Anger Management
ప్రతి మనిషిలో అనేక రకాల భావోద్వేగాలు ఉంటాయి. అందులో కోపం కూడా ఒకటి మనిషికి రోజూ రకరకాల కారణాల వల్ల కోపం రావడం సహజం ముఖ్యంగా అనేక పని పనుల ఒత్తిడి కారణంగానే మనిషి యొక్క కోపానికి దారితీస్తుంది. అయితే కోపానికి కారణం మన శరీరంలో జరిగే హార్మోన్ల మార్పులే అంటున్నారు వైద్య నిపుణులు. అందుకే ప్రతి చిన్న అంశానికి కూడా కోపం వస్తుంటుంది. కానీ ప్రతిసారీ కోపం తెచ్చుకోవడం వల్ల మనల్ని మరింత ప్రమాదంలోకి పడేస్తుంది. మితిమీరిన కోపం చాలా అనర్ధాలకు దారితీస్తుంది. మరి కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. మన కోపాన్ని తగ్గించుకోవడానికి మనమే కొన్ని మార్పులను మన లైఫ్ లో చేర్చుకోవడం మంచిది.
మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచిస్తే….. Anger Management
క్షణంలో కోపం తెచ్చుకోవడం అనేది చాలా సులభం. కానీ ఆ తర్వాత పశ్చాత్తాపం పడినా ప్రయోజనం ఉండదు. కోపంలో ఏదైనా మాట్లాడే ముందు ఒక్క సెకను ఆలోచించటం మంచిది. ఆలోచించి మాట్లాడటం వల్ల అవతలి వ్యక్తుల్ని గాయపరిచే మాటలు మాట్లాడకుండా ఉంటారు. కోపంలో మనం చేసే మొదటి తప్పు ఇదే.
ప్రశాంతంగా ఉన్నప్పుడు భావాలను వ్యక్తం చేయండి…..
కోపంలో ఉన్నప్పుడు చాలా మంది వారి భావాలని వ్యక్తం చేయలేరు. ఈ క్రమంలో ప్రశాంతంగా ఉన్న సమయంలో మీ నిరాశను, ఆందోళనను అవతలి వారికి అర్థమయ్యేలా వ్యక్తం చేయండి. వారి అలోచనలను కూడా స్పష్టంగా అణచివేయాలని ప్రయత్నించకుండా మీ ఆందోళనలు అవసరాలను స్పష్టంగా, నేరుగా తెలియజేయండి.
కొంతవరకు వ్యాయామం మంచిది ……. Anger Management
శారీరక శ్రమ ఒత్తిడిని తగ్గించడంలో వ్యాయామం సహయపడుతుంది. మీ కోపం పెరుగుతున్నట్లు మీకు అనిపిస్తే ఆ సమయంలో వేగంగా నడవండి లేదా పరిగేతడం వంటివి చేస్తే కొంతవరకు కోపాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మరియు ఇతర ఆనందదాయకమైన శారీరక కార్యకలాపాలను చేయడం వల్ల కూడా కోంతవరకు కోపం నుండి విముఖ్తి పోందవచ్చు.
విశ్రాంతితో కోపం, చిరాకు మాయం..
చాలా మంది వారి సమయాన్ని ఉద్యోగం, ఇళ్లు, పిల్లలకు ఎక్కువగా కేటాయిస్తుంటారు. ఒత్తిడికి గురైనప్పుడు కాస్త సమయాన్ని మీకోసం మీరు కొంతవరకు సమయం కేటాయించడం మంచిది. కొన్ని క్షణాల పాటు నిశ్శబ్ఢంగా ఉండటం వల్ల కూడా చిరాకు, కోపం వంటివి రాకుండా ఉండేలా జాగ్రత్తపడోచ్చు.
కొన్నిసార్లు కోపం పగగా మరే అవకాశాలున్నాయి..
క్షమాపణ అనేది కూడా ఒక శక్తివంతమైన సాధనం. కోపంతో ఇతర ప్రతికూల భావావేశాలను పెంపొందించుకోవడం వంటివి వదిలేయండి. మోసపోయామని, అన్యాయం జరిగిందనే భావనతో మిమ్మల్ని మీరు బాధపెట్టుకోవటం కూడా వదిలేయండి. ఎందుకంటే కోపానికి, ఆవేదనకు కారణమైన వ్యక్తిపై పగను పెట్టుకోకుండా క్షమించి వారి నుండి జీవిత గుణపాఠం నేర్చుకున్నారనుకోని ఇంకెప్పుడు ఎవరిని ఈజీగా నమ్మకుండా సహయపడుతుంది.
టెన్షన్‌ను వదిలేయడం ఉత్తమం… Anger Management
కొన్ని సమయాలల్లో ఒత్తిడిని తొలగించడానికి జోక్స్ మరియు కామెడీ వంటివి సహాయపడతాయి. కోపం తెప్పించే విషయాలు ఎదురైనప్పుడు మీ లైఫ్ లో ఎదురైన ఫన్నీ మూమెంట్స్ ని గుర్తుతెచ్చుకొండి కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. అంతేగానీ వ్యంగ్యంగా మాట్లాడటం మానేయండి. అది అవతలి వారి భావాలను దెబ్బతీస్తుంది. మీ మధ్య మరింత ఆగ్రహాన్ని పెంచుతుంది. ఇలా చేయడం వల్ల కోపాన్ని కంట్రోల్ లో ఉంచుకొవచ్చు.