varun tej
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి తర్వాత యమా యాక్టివ్ అయ్యాడు.. తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఓ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో సరికొత్త మూవీతో మనముందుకొస్తన్నాడు. అదే మట్కా మూవీ.. ఈ మూవీ వార్ డ్రామా నేపథ్యంలో రానుందట. యావత్ దేశాన్ని కదిలించిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా మట్కా తెరకెక్కుతుంది. ఈ సినిమా కథాంశం ప్రధానంగా 1958-19822 మధ్య కాలంలో జరిగిన ఒక యదార్ధ సఘటన అట. అందుకని ఆ కాలం నాటి పరిస్ధితులను రీ క్రియేట్ చేస్తున్నారట మేకర్స్. అలా రీ క్రియేట్ చేసిన సెట్ లో మట్కా మూవీ షూటింగ్ జరుగుతుందట.
మట్కా షూటింగ్ లో వరుణ్ బిజీ varun tej
మట్కా మూవీని పలాస 1978 ఫేం కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. వరుణ్ కి జోడిగా మీనాక్షీ చౌదరి నటిస్తుంది. వరుణ్ వెడ్డింగ్ నేపథ్యంలో తాత్కాలికంగా బ్రేక్ పడ్డ మట్కా షూటింగ్ మళ్లీ షురూ అయింది. కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు హైదరాబాద్ సరిహద్దుల్లో స్పెషల్ సెట్ వేసినట్లు తెలియజేస్తూ మేకర్స్ అప్ డేట్ అందించారు. మానిటర్ లో డైరెక్టర్ సీన్ చెక్ చేసుకుంటున్న స్టిల్ తో షేర్ చేసిన మట్కా షూటింగ్ అప్ డేట్ ఇవ్వడంతో…. దీని షూటింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో వరుణ్ హీరోగా అనౌన్స్ చేసిన మట్కా మూవీని పాన్ ఇండియాగా తెరకెక్కిస్తున్నారట.
నోరా ఫతేహి స్పెషల్ అట్రాక్షన్ varun tej
మట్కా మూవీలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి కీలక పాత్రలో నటిస్తుంది. నవీప్ చంద్ర, కన్నడ కిషోర్, అజయ్ ఘోష్, మైమ్ గోపి, రూపలక్ష్మి, విజయరామరాజు, జగదీష్, రాజ్ తిరందాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. వైరా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి(సివిఎం) డా.విజేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.
ఆపరేషన్ వాలంటైన్ విడుదలకు రెడీ!
వరుణ్ నటించిన మూవీ ఆపరేషన్ వాలంటైన్ 2024 ఫిబ్రవరిలో విడుదల కాబోతుంది. ఈ మూవీని శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ తెలుగు, హిందీ భాషాల్లో రాబోతుంది. ఈ మూవీలో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలెట్ గా నటిస్తున్నాడు. వరుణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ మానుషి చిల్లర్ నటిస్తుంది. యథీర్థ ఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కుతుంది. వరుణ్ ప్రస్తుతం హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది వచ్చిన గాండీవధారి అర్జున బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఆపరేషన్ వాలంటైన్ మూవీ అయిన హిట్ అవుతుందో లేదో చూడాలి.
వైవిధ్యమే వరుణ్ స్పెషాలిటీ
వరుణ్ తేజ్ తనదైన స్పెష్ల శైలిలో నటిస్తుంటాడు.. ఫిదా, కంచె ఇలా భిన్నమైన కథలను ఎంచుకుంటాడు…. ఇటీవలే లావణ్యత్రిపాఠీని పెళ్లి చేసుకున్నాడు. వరుణ్-లావణ్య ఇద్దరూ ఆర్కిటిక్ లో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక పర్సనల్ లైఫ్ కి బ్రేక్ ఇచ్చి షూటింగ్ లో బిజీ అయిపోడానికి రెడీగా ఉన్నాడు ఈ యువ హీరో. varun tej