BellyFat
ప్రతి ఒక్కరూ అందంగా సన్నగా కనిపించాలని కోరుకుంటారు. ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గడానికి సన్నగా కనిపించేందుకు నానా కష్టపడి రక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా ఉంటే ఆహార్యంలో మార్పు రావడంతో పాటే మరికొన్ని ఆరోగ్య సమస్యల మీద కూడా ప్రభావం చూపుతుంది. శరీరంలో వివిధ భాగాల్లో కొవ్వు పేరుకుపోవడం కన్నా పొట్టచుట్టూ కొవ్వుండటం కాస్త ప్రమాదమే. దానివల్ల గుండెపోటు, డయాబెటిస్, లివర్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మన అవయవాలు చుట్టూ ఉండే కొద్దిపాటి కొవ్వు రోజూవారీ శరీర పనితీరుకు సాయపడుతుంది. కానీ అది మరీ ఎక్కువగా ఉంటే ప్రమాదమే.
బెల్లీ ఫ్యాట్ రాకుండా వుండాలంటే… BellyFat
బెల్లీ ఫ్యాట్ పెరగడం కారణంగా చాలామందిలో దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలతో ఇబ్బందులు పడేవారు రోజు సాయంత్రం 6 గంటలలోపే ఆహారం తీసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా బరువు తగ్గే సమయంలో ఎప్పుడు పొట్ట నిండుగా ఉండే ఆహారాలు తీసుకోకపోవడం చాలా మంచిది. మధ్యాహ్నం, రాత్రిపూట తీసుకునే భోజనంలో కేవలం పండ్లు ఓట్స్ తో తయారు చేసిన ఆహారాలు మాత్రమే తీసుకోవాలి. బెల్లీ ఫ్యాట్ ఉన్నవారు తప్పకుండా అన్నాన్ని తినడం మానుకోవాలి. దీంతోపాటు రాత్రంతా పొట్ట ఖాళీగా ఉండే ఆహారాలను మాత్రమే తీసుకోవడం చాలా మంచిదని డాక్టర్స్ అంటున్నారు.
హైడ్రేషన్ కోసం..
ఉదయం నిద్ర లేవగానే ఒక పెద్ద గ్లాసు నిండా నీళ్లు తాగాలి. దాంట్లో కాస్త నిమ్మరసం కూడా పిండుకుని తాగడం వల్ల జీవక్రియ వేగం పెరుగుతుంది. ఈ తాజా పానీయం కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడంతో పాటూ ఆహారం జీర్ణం అవడానికి సాయపడుతుంది. శరీరంలోని మలినాలను బయటకు పంపించే డిటాక్సిఫయర్ లాగా పనిచేస్తుంది. దానివల్ల బరువు తగ్గడంలో సాయపడుతుంది. BellyFat
వ్యాయామాలు… BellyFat
బెల్లీ ఫ్యాట్ తగ్గటానికి రోజు వ్యాయామాలు కూడా తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు కరుగుతుంది. వేగంగా నడవడం, యోగా చేయడం ఏదైనా చేయొచ్చు. ఉదయాన్నే శరీరం కదిలించడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. కనీసం అరగంట సేపు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవడం ఉత్తమం. ప్రతిరోజు వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలోని కొలెస్టాల్ తగ్గడమే కాకుండా ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.
ప్రొటీన్ ఉన్న అల్పాహారం…
ప్రొటీన్ ఎక్కువగా ఉన్న అల్పాహారం తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయుల మీద ప్రభావం ఉంటుంది. జీవక్రియ వేగవంతం అవుతుంది. ఉదయాన్నే గుడ్లు, యోగర్ట్, ప్రొటీన్ స్మూతీ లాంటివి తినాలి. ప్రొటీన్లు అరగడానికి ఎక్కువ శక్తి అవసరం. దానివల్ల ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. అలాగే రోజు మొత్తం ఏదైనా తినాలనే కోరికనూ తగ్గిస్తాయి.
ఆహార నియంత్రణ… BellyFat
ఎంత తింటున్నాం, ఏం తింటున్నామనే విషయంపై స్పష్టత ఉండాలి. ప్రతి ముద్దను ఆస్వాదిస్తూ మెల్లగా నములుతూ తినడం వల్ల ఆహారం మీద శ్రద్ధ పెరుగుతుంది. శరీరం ఆకలిని అర్థం చేసుకుంటాం. అవసరమైనంతే తినడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కాస్త తగ్గించుకోవచ్చు. ఫోన్ మాట్లాడుతూ, టీవీ చూస్తూ తింటే ఎంత తింటున్నామో కూడా తెలీదని గమనించండి. ఉదయం ఆహారంలో పీచు ఎక్కువగా ఉండే ఆహారం చేర్చుకోవడం వల్ల బరువు తగ్గొచ్చు. పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, చిక్కుళ్లలో పీచు పుష్కలంగా ఉంటుంది.
ఒత్తిడి, నిద్ర ని నియంత్రణలో ఉంచుకోవాలి…
దీర్ఘకాలిక ఒత్తిడి బరువు పెరిగేలా చేస్తుంది. దీని ప్రభావం పొట్ట చుట్టూ కొవ్వు మీదే ఎక్కువగా ఉంటుంది. అందుకే రోజూ ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గించుకోండి. దీని ప్రభావం శరీరం మీద చాలా ఉంటుంది. బరువు నియంత్రణలో నిద్ర పాత్ర కీలకం. నిద్ర లేమి వల్ల హార్మోన్ల స్థాయుల్లో హెచ్చుతగ్గులొస్తాయి. ఆకలి పెరుగుతుంది. కొవ్వు ఎక్కువగా చేరుతుంది. రోజుకు కనీసం 7 నుంచి 9 గంటల నిద్రపోయేలా చూసుకోవాలి. BellyFat