Iron
విటమిన్ ఎ నుంచి కాల్షియం వరకు అన్ని రకాల పోషకాలు మన శరీరానికి అవసరం. ముఖ్యంగా రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి ఐరన్ చాలా అవసరం. చాలా మందికి ఐరన్ లోపం ఉంటుంది. అలాంటప్పుడు ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే, కొన్ని ఫుడ్స్ తినడం వల్ల ఆ సమస్య దూరమవుతుంది. హిమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాలలో కనిపించే ఒక రకమైన ప్రోటీన్. హిమోగ్లోబిన్ లోపం వల్ల మీ శరీరంలో రక్తహీనత ఏర్పడుతుంది. పురుషుల కంటే మహిళలకు రక్తహీనత వచ్చే ప్రమాదం మరింత ఎక్కువ. శరీరంలో హిమోగ్లోబిన్ లోపం ఏర్పడినప్పుడు చర్మం పాలిపోవడం వంటివి అవుతాయి. శరీరంలో ఐరన్ లోపం తలెత్తితే రక్తంలో హిమోగ్లోబిన్ తన పాత్రను నిర్వహించడంలో సమస్య ఎదురవుతుంది.
ఐరన్ లోపం లక్షణాలు… Iron
రెగ్యులర్‌గా చెమటలు పట్టడం, అలసిపోవడం, కళ్ళు తిరగడం, చిన్న చిన్న పనులకు అలసట రావటం, నీరసంగా ఉండడం, బలహీనంగా ఉన్నట్టు అనిపించడం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటం వంటి లక్షణాలు వస్తాయి. ఇక ఐరన్ లోపంతో ఏ విషయంపైన ఏకాగ్రత ఉంచలేరు. పాలిపోయిన చర్మం, ఆకలి లేకపోవడం, నెమ్మదిగా బరువు పెరగడం, చిరాకుగా, గజిబిజిగా ఉండటం ఇలాంటివన్నీ కూడా ఐరన్ లోపం వల్ల వచ్చే సమస్యలు. కొన్ని సార్లు సమస్య ఎక్కువగా ఉంటే కళ్ళు తిరుగుతుంటాయి. దీనిని కంట్రోల్ చేయకుండా అలానే వదిలేస్తే ఇతర సమస్యలు వస్తాయి. వీటిని కంట్రోల్ చేసుకోవాలంటే తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి.
ఉసిరికాయ, బీట్ రూట్…
శీతాకాలంలో ఉసిరి అందుబాటులో ఉంటుంది. రోజూ ఉదయాన్నే ఉసిరికాయ రసం తాగితే శరీరంలో విటమిన్ సి లోపం ఉండదు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరం ఐరన్‌ను గ్రహించడంలో సహాయపడుతుంది. అలాగే హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. బీట్రూట్లో ఐరన్‌తో సహా అనేక పోషకాలు ఉన్నాయి. ఇది శరీరంలో ఐరన్ లోపాన్ని పూరించి హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది.
హిమోగ్లోబిన్ పెంచే పాలకూర, గుడ్లు Iron
ఆకుకూరల్లో శరీరానికి అవసరమయ్యే ఎన్నో గుణాలు ఉన్నాయి. ఐరన్ లోపంతో బాధపడేవారు వీటిని తీసుకోవడం వల్ల సమస్య దూరమవుతుంది. ముఖ్యంగా పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, పాలకూరని రెగ్యులర్‌గా తీసుకుంటే మంచిది. అలాగే రోజుకో గుడ్డు తినడం చాలా మంచిది. దీనిలో ప్రోటీన్, మినరల్స్, ఐరన్, ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఐరన్ లోపంతో బాధపడేవారు రోజుకో గుడ్డు తినడం వల్ల ఆ సమస్య దూరమవుతుంది.
ఆకుకూరల్లో పుష్కలంగా ఐరన్
ఐరన్ లోపాన్ని తగ్గించేందుకు రెడ్ మీట్, బీట్రూట్, ఆకుకూరలు, బచ్చలికూర, ఉల్లిపాయలు, ఆకుకూరల్ని తీసుకోవాలి. వీటితో విటమిన్ సి పండ్లు, కూరగాయలు, పాలకూర, గింజ పప్పులు, చికెన్ ఇతర పోషకాలతో పాటు ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. దీంతోపాటు జీలకర్ర, కొత్తిమీర, పసుపు, టమాటలు, యాపిల్స్, చెర్రీలు వంటి ఎరుపు దనం ఉన్న పండ్లు, ఆహార పదార్థాల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వాటిని తరచూ తింటుంటే ఐరన్ లోపం సమస్య నుంచి బయట పడవచ్చంటున్నారు వైద్య నిపుణులు. అలాగే టీ, కాఫీలకి దూరంగా ఉండాలని డాక్టర్స్ చెబుతున్నారు.
Iron