paneer
పనీర్ భారతీయుల వంటకాలో ఒక రుచికరమైన వంటకం. మటర్ పన్నీర్, పనీర్ దో ప్యాజా, బటర్ పనీర్, పనీర్ పరోటా, పనీర్ టిక్కా, కడైన పనీర్ ఇలా మీరు ఎన్నో రకాల పనీర్ వంటకాలను చేసుకొవచ్చు. ప్రస్తుతం రోడ్డు మీద చిన్న బంకు దగ్గర నుంచి ఫైవ్ స్టార్ రెస్టారెంట్ వరకు పన్నీర్ లేకుండా మెనూ ఉండదు. పనీర్ ప్రోటీన్, విటమిన్లు ఖనిజాల అద్భుతమైన మూలం. పనీర్ వినియోగం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నాన్ వెజ్ తినని వాళ్ళు పన్నీర్ నెక్స్ట్ ఆప్షన్ గా వాడుతుంటారు. పన్నీరు తినడానికి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఇష్టపడతారు.
పనీర్ మంచి డైట్… paneer
బరువు తగ్గాలి అనుకునే వారికి కూడా పన్నీర్ మంచి డైట్. ఇక పన్నీర్ లో పుష్కలంగా దొరికే కాల్షియం మన ఎముకలను బలంగా దృఢంగా తయారు చేస్తుంది. కాల్షియం శాతం తక్కువ ఉన్నవారు, ఎముకలు బలహీనంగా ఉన్నవారు కచ్చితంగా రోజు పన్నీర్ తీసుకోవచ్చు. ఇందులో తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండడమే కాకుండా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే పన్నీర్ లోని ప్రోటీన్ మన జీవక్రియను మెరుగుపరచడంతో పాటు పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో కూడా సహాయపడుతుంది. అయితే పన్నీరు ఎప్పుడు కూడా లిమిటెడ్ గా తీసుకోవాలి మరీ ఎక్కువగా తీసుకుంటే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది…
పన్నీర్ లో అధిక మోతాదురో లభించే జింక్ తెల్ల రక్త కణాల ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇన్ఫెక్షన్స్ తో పోరాడడంలో సహాయ పడడమే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పైగా ఇందులో అధిక మోతాదులో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. మితంగా పన్నీరు తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలో చూడండి. మీరు కూడా తప్పకుండా పన్నీర్ ను మీ రోజువారి డైట్ లో భాగంగా చేసుకోండి.
రక్తంలో చక్కెరను కంట్రోల్లో ఉంచుతుంది…. paneer
పనీర్ నిత్యం తీసుకుంటే ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. పనీర్ లో ట్రిప్లోపాన్ అనే అమైనో ఆమ్లం అధికంగా ఉండటంతో ఇది రక్తంలోని చక్కర పెరగటాన్ని నివారిస్తుంది. మీ రక్తంలో చక్కెరను మెరుగ్గా నిర్వహించడానికి, మీరు వైద్యునితో మాట్లాడి మీ ఆహారంలో పనీర్ ను చేర్చుకోండి.
ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది…
పనీర్ ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది న్యూరో ట్రాన్స్మిటర్, సెరోటోనిన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది… paneer
పనీర్ లో ఇమ్యూనిటీ లెవల్స్ పెంచేందుకు సహాయపడే జింక్ అధిక స్థాయిలో ఉంటుంది. తరచుగా ఆహారంలో చేర్చుకున్నట్లయితే జలుబు, ఫ్లూ, ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు పనీర్ లో ప్రొటీన్ పుష్కలంగా ఉంటడంతో మీరు అనారోగ్యం బారిన పడకుండా శక్తిస్థాయిలను పెంచడంతో కీలకంగా పనిచేస్తుంది.
మెదడు ఆరోగ్యానికి మంచిది…
పనీర్ విటమిన్ B12 యొక్క గొప్ప మూలం. విటమిన్ B12 మెదడు ఆరోగ్యానికి అవసరమని నిరూపించబడింది. ఇది నాడీ వ్యవస్థ సరైన పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది.. శాకాహారులలో విటమిన్ బి 12 లోపం సర్వసాధారణం, ఇది శాకాహారుల రోజువారీ ఆహారంలో పనీర్ చేర్చుకుంటే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. paneer