DIVORCE
సమంత నాగచైతన్య వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట పెళ్లి చేసుకున్న కొద్ది సంవత్సరాలకే విడాకులతో విడిపోవడం చాలా మంది అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు కూడా తట్టుకోలేకపోయారు. సడన్ గా విడిపోయి ప్రేక్షకుల అందరిని షాక్ కి గురిచేశారు. వీరిద్దరూ విడిపోయిన దగ్గర నుంచి వీళ్లు మళ్ళీ కలవబోతున్నారంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు వీరిద్దరూ ఎందుకు విడిపోయారో కారణాలు ఎవరికీ తెలియదు. అయితే సామ్ చైతు విడిపోవడానికి కారణాలపై నాగార్జున క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం.
విడిపోడానికి జాను సినిమానే కారణమా?
సమంత నాగచైతన్య గొడవలు రావడానికి కారణాలను నాగార్జన తన సన్నిహితుల దగ్గర చెప్పుకొని భాదపడ్డారట. చైతు సమంతను ఈ సినిమాలో నటించవద్దని చెప్పడట. అయితే సామ్ చైతు చెప్పిన వినకుండా ఆ సినిమాలో నటించిందట. అప్పుడే చైతూలో తన మాట వినడం లేదన్న భావన వచ్చి ఈగో హర్ట్ అయిందట.. అసలు ఏమిటి ఆ సినిమా ? ఆ సినిమా ఏదో కాదు జానూ… తమిళంలో సూపర్ హిట్ అయిన జానూ సినిమా తెలుగులో సమంత -శర్వానంద్ కాంబినేషన్ లో వచ్చింది. ఈ సినిమా విడుదలయ్యాకే సమంత, నాగచైతన్య మధ్య గొడవ స్టార్ట్ అయ్యిందట. ఆ గొడవలు రోజురోజుకీ పెరుగుతూ చివరికి విడాకులు తీసుకునే వరకు వచ్చాయట. తన కొడుకు, కోడలు విడిపోడానికి పునాది జాను సినిమా నాడే పడిందని నాగర్జున తన బంధువులు, స్నేహితుల దగ్గర చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకున్నారట. కానీ జాను సినిమా తర్వాత చాలా కాలం సామ్, చైతు కలిసే ఉన్నారు. కాకపోతే వారి మధ్య మనస్పర్ధలకు ఈ సినిమా బీజం వేసిందేమో మరి..
సోషల్ మీడియాలో పుకార్లు DIVORCE
సామ్, చైతు విడాకులు తీసుకోవడానికి కారణం ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ లో నటించడమే అని అప్పట్లో పుకార్లు బాగా వచ్చాయి. ఈ వెబ్ సిరీస్ లో సామ్ బోల్డ్ పాత్రలో నటించి విమర్శలకు గురైంది. ఈ వెబ్ సిరీస్ వల్లే సామ్, చైతు మధ్య గొడవలు వచ్చాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే అలాంటిదేమీ లేదంటూ ఎన్నో ఇంటర్వ్యూలలో నాగచైతన్య బయటపెట్టాడు. అలాగే సమంత నటించిన ఈ వెబ్ సిరీస్ నాకు చాలా ఇష్టమంటూ క్లారిటీ ఇచ్చాడు చైతూ. సామ్ నటించిన ఫ్యామిలీ మ్యాన్ లాంటి వివాదాస్పద వెబ్ సీరీస్ తో పోలిస్తే జాను సినిమా చాలా నీట్ గా ఉండే సినిమా.. దానికి చైతు ఎందుకు అబ్జెక్ట్ చేశాడో తెలీదు.. కానీ తాను చెప్పిన ఒక సూచనను పట్టించుకోకుండా సామ్ తన నిర్ణయం తీసుకోవడమే చైతన్యను బాధించిందనే రీజన్ వినిపిస్తోంది.
పుండు మీద కారంలా ఊ అంటావా మావా…
వీరిద్దరూ విడిపోయిన తరువాత సామ్ పుప్ప-1లో ఫస్ట్ టైమ్ ఐటమ్ సాంగ్ లో డాన్స్ చేసింది. విడిపోయాక సామ్ పుష్ప-1లో ఊ అంటావా మావా.. ఊహూ అంటావా.. అంటూ ఓ వ్యాంప్ డ్యాన్స్ లో విపరీతమైన ఎక్స్ పోజింగ్ , స్టెప్స్ తో అదరగొట్టింది.. ఈ మూవీ చూసిన వాళ్లు ఈ ధోరణే చైతుకీ నచ్చి ఉండదు అని చెప్పుకున్నారు కూడా.. అందుకే విడిపోయారని కూడా అనుకున్నారు. గ్లామర్ పాత్రల్లో నటించడం, విపరీతంగా ఫోటోషూట్ చేయడం, ఎక్స్ పోజింగ్ చేయడంలాంటి సమంత నిర్ణయాలు వీరిద్దరి మధ్య విభేదాలు సృష్టించి ఉంటాయని సమాచారం. ఇలా సమంత చేయడం అక్కినేని ఫ్యామిలీకి ఇష్టం లేదని తెలుస్తుంది. అక్కినేని కుటుంబంలోకి సమంత అడుగుపెట్టిన తర్వాత అమల మాదిరిగా సింపుల్ , సాదా జీవితాన్ని అనుసరించాలని, ఇలాంటి వివాదాస్పద క్యారెక్టర్స్ ఉన్న సినిమాలు వద్దని చెప్పారట… కానీ సమంత తన పంథానే కొనసాగించడంతో చైతుతో ఆమెకు గ్యాప్ పెరిగిపోయిందని సినీ వర్గాలు చెప్పుకొంటున్నాయి.
నాలుగేళ్లలోనే విడిపోయిన జంట DIVORCE
సామ్-చైతు ఏమాయ చేశావే సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో నటించే టైమ్ లోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. వీరిద్దరి రిలేషన్ చాలా రోజుల పాటు గుట్టుగా దాచుకుంటూ వచ్చారు. చివరకి ఇరు కుటుంబ సభ్యులను ఒప్పింయి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అప్పటిల్లో టాలీవుడ్ ట్రెడింగ్ కపుల్ గా ఉన్నారు. పెళ్లి చేసుకున్న నాలుగేళ్లల్లోనే విభేదాల కారణంగా విడాకులు తీసుకొని ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు ఈ జంట.