SAM
ఏ మాయ చేశావే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమంత అక్కడనుంచి వెనక్కు చూసుకోలేదు.. అంచెలంచెలుగా ఎదుగుతూ హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ స్థాయికి ఎదిగింది.. వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడింది సామ్.. ఎన్నో దానాలు, ఆర్థిక సాయాలు చేయడం సామ్ కు అలవాటే.. చిన్న పిల్లల గుండె జబ్బుల నివారణకు లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేసింది ఈ బ్యూటీ.. సమంతాకు ఫ్యాన్స్ క్రేజ్ కూడా ఎక్కువే. హీరోయిన్ గా లైఫ్ లీడ్ చేసిన సామ్ ఇప్పుడు ప్రొఫెషనల్ గా మరో ముందడుగు వేసింది. ఈ వార్తను విన్న అభిమానులు సామ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పుడు ఏకంగా ఒక ప్రొడక్షన్ హౌస్ నే ప్రారంభించింది.
ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించిన చేసిన SAM
సిల్వర్ స్ర్కీన్ పై హీరోయిన్ గా తన సత్తా చూపించిన సామ్ తనలోని నిర్మాతను అందరికి పరిచయం చేసేందుకు రెడీ అయింది. సొంతంగా నిర్మాణ సంస్థను స్థాపించింది. ప్రొడక్షన్ హౌస్ కి ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ అనే పేరును పెట్టినట్టు తెలిపింది సామ్. ఎంతో ప్రాచుర్యం పొందిన ఇంగ్లీష్ పాప్ సాంగ్ ‘బ్రౌన్ గర్ల్ ఇన్ ది రింగ్’ లోని లిరిక్స్ లో వచ్చే ట్రా లా లా అనే పదాన్ని తీసుకొని తన ప్రొడక్షన్ కు పేరు పెట్టింది సామ్. ఇదే విషయాన్ని ప్రకటిస్తూ ఓ వీడియోను షేర్ చేసింది సామ్. అందులో తను ఓపెన్ చేసిన ప్రొడక్షన్ హౌస్ గురించి మాట్లాడుతూ…. నా ప్రొడక్షన్ హౌస్ ని ప్రకటించినందుకు చాలా సంతోషిస్తున్నాను…. సామాజిక అంశాలు, వాటి సంక్లిష్టత గురించి మాట్లాడే కథలను అలాంటి అంశాల ఆధారంగా రూపొందే కథలను ప్రోత్సహించే ప్లాట్ ఫాం ఇది అంటూ చెప్పుకొచ్చింది సామ్..
ఫ్యాన్స్ కి ఉత్సాహాన్ని కలిగించిన సమంత..
మయోసైటిస్ బారిన పడిన సమంత ఆ వ్యాధిని తగ్గించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ మధ్యకాలంలో ఖుషీ మూవీలో నటించి అందరిని ఆకట్టుకుంది. మయోసైటిస్ ను పూర్తిస్థాయిలో కోలుకునేందుకు కెరీర్ కి గ్యాప్ ఇచ్చి విదేశాల్లో చికిత్స కూడా తీసుకుంది.. కెరీర్ కు గ్యాప్ ఇవ్వడంతో ఆమె తిరిగి ఎప్పుడు సినిమాల్లోకి వస్తుందా అని ఫ్యాన్స్ అతృతగా ఎదురుచూస్తున్న టైమ్ లో కొత్త బ్యానర్ ను స్టార్ట్ చేసి అభిమానులను ఉత్సాహా పరిచింది సామ్. SAM
ఓటీటీ ప్లాట్ ఫాంలో సందడి చేయబోతున్న ముద్దుగుమ్మ