Ashika
చూసేందుకు మన బొద్దుగుమ్మ అనూష్క లాంటి ఫేస్.. ఇంచుమించు అదే ఫిగరూ.. కుర్రాళ్ల మతులు పోగొట్టే అందం.. అమ్మాయిలకు ఇన్సిస్పిరేషన్ గా నిలిచే బ్యూటీ.. అన్నీ కలగలిపితే కన్నడ అందాల భామ ఆషికా రంగనాథ్ అవుతుంది.. తన ముగ్ధ మనోహర రూపంతో, ఆకర్షణీయమైన ఫిగర్ తో చాలా బాగుంటుంది ఆషికా.. కానీ ఆమెకు తెలుగు, తమిళ సినీ రంగాల్లో పెద్దగా హిట్లు మాత్రం రావడం లేదు. శాండల్ వుడ్ లో మాత్రం ఆషికా తన జెండా పాతేసింది. అక్కడ మాత్రం తనకంటూ ఓ గుర్తింపు, గౌరవం , అభిమానులను సంపాదించింది. మరోవైపు కొత్త హీరోయిన్లను పరిచయం చేసే అలవాటున్న నాగ్ ఈసారి తన కొత్త చిత్రాన్ని సరికొత్త కుర్రహీరోయిన్ తో హిట్ కొట్టాలని ప్లాన్ వేశాడు.. అందుకే అందాల ఆషికాను తన సరసన హీరోయిన్ గా ఎంపిక చేశాడు.. గతంలో అనుష్క,శ్రియాశరణ్, ఆయేషా టకియా, ఇలా కొత్త ఫేస్ లను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసినది నాగార్జునే.
అమిగోస్ తో తెలుగులోకి.. Ashika
ఆషిక రంగనాథ్ టాలీవుడ్ లో అమిగోస్ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించాడు. ఈ మూవీ నుంచి సరైన హిట్ ను అందుకోలేకపోయింది. కానీ తన నటన, అందంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా కింగ్ నాగార్జున నటిస్తున్న నా సామి రంగా మూవీ ఆమెకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. విజయ్ బన్నీ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. తెలుగులో ఎంట్రీ ఇచ్చి టాప్ హీరోతో జోడి కడుతుంది ఈ అమ్మడు. కన్నడ మూవీస్ లో గుర్తింపు తెచ్చుకున్న ఆషిక తెలుగులో తన అదృష్టం పరీక్షించుకోబోతుంది. అమిగోస్ మూవీతో హిట్ దక్కించుకోలేకపోయిన ఆషిక నాగ్ మూవీతోనైనా హిట్ కొడుతుందా లేదా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
వైరల్ అవుతున్న నా సామి రంగా ఫస్ట లుక్ Ashika
ఈ మూవీని నుంచి రిలీజ్ అయిన నాగ్ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రిసెంట్ గా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. దానికి ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుంది అనే టైటిల్ ను ఆవిష్కరించి రిలీజ్ చేశారు. చంద్రబోస్ రాసిన ఈ పాటకి రామ్ మిరియాల గానం అందించాడు. నాగార్జున, ఆషిక వేసిన మాస్ డాన్స్ అందరిని ఆకట్టుకుంటుంది. ఈ పాట సోషల్ మీడియాలో మిలియన్ వ్యూస్ లతో టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమా సంక్రాంతి కి 2024లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుందట. శ్రీనివాసా సిల్వర్ స్ర్ర్కీన్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. సోగ్గాడే చిన్ని నాయన తర్వాత సరైన హిట్ లేక నీరసపడిన మన్మథుడు నాగార్జున ఈ కొత్త బ్యూటీ సెంటిమెంట్ తోనైనా మరో హిట్ కొడతాడా? అలాగే తెలుగులో ఇప్పటి వరకూ హిట్ లేని ఆషికా ఈసారి బంపర్ హిట్ కొడుతుందా?
కన్నడలో స్టార్ హీరోల సరసన
ఆషికా రంగనాథ్ 2016లో కన్నడ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. క్రేజీ బాయ్స్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఈ సినిమాలో దిలీప్ ప్రకాశ్ హీరోగా నటించాడు. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోలు అయిన పునీత్ రాజ్ కుమార్ జోడిగా, శివరాజ్ కుమార్ కి జోడిగా నటించింది. కన్నడలో దాదాపుగా 10 సినిమాల్లో నటించింది. అలాగే 2022లో తమిళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అయితే తమిళ ఇండస్ట్రీలో అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేకపోయింది.
మోడలింగ్ రన్నరప్ గా Ashika
మోడలింగ్ పై ప్రేమతో 2014 లో అటువైపు అడుగులు వేసింది. మిస్ ఫ్రెష్ ఫేస్ బెంగళూరు గా సెలక్ట్ అయింది. చిన్నప్పటి నుంచి యాక్టింగ్, డాన్స్ అంటే ఈమెకు ఎంతో ఇష్టం. దాంతో సినిమా ఇండస్ట్రీపై ఎక్కువ మక్కువ పెంచుకుంది. యాక్టింగ్ మీద ఉన్న ఇష్టంతో శాండల్ వుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.