BJP
తెలంగాణలో జనసేన కరివేపాకు అయిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపి మిత్ర పక్షంగా ఉన్న జనసేన అనుబంధానికి కత్తెర వేసేసింది. పార్లమెంటు ఎన్నికలకు ఈసారి బీజేపి ఒంటరిగానే వెళుతుందని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇది జనసేనానికి తీరని అవమానం.. ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాని పార్టీకి ఇంకా విలువ ఇవ్వడం వేస్ట్ అని కమలం పెద్దలు గ్రహించి ఉంటారు. నాకు మోడీ తెలుసు..అమిత్ షా ఫోన్ కాల్ దూరంలో ఉంటారు.. తెలుగు రాష్ట్రాల వ్యవారాలన్నీ నాతో డిస్కస్ చేస్తారు అంటూ ఇన్నాళ్లు పవన్ కల్యాణ్ చెప్పుకున్న స్టోరీలన్నీ కట్టు కథలేనని తేలిపోయింది.
ఇకపై అలా చెప్పుకునే వీలు కూడా ఉండదు.. ఇది జనసేనకు అతిపెద్ద దెబ్బ.. నిజానికి పవన్ కల్యాణ్ స్టార్ ఇమేజ్ ఏ మాత్రం ఎన్నికలకు కలసి రాదని ఇప్పటికే పలుమార్లు ప్రూవ్ అయ్యింది.. పవన్ ఆవేశంగా మాట్లాడే మాటలకు విజిల్స్ కొట్టే కుర్రకారును, లక్షల్లో తరలి వచ్చే జనాలను చూసిన బీజేపి(BJP) వాపును బలుపనుకుంది. కానీ చివరికి తెలంగాణ ఎన్నికలు పవన్ కల్యాణ్ రాజకీయాలకు అస్సలు పనికి రాడని మరోసారి తేల్చేశాయి. గట్టిగా పది సీట్లు ఇమ్మని కూడా అడిగేందుకు పవన్ భయపడ్డాడంటేనే తన కెపాసిటీపై తనకే డౌట్లు ఉన్నాయని అర్దమవుతోంది. చివరికి బర్రెలక్క తో పోల్చి పవన్ ను ర్యాంగింగ్ చేయని వాళ్లంటూ ఉండరు. ఏపీసీఎం జగన్ కూడా ఇదే ఉదాహరణ చెప్పి పలాస సభలో నవ్వులు పూయించారు.
బీజేపి కావాలనే ఇలా చేసిందా? BJP
అసలు బీజేపితో పొత్తులో ఉండగానే పవన్ ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం బీజేపి పెద్దలకు రుచించలేదు.. ఈలోగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. బీజేపి హై కమాండ్ పవన్ తో పొత్తును ఒక ముగింపుకు తేవాలని నిర్ణయించుకున్నట్లుంది. అందుకే ఈ ఎన్నికల్లో పొత్తు ప్రకారం వారికి ఎనిమిది సీట్లిచ్చింది..నిజానికి తక్కువ సీట్లే కాబట్టి సీరియస్ గా ప్రచారం చేసి, కనీసం ఓ నాలుగైనా గెలిచేందుకు పవన్ ప్రయత్నించి ఉంటే బాగుండేది.. వారంరోజుల్లో ఎన్నికలనగా మొక్కుబడి ప్రచారం చేసి అంటీ , ముట్టనట్లు పవన్ ప్రవర్తించడమే ఆయన నైజాన్ని తెలియ చేస్తోంది. రాజకీయంగా లేని క్లారిటీ.. ఎవరిని టార్గెట్ చేయాలో తెలియని అయోమయం.. అసలేం చెప్పి ఓటు అడగాలో తెలియని అమాయకత్వం పవన్ను అసమర్ధ నేతగా ప్రజల ముందు నిలబెట్టాయి. పవన్ అసలు కెపాసిటీని ఈ ఎన్నికలు స్పష్టంగా చూపించేశాయి. బీజేపికి కూడా కావలసింది ఇదే..
టీడీపీతో పొత్తు ప్రభావమేనా? BJP
పవన్ అయోగ్యతను ప్రజలకు విప్పి చెప్పి గుడ్ బై కొట్టడమే.. ఏపీలో తమతో చెప్పకుండా టీడీపీతో అంటకాగుతున్నందుకు బీజేపి పెద్దలు కీలెరిగి పెట్టిన వాత ఇది.. దానికి తెలంగాణ ఎన్నికలను బీజేపి వాడుకుంది. పవన్ కు ఒకరకంగా ఏపీలో కూడా మొహం చెల్లకుండా చేసేసింది బీజేపి.. తెలంగాణలో డిపాజిట్లు రాని జనసేనాని ఏపీ రాజకీయాల్లో ఏ ముఖం పెట్టుకుని పోటీ చేస్తాడు? చూడబోతే అనవసరంగా తెలంగాణలో వేలుపెట్టి కెలుక్కున్నట్లయ్యింది పవన్ పరిస్థితి.. అసలే తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీపై ఉంటుందంటున్న టైమ్ లో తెలంగాణలో డిపాజిట్లు రాని పార్టీ ఏపీలో ఏం చెప్పి ఎన్నికల బరిలోకి దిగుతుంది? మోడీ, అమిత్ షాల రాజకీయ చక్రబంధంలో చిక్కుకుని జన సేనాని ఔట్ అయిపోయారా?