YS Jagan
ప్యాకేజ్ స్టార్ .. పవన్ కల్యాణ్ ను వైసీపీ సోషల్ మీడియా ముద్దుగా పిలుచుకునే పేరు.. అయితే ఈ పేరుకు మరింత వ్యంగ్యాన్ని జోడించారు వైసీపీ అధినేత జగన్.. పవన్ కల్యాణ్ ను మ్యారేజీ స్టార్ అని సంభోదిస్తూ గాలి తీసేశారు. విషయానికొస్తే పలాస లో ఓ అభివృద్ధి కార్యక్రమంలో జగన్ తనదైన శైలిలో పంచ్ లు వేశారు. పవన్, చంద్రబాబు ఇద్దరూ నాన్ లోకల్స్ అని ఎద్దేవా చేశారు.ఎక్కడో హైదరాబాద్ లో ఉంటూ ఏపీలో సీఎం ఎక్కడ ఉండాలో వాళ్లు చెబుతుంటారని దిమ్మ తిరిగే పంచ్ వేశారు. వీళ్లిద్దరికీ మరో పని లేదని ప్రభుత్వం ఏ మంచి పని చేసినా ఏడుపేనని దెప్పి పొడిచారు. హైదరాబాద్ లో ఉంటూ ఏపీలో రాజకీయాలు చేయడం వారికే చెల్లిందని దుమ్మెత్తి పోశారు. రైతులకు మంచి చేస్తున్నామని ఏడుపు.. అక్క చెల్లెళ్లు, డ్వాక్రా సంఘాలు, పొదుపు సంఘాలకు అండగా ఉన్నందుకు ఏడుపు.. 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చినందుకు ఏడుపు.. అని తిట్టిపోశారు జగన్ . చిన్నారులకు అందించే గోరు ముద్ద, నాడు –నేడు పథకాల పైనా ప్రతిపక్షాలది ఏడుపేనని అన్నారు.
బాబుపై సెటైర్లు YS Jagan
ఇక చంద్రబాబునైతే సొంత నియోజక వర్గానికి ఏమీ చేయలేని వాడు ఎక్కడో ఉత్తరాంధ్రకి ఏం చేస్తాడని ఎద్దేవా చేశారు. కుప్పంలో కనీసం తాగునీరైనా బాబు ఇవ్వలేదని, తమ ప్రభుత్వం వచ్చాకే అక్కడ నీటి సౌకర్యం కల్పించిందని గుర్తు చేశారు. చంద్రబాబుకు ఎన్నికలు వచ్చే సరికి ఎత్తులు, పొత్తులు, చిత్తులూ, కుయుక్తులూ అని విమర్శించారు. చంద్రబాబు పని అయిపోయిందని, అన్నింటికీ దత్తపుత్రుడిపై ఆధారపడుతున్నారని జగన్ విమర్శించారు.ఇక జనసేనాని పవన్ కల్యాణ్ నయితే పేరు చెప్పకుండా పరోక్షంగా చురకలంటించారు.
బర్రెలక్కే బెటర్ అన్న జగన్
ఆంధ్ర పాలకుల గురించి పక్క రాష్ర్టంలో డైలాగులు కొట్టిన ప్యాకేజీ స్టార్ కు డిపాజిట్లు కూడా రాలేదని దుయ్యబట్టారు.. కొల్లాపూర్ నియోజక వర్గంలో ఇండిపెండెంట్ గా బరిలో నిలిచి పాపులర్ అయిన బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేదని ఎద్దేవా చేశారు.పైపెచ్చు ప్యాకేజీ స్టార్ పదానికి బదులుగా మ్యారేజీ స్టార్ అంటూ జనసేనాని గాలి తీసేశారు. జగన్ వర్సెస్ పవన్ మాటల తూటాలు ఈ మధ్య కాలంలోనే ఎక్కువయ్యాయి. YS Jagan
పవన్ పెళ్లిళ్ల ఇష్యూని వదలని సీఎం! YS Jagan
దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటూ పదేపదే కామెంట్ చేసే జగన్ ఇప్పుడు కొత్తగా మ్యారేజీ స్టార్ అని యాడ్ చేశారు. కార్లను మార్చినట్లు పెళ్లాలను మార్చే అలవాటు దత్తపుత్రుడికి ఉందని గతంలో తీవ్రంగా వ్యాఖ్యానించారు. దీనికి పవన్ కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యారు. జగన్ కు మర్యాద, సంస్కారం తెలియవని, వాటిని నేర్పించేందుకే దేవుడు తనలాంటి వారిని దింపాడనీ పవన్ అన్నారు.
పెళ్లాం పదంపై పవన్ క్లాస్
భార్య అనేది సంస్కారవంతమైన పదం అనీ, ఎవరైనా మర్యాదగా భార్య అనే సంభోదిస్తారని కానీ జగన్ కు సంస్కారం బొత్తిగా లేదని తిట్టారు. పెళ్లాం అనే మాట చాలా తప్పని, ఆయన భార్య భారతిని తామెంతో గౌరవించి సంబోధిస్తామని అన్నారు. అయితే పవన్ విమర్శలను జగన్ పెద్దగా పట్టించుకోలేదు. ఈ మధ్య కాలంలో అసలుకే ఎసరు వస్తుందనే భయంతోనే ఏమో పవన్ తన దూకుడు తగ్గించారు. జగన్ అంటే తనకు కోపం లేదని, ఈ విషయం ఊరూ, వాడా చెప్పాలని తన కార్యకర్తలతో అన్నారు పవన్.. జగన్ పైనా, వైసీపీ పైనా విమర్శలు మాని ఇప్పుడు ప్రజలపై పడ్డారు జనసేనాని. మొన్న వైజాగ్ మీటింగులో ప్రజల్లో బాధ్యతారాహిత్యం పెరుగుతోందని దెప్పి పొడిచారు. ఆ మీటింగ్ లో జగన్ పై ఏ విమర్శలూ చేయలేదు. కానీ జగన్ మాత్రం ఇవాల్టి ఉత్తరాంధ్ర టూర్ లో తన ప్రభుత్వం చేస్తున్న మంచి పనులన్నింటినీ ఏకరువు పెడుతూనే చివర్లో పవన్, చంద్రబాబులను ఆటాడుకున్నారు. YS Jagan