Break
డైరెక్టర్ హరీష్ శంకర్ తనదైన శైలిలో మాస్ మూవీస్ ను డైరెక్ట్ చేస్తుంటాడు. రవితేజ మూవీ మిరపకాయతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు హరీష్. ఆయన కథకు మాస్ మహారాజ్ రవితేజ యాక్షన్ కలిసి ఆ సినిమా హిట్ గా నిలిచింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ మూవీని తెరకెక్కించాడు శంకర్. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. తన డైరక్షన్ లో సినిమాలు హిట్ ను సొంతం చేసుకోవడంతో సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు ఈ దర్శకుడు. ఇప్పుడు మరోకసారి రవితేజ, పవన్ కళ్యాణ్ తో కలిసి మూవీస్ చేయబోతున్నాడట హరీష్ శంకర్. తాజాగా ఉస్తాద్ మూవీకి బ్రేక్ ఇచ్చి రవితేజతో చేయబోతున్న మూవీని అనౌన్స్ చేశాడట హరీష్ శంకర్. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హట్ టాపిక్ గా మారింది.
రవితేజ మూవీ కోసం పవన్ మూవీకి బ్రేక్ Break
ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఉస్తాద్. ఈసినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ ఒక షెడ్యూలు పూర్తి చేశారట. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఉస్తాద్ మూవీ షూటింగ్ కి బ్రేక్ పడిందట. దానికి కారణం పవన్ కళ్యాణ్ పొలిటిక్స్ లో బిజీగా ఉండటం చేత ఈ మూవీకి కాస్త బ్రేక్ పడిందని సమాచారం. పవన్ కళ్యాణ్ బిజీగా ఉండటంతో ఉస్తాద్ మూవీ షూటింగ్ కి దాదాపుగా నాలుగు నెలలు సమయం పడుతుందని తెలుస్తుంది.
పవన్ మూవీ పొస్ట్ పొన్..
అలాగే ముందుగా కమిట్ అయిన ఓజీ, వీరమల్లు సినిమా షూటింగ్స్ కూడా పూర్తి చేయాలనే ఆలోచనలో పవన్ ఉన్నాడని సమాచారం. ఇలా కమిట్ అయిన మూవీస్ ను పూర్తి చేయడానికి టైమ్ ఎక్కువగా ఉండటంతో ఉస్తాద్ సినిమా షూటింగ్ ను కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేశారట దర్శకనిర్మాతలు. ఇక దర్శకుడు హరీష్ శంకర్ కూడా తన నెక్ట్ మూవీ షూటింగ్ ను రవితేజతో స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాడట. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఖుషి అవుతుంటే పవన్ ఫ్యాన్స్ మాత్రం నిరాశ పడుతున్నారు.
మాస్ కాంబినేషన్ మూవీ Break
రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో మరొక మూవీ రాబోతుందట. గతంలో గోపీచంద్ మలినేనితో ఒక సినిమా అనౌన్స్ చేసి క్యాన్సల్ చేయడంతో రవితేజ ఆ డేట్ లను ఇప్పుడు డైరెక్టర్ హరీష్ శంకర్ కు ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రవి తేజకు మాస్ మహారాజా ట్యాగ్ ఇచ్చింది కూడా హరీషే కావడం విశేషం. మరోవైపు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రవితేజ నటించిన ధమాకా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు అదే హీరో-డైరెక్టర్- ప్రొడ్యూసర్ కాంబినేషన్ లో ఈ న్యూ మూవీ రాబోతుందట. ఈ మాస్ అండ్ క్రేజీ కాంబినేషన్ ను మళ్లీ చూడబోతున్నామంటూ ప్రేక్షకులు తెగ సంతోష పడుతున్నారు. సినిమాకు సంబంధించిన ఇతర వివరాలేవి బయటకు రాలేదు. త్వరలోనే హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, టైటిల్ ను అనౌన్స్ చేయబోతున్నారట మేకర్స్. Break