(Varun-Lav)
ప్రస్తుతం టాలీవుడ్ ట్రెండింగ్ కపుల్ ఎవరంటే వరుణ్,లావణ్యల పేరు చెబుతారు. వీరిద్దరూ కొన్ని సంవత్సరాలు ప్రేమలో ఉండి నవంబర్ ఒకటో తేదిన వేదమంత్రాల సాక్షిగా ఇటలీలోని టస్కానిలో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత హైదరాబాద్, డెహ్రెడూన్ లో రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. మెగా కోడలిగా కొణిదెల వారి ఇంట్లోకి అడుగుపెట్టింది లావణ్య. వరుణ్-లావణ్యలు ప్రస్తుతం ఫిన్లాండ్ లో హనీమూన్ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా హనీమూన్ లో ఉన్నటువంటి ఈ జంట తరచూ సోషల్ మీడియాలో వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
గుడ్ న్యూస్ చెప్పిన వరుణ్-లావణ్య (Varun-Lav)
హనీమూన్ లో ఎంజాయ్ చేస్తున్న వరుణ్ లావణ్య కొణిదెల ఫ్యామిలీకి గుడ్ న్యూస్ చెప్పారట. ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. లావణ్య పెళ్లి తర్వాత సినిమాలో నటించకూడదని నిర్మాతగా లైఫ్ లీడ్ చేయాలని అనుకుందట. దానికి మెగా ఫ్యామిలీ ఏమాత్రం అబ్జెక్షన్ చెప్పలేదట. కానీ పెళ్లి తర్వాత అదృష్టం కలిసి వచ్చిందేమో ఆమెకు వరసగా మంచి ఆఫర్స్ వస్తూ ఉండడంతో లావణ్య త్రిపాఠి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనుకుందట.. పైగా పెళ్లి తర్వాత వీరిద్దరినీ హీరో, హీరోయిన్లుగా ఓ సినిమా ఆఫర్ వచ్చిందట. వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారట. స్టార్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నారట. ఈ విషయాన్ని వరుణ్ లావణ్యలు మెగా ఫ్యామిలీకి తెలియజేశారట. వీరిద్దరి కాంబినేషన్ మూవీ అని చెప్పిన వెంటనే మెగా ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారట. ఈ వార్త విన్న ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుష్ అవుతున్నారు.
ఏడు దేశాలల్లో హనీమూన్
ఏడుఅడుగులతో ఒక్కటైన వరుణ్ లావణ్యలు ఏడు దేశాలల్లో హనీమూన్ చుట్టేయడానికి సిద్ధపడ్డారట. ప్రస్తుతం ఫిన్లాండ్లో మైనస్ డిగ్రీల చలిలో ఎంజాయ్ చేస్తున్నారు ఈ జంట. లావణ్య త్రిపాఠి హనీమూన్ లోనే క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారని తెలుస్తుంది. పెళ్లి తర్వాత వీరిద్దరికి మొదటి క్రిస్మస్ కావడంతో హనీమూన్ లోనే క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. లావణ్య శాంటా క్లాస్ క్యాప్ ను తలకు ధరించి క్రిస్మస్ ట్రీని అలంకరిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. పెళ్లి తర్వాత వస్తున్న ఫస్ట్ క్రిస్మస్ అవ్వడంతో ఆనందం అపుకోలేక ముందుగానే సెలబ్రేషన్స్ ని స్టార్ట్ చేశారు ఈ జంట. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరికి ప్రేక్షకులు క్రిస్మస్ శుభాకాంక్షలు అంటూ విషెస్ చెబుతున్నారు.
సమంతే వీరిని కలిపిందా? (Varun-Lav)
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి మధ్య మిస్టర్ సినిమాతో ప్రేమ చిగురించింది. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి సమంత కారణమనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విషయానికి వస్తే మిస్టర్ సినిమాలో సమంతను హీరోయిన్ గా అనుకున్నాడట శ్రీను వైట్ల. కానీ సమంత రిజెక్ట్ చేయడంతో పలువురు హీరోయిన్స్ ని అనుకున్నా చివరకు ఫైనల్ గా లావణ్య ను సెలెక్ట్ చేశారట. అయితే సమంత ఈ సినిమాలో నటించి ఉంటే వరుణ్-లావణ్య లు కలుసుకునే అవకాశమే వచ్చి ఉండేది కాదట..ఇద్దరూ ఒకరికొకరు తారసపడి ఉండేవారు కాదట.. వీళ్ళ పెళ్లి కూడా జరిగి ఉండేది కాదట. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ వార్తలు వస్తున్నాయి.
(Varun-Lav)