Vitamins
చిన్న వారికైనా, పెద్ద వారికైనా వారి వయసుకు తగ్గట్టుగా విటమిన్లు అవసరం అవుతాయి. కానీ పురుషుల కంటే మహిళలకు కావాల్సిన విటమిన్లు వేరుగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజువారీ డైట్ లో మహిళలు తప్పనిసరిగా కొన్ని రకాల విటమిన్ లను ఖచ్చితంగా తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. మహిళలు కుటుంబాన్ని మొత్తాన్ని చూసుకోవాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులు పెడతారు. కాబట్టి ఖచ్చితంగా మగవారి కంటే ఆడవారికి ఎక్కువ బలం అవసరం అవుతుంది. మరి లేడీస్ కి ఎలాంటి విటమిన్లు అవసరం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
విటమిన్ ఏ…
ఈ విటమిన్ లోని యాంటీ ఇన్ ప్లమేటరీ గుణాలు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. అలాగే విటమిన్ ‘ఎ’ కంటి ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి క్యారట్స్, తర్బూజా, గుమ్మడికాయ, సొరకాయ వంటి విటమిన్ ‘ఎ’ ఎక్కువగా లభించే ఆహార పదార్ధాల్ని తీసుకోవడం ఉత్తమం. మహిళలకు 40 నుంచి 45 సంవత్సరాలు వయసు రాగానే వారిలో మెనోపాజ్ మొదలవుతుంది.. దీంతో శరీరంలో పలు రకాల మార్పులు చోటు చేసుకుంటాయి. విటమిన్ ఏ అధికంగా ఉన్న పాల కూర, గుమ్మడి గింజలు, క్యారెట్, బొప్పాయి వంటివి తీసుకుంటే చాలా మంచిది.
విటమిన్ బి9, బి6… Vitamins
మహిళలకు అవసరం అయ్యే వాటిల్లో విటమిన్ బి9 కూడా ఒకటి. ఈ విటమిన్ లోపం ఉంటే.. డెలివరీలో సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మహిళలు రోజు వారీ ఆహారంలో విటమిన్ బి9 అధికంగా ఉండే ఈస్ట్, బీన్స్, ధాన్యాలను డైట్ లో చేర్చుకుంటే మంచిది.
విటమిన్ ‘బి6’
రోగనిరోధక వ్యవస్థలో జరిగే జీవరసాయన ప్రతి చర్యలకు తోడ్పడుతూ ఆ వ్యవస్ధ పనితీరును మెరుగుపరచడంలో విటమిన్ ‘బి6’ సహకరిస్తుంది. కాబట్టి బయటి ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే విటమిన్ ‘బి6’ అధికంగా లభించే అరటిపండ్లు, బంగాళాదుంపలు, చికెన్, చేపలు, శెనగలు వంటి ఆహార పదార్థాల్ని రోజువారీ మెనూలో భాగం చేసుకోవాలి.
విటమిన్ డి… Vitamins
దీనిలో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ, ఇమ్యునోరెగ్యులేటరీ గుణాలు రోగనిరోధక వ్యవస్ధ చురుగా పనిచేయడానికి తోడ్పడతాయి. కాబట్టి ఈ విటమిన్ ను పొందడానికి ఉదయాన్నే ఎండలో ఓ అరగంట పాటు నిల్చోవాలి. విటమిన్ ‘డి’ వల్ల ఎముకలు కూడా దృఢంగా మారతాయి. మహిళలు బలంగా, దృఢంగా ఉండాలంటే విటమిన్ డి చాలా ముఖ్యం. వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు బలహీన పడతాయి. ముఖ్యంగా మహిళలు కాల్షియంతో పాటు విటమిన్ డి తీసుకోవడం కూడా మంచిది. అందుకే ప్రతి రోజూ 15 నుంచి 20 నిమిషాల పాటు ఎండలో ఉండాలి. గుడ్లు, పాలు, చీజ్, పుట్టు గొడుగులు, కొవ్వు ఉన్న చేపలు వంటివి కూడా తింటూ ఉంటే విటమిన్ డి లోపం తలెత్తకుండా ఉంటుంది.
విటమిన్ ఈ…
మన శరీరంలో ఒక శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఇది బ్యాక్టీరియా, వైరస్, ఇతర ఇన్ఫెక్షన్లతో సమర్ధంగా పోరాడి అవి మన ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపకుండా ఆపుతుంది. అలాగే ఈ విటమిన్ రోగనిరోధక వ్యవస్ధకు సహకరిస్తుంది. కాబట్టి ఈ విటమిన్ ఎక్కువగా లభించే పొద్దు తిరుగుడు గింజలు, పల్లీలు, బాదం పప్పులు, పాలకూర, నట్స్ వంటివి రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే మహిళల చర్మంపై త్వరగా ముడతలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే విటమిన్ ఈ ఎక్కువగా ఉండే బాదం, పాలకూర, వేరుశనగ తీసుకోవాలి.