర్ణయించుకున్నట్లున్నారు. జగన్ పై తాను చేస్తున్న విమర్శలు తనకు బూమరాంగ్ అవుతున్నాయని చాలా ఆలస్యంగా గ్రహించినట్లున్నారు.
టీడీపీ కూడా లైట్ తీసుకుందా? JSP
మరోవైపు తెలంగాణ ఓటమి నేపధ్యంలో టీడీపీ కూడా జనసేనను పెద్దగా పట్టించుకోవడం లేదన్నది ఒక టాక్.. ఇక ఊరూ, వాడా, టీడీపీకి, జనసేనకు క్షేత్రస్థాయిలో అస్సలు పడటం లేదు… ఎక్కడికక్కడ స్థానిక నేతలూ, కార్యకర్తలు కొట్టుకుంటున్నారు… ఈ స్థితిలో ఏపీలో జనసేన పరిస్థితి మరింత దిగజారేలా ఉందే తప్ప ఏరకమైన ప్రోగ్రెస్ లేదు. తెలంగాణలో ఓటమి ఏపీలో జనసేన భవిష్యత్తును ఊచకోత కోసేస్తుందన్నది ఒక అంచనా… కాబట్టి పవన్ కల్యాణ్ రాజకీయంగా అన్ ఫిట్ అనే వాదనలు బలం పుంజుకుంటున్నాయి. ఎన్నికలకు ఎంతో సమయమే లేదు… తెలంగాణలో ఓటమి పార్టీని, పవన్ ను నైతికంగా దెబ్బతీసిన మాట వాస్తవం…రెంటికీ చెడ్డ రేవడి అంటే ఇదేనేమో.!