(Super Star)
సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ పేరు తమిళ ఇండస్ట్రీలో మాత్రమే కాదు ఇండియా మొత్తం మారుమోగుతుంది. సాధారణ బస్ కండెక్టర్ లైఫ్ లీడ్ చేసిన రజనీకాంత్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా మారాడు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఆయన నటన ని, స్టైల్ ని, డాన్స్ ని మెచ్చుకోని వారుండరు.
స్టార్ హీరోగా ఎదిగిన రజనీకాంత్ అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. 73 ఏళ్లు వచ్చినా యాక్షన్ సీన్స్ చేస్తూ అందరిని అలరిస్తున్నాడు. రజనీకాంత్ ని అందరు తలైవా అని ముద్దుగా పిలుచుకుంటారు. చాలా మంది ప్రేక్షకులకు ఇయన రోల్ మోడల్ గా, ఇన్స్పిరేషన్ గా ఉంటాడు. స్టార్ గా చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు.
కష్టేఫలి అన్నదానికి నిలువెత్తు నిదర్శనం (Super Star)
సినీ ఇండస్ట్రీ ఏటువంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా కేవలం ట్యాలెంట్ తో నటిస్తూ సూపర్ స్టార్ అయ్యాడు తలైవా. రజనీకాంత్ బెంగళూరులోని బస్ నెంబర్ 134లో బస్ కండక్టర్ గా పనిచేశారట. నటనపై ఉన్న ఆసక్తితో 1975లో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగల్ అనే సినిమాతో తన మూవీ కెరీర్ ని స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత 1995లో వచ్చిన బాషా సినిమాతో తన కెరీయర్ మారిపోయింది. సినిమాల్లో ఆయన చెప్పే డైలాగులకు ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది…. ఆ డైలాగులకు ఫిదా కాని వారంటూ ఉండరు. నటనతో పాటు నిర్మాతగా, రచయితగా మంచి పేరు , గుర్తింపు తెచ్చుకున్నాడు తలైవా…
తలైవా 170వ మూవీ అప్డేట్
నేడు(డిసెంబర్ 12న) రజనీకాంత్ బర్త్ డే. రజనీ బర్త్ డే అంటే ఫ్యాన్స్ కి పండగే… ఈరోజున తన 170వ మూవీ అప్డేట్ ను సాయంత్రం ఐదు గంటలకు ఓ వీడియాను రిలీజ్ చేయబోతున్నారట. ఈ అప్డేట్ ని తలైవా 170 మూవీ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో అభిమానులు ఆనందపడుతున్నారు. ఈ సినిమాకి జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. అనిరుధ్ మ్యూజిక్ ఇస్తున్నాడు.. జ్ఞానవేల్ సాయంత్రం రిలీజ్ చేసే వీడియో తలైవా ఫ్యాన్స్ ని ఎంతవరకు సంతృప్తి పరుస్తుందో చూడాలి. గతంలోనే మూవీని అనౌన్స్ చేసి పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ లో రజినీ లుక్ జైలర్ మూవీతో పోలిస్తే పూర్తిగా మారిపోయింది.
సూపర్ స్టార్స్ లతో రానున్న తలైవా 170వ మూవీ (Super Star)
రజనీకాంత్ 170వ మూవీలో సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడట. ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటిస్తున్నాడట. దాదాపుగా 32 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటించబోతున్నారు. ఇండియన్ సూపర్ స్టార్స్ అయిన అమితాబ్-రజినీకాంత్ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారంటే ఆ మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుందో ఊహించవచ్చు. తలైవా 170వ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 171వ సినిమా కూడా రాబోతోంది. ఈ మూవీ అప్డేట్ కోసం ఫ్యాన్స్ చాలా ఉత్కఠంగా ఎదురుచూస్తున్నారు.