(Pain Killer)
ప్రస్తుతం చాలా మందికి వైద్యులను సంప్రదించకుండానే రకరకాల టాబ్లెట్లు వాడటం అలవాటు అయింది. చిన్న చిన్న నొప్పులకు కూడా చాలామంది ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. తాజాగా ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ IPC ఓ అలర్ట్ జారీ చేసింది. నొప్పి నివారణకు ఉపయోగించే మెఫ్తాల్ పెయిన్ కిల్లర్‌తో ప్రతికూల ప్రభావాలు ఉన్నాయని ప్రకటించింది.. ఈ ఔషధం వాడకం వల్ల ఈస్నో ఫీలియా, సిస్టమిక్ సింప్టమ్స్ సిండ్రోమ్ అంటే తీవ్రమైన అలర్జీ వచ్చే అవకాశాలున్నాయి.. మెఫ్తాల్ ఔషధానికి సంబంధించిన ప్రతికూల ప్రభావాలను గమనించి, అప్రమత్తమవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఒక అడ్వైజరీని జారీ చేసింది.
డీఆర్ఈఎస్ఎస్ ( DRESS) సిండ్రోమ్ వల్ల వచ్చే సమస్యలు…
సాధారణంగా రుమటాయిడ్ ఆర్థ్రరైటిస్, ఆస్టియో ఆర్ర్థరైటిస్, మహిళల్లో నెలసరి సమయంలో సంభవించే డిస్మెనోరియా, నొప్పి, వాపు, జ్వరం, దంతాల నొప్పి వంటి చికిత్సలో మెఫేనమిక్ యాసిడ్ పెయిన్ కిల్లర్‌ను వినియోగిస్తుంటారు. ఫార్మకొవిజిలెన్స్ ప్రాగ్రామ్ ఆఫ్ ఇండియా డాటాబేస్‌లోని సమాచారం ఆధారంగా జరిపిన అధ్యయనంలో మెఫనామిక్ యాసిడ్ ప్రతికూల ఫలితాల గురించి వెల్లడైంది. డీఆర్ఈఎస్ఎస్ సిండ్రోమ్ బారిన పడ్డ బాధితుల్లో స్కిన్ రాషెస్, జ్వరం, లింఫ్ ఎడినోపతీ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఔషధం వాడటం మొదలెట్టిన రెండు నుంచి ఎనిమిది వారాల మధ్య ఈ అలర్జీ లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు.
మెఫ్తాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల… (Pain Killer)
తల నొప్పి, కండరాల నొప్పి, కీళ్ల నొప్పులకు, పిల్లల్లో వచ్చే హై ఫీవర్, రుమటాయిడ్ ఆర్థ్రయిటిస్, ఆస్టియో ఆర్థ్రయిటిస్, జ్వరం, దంతాల నొప్పి, మహిళలు నెలసరి సమయంలో వచ్చే నొప్పి నివారణకు ఉపయోగించే మెఫ్తాల్ ఔషధం పై కేంద్ర ప్రభుత్వం డ్రగ్ సేఫ్టీ అలెర్ట్ ను జారీ చేసింది. ఔషధం ప్రతికూల ప్రభావాలను పర్యవేక్షించాలని ఆరోగ్యరంగ నిపుణులు, రోగులకు సూచించింది.
డాక్టర్ సలహతో…
ప్రధానంగా కండరాలు, కీళ్లలో నొప్పి లేదా తలనొప్పి వంటి అనేక సమస్యలకు ఈ ఔషధాన్ని ఉపయోగిస్తున్నారు. చాలాసార్లు ఈ ఔషధం పిల్లలలో జ్వరం తగ్గేందుకు కూడా ఉపయోగించబడుతుందని తేలింది. వాస్తవానికి డ్రెస్ సిండ్రోమ్ అనేది తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్య. దీనిలో చర్మంపై దద్దుర్లు మొదలైనవి ఏర్పడతాయి. ఈ ప్రతిచర్య కొన్నిసార్లు మరణానికి కూడా దారితీయొచ్చని నిపుణుల అభిప్రాయ పడ్డారు. ఈ ఔషధం తీసుకున్న తర్వాత మరణం సంభవించే అవకాశం 10 శాతం పెరుగుతుందని అంటున్నారు. డాక్టర్ సలహా లేకుండా ఈ ఔషధాన్ని తీసుకోవడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.
వెబ్ సైట్, హెల్ప్ లైన్ ని సంప్రదించాలి… (Pain Killer)
ఔషధ ప్రతి చర్యలను నియంత్రించే ప్రభుత్వ సంస్థ అయిన ఫార్మాకోవిజిలెన్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా మెఫెనామిక్ యాసిడ్ గురించి పెద్ద ప్రకటన ఇచ్చింది. ఈ మెడిసిన్ వాడిన తర్వాత డ్రస్ సిండ్రోమ్ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని ఆ సంస్థ చెబుతోంది. ఒకవేళ ఏమైనా దుష్ర్పభావాలు ఎదురైతే పీవీపీఐకి తెలియజేయాలని సూచించింది. www.ipc.gov.in వెబ్సైట్ లేదా పీవీపీఐ హెల్ప్‌లైన్ నంబర్ 1800-180-3024 ద్వారా తమను సంప్రదించాలని తెలిపింది.
(Pain Killer)