Raw Coconut
ఈ ప్రపంచంలో మనిషి ఎంత సంపాదించినా వారి ఆరోగ్యం సరిగా లేకపోతే మాత్రం ఆ సంపదను ఎవ్వరూ అనుభవించలేరు. అలాంటప్పుడు సంపాదించడమే వృధా అవుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితిలో అయినా ఆరోగ్యాన్ని ఆశ్రద్ధ చేయకూడదు. అందుకు ముఖ్యంగా మనం తీసుకునే ఆహరంలోనే మన శరీరానికి అవసరమయ్యే విటమిన్లు, మినరల్స్ వంటివి పుష్కలంగా ఉంటాయి. మనం తీసుకునే ఆహర పదార్థాలలో పచ్చి కొబ్బరి కూడా ఒకటి. పూర్వం కొబ్బరిని అనేక విధాలుగా తినేవారు.
దీని వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా చలికాలంలో పచ్చి కొబ్బరి తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంతేకాకుండా కొబ్బరి చాలా బలం అని కూడా పెద్దలు చెబుతుంటారు. అప్పటి కాలంలో కొబ్బరినే చిరుతిళ్లుగా తినేవారు. కానీ ప్రస్తుతం దీనిని కేవలం కూరల్లో మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు పచ్చి కోబ్బరి తినేవారు చాలా తక్కువ. ఇది సహజంగానే స్వీట్ నేచర్ ని కలిగి ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం పచ్చి కొబ్బరి దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తుందని ఆయుర్వేధ వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
పోషకవిలువలు… Raw Coconut
దీనిలో కాపర్, సెలీనియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్. ఫోలేట్, విటమిన్ సి, థయామిన్ వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇవన్నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేయడంలో ఉపయోగపడుతుంది.
చర్మానికి ఎంతో మేలు చేసే కొబ్బరి…
దీనిని తీసుకోవడం వల్ల చర్మం యొక్క ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలున్నాయి. ఎందుకంటే ఇందులో యాంటీ బ్యాక్టీరీయా లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది చర్మ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. మరియు మలబద్ధకం వంటి సమస్యలు కూడా దూరమైతాయి. దీనిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సంబంధిత సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి. కొబ్బరిలో ఫైబర్ అధికంగా ఉండటం వలన మలబద్థకం, కడుపులో నోప్పి, ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటివి తగ్గడానికి చక్కగా సహయపడతాయి.
ఇమ్యూనిటీ పెంచడంలో… Raw Coconut
పచ్చి కొబ్బరి తినడం వల్ల రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, మాంగనీస్ ఎక్కువగా ఉంటాయి. అందువలన దీనిని తినడం వల్ల ఇతర వ్యాధులు దరి చేరకుండా రక్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తపడడానికి ఎంతగానో సహయపడుతుంది.
యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా…
దీనిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫ్రీ రాడికల్స్ వల్ల శరీరానికి కలిగే నష్టం నుండి కాపాడుతుంది. అలాగే కోబ్బరిని తినడం వల్ల నిద్రలేమి సమస్యలు కూడా దూరమౌతాయి. ప్రతిరోజు దీనిని తినడం వల్ల ఇందులో ఉండే విటమిన్లు మంచి నిద్ర వచ్చేందుకు చక్కగా సహయపడతాయి. అంతేకాకుండా ఒత్తిడిని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది.
వెయిట్ లాస్ కి చక్కటి మెడిసిన్… Raw Coconut
వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు పచ్చి కొబ్బరిని ఆహరంగా తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే దీనిలో పీచు పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది కొంచెం తినడం వల్ల పొట్ట నిండిన ఫీలింగ్ ఉంటుంది. అంతే కాకుండా పచ్చి కొబ్బరిని తినడం వల్ల తక్షణమే ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. దీంతో ఇతర ఆహారాలను ఎక్కువగా తీసుకోలేరు. క్రమం తప్పకుండా కోబ్బరిని తీసుకుంటే ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు.
ఇలా పచ్చి కొబ్బరితో అనేక లాభాలు మరియు ప్రయోజనాలున్నాయి. ప్రతి రోజు ఏదోక విధంగా కొబ్బరిని తినడం మంచిది.