Blood
మనిషి తీసుకునే ఆహారంపైనే అతడి ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా మంచి ఆహారం తీసుకోవాలి. అయితే తీసుకునే ఆహారం బ్లడ్ గ్రూప్‌పై కూడా ఆధారపడి ఉంటుంది. మనిషి బ్లడ్ గ్రూప్ ప్రకారం మనం తీసుకునే డైట్లో మార్పులు చేసుకోవాలని చాలా పరిశోధనల్లో తేలింది. బ్లడ్ గ్రూప్ ప్రకారం ఆహారం తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉండడంతోపాటు బరువు కూడా అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆరోగ్యకరమైన జీవితంతో పాటు జీవిత కాలం కూడా పెరుగుతుందని నిపుణుల అభిప్రాయం. ఇంతకీ ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లు, ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓ బ్లడ్ గ్రూప్.. Blood
ఈ గ్రూప్ వాళ్లు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీరు ఎక్కువగా మాంసం, చేపలు, ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. అలాగే బీన్స్, చిక్కుళ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. సీ ఫుడ్, సీ ప్లాంట్, బ్రోకలీ, బచ్చలికూర, ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల ఓ బ్లడ్ గ్రూప్ వాళ్లు బరువు తగ్గొచ్చు. ఇక ఓ బ్లడ్ గ్రూప్ వాళ్లు.. గోధుమలు, మొక్కజొన్న, పాల ఉత్పత్తులకు దూరంగా ఉండడమే మంచిది.
ఏ బ్లడ్ గ్రూప్.. Blood
ఇక ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు కూడా పండ్లు, కూరగాయలు, సీ ఫుడ్, తృణధాన్యాలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ బ్లడ్ గ్రూప్ వారు సీ ఫుడ్, కూరగాయలు, పైనాపిల్, ఆలివ్ ఆయిల్, సోయా వంటివి తీసుకోవాలి. ఇక డైరీ, గోధుమలు, మొక్కజొన్న, కిడ్నీ బీన్స్ వంటివి తీసుకోకూడదు. టైప్ ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు మాంసం ఉత్పత్తులను తినకూడదు. వారి ఆహారంలో పండ్లు, కూరగాయలు, బీన్స్, చిక్కుళ్ళు, తృణధాన్యాలు తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే టైప్ ఏ రక్తంలో సున్నితమైన ఇమ్యూనిటీ ఉంటుంది.
బీ బ్లడ్ గ్రూప్.. Blood
బీ గ్రూప్ ఉన్న వ్యక్తులు మాసం, పండ్లు, పాల ఉత్పత్తులు, సీ ఫుడ్‌తో పాటు ధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ బ్లడ్ గ్రూప్ వాళ్లు బరువు తగ్గాలనుకుంటే పచ్చి కూరగాయలు, గుడ్లు, లివర్, లైకోరైస్ టీ తాగాలి. ఆకుపచ్చ కూరగాయలు, గుడ్డులు, కొద్దిగా మాంసం, తక్కువ కొవ్వు పాలను తీసుకోవడం మంచిది. మొక్కజొన్న, గోధుమలు, బుక్వీట్, కాయధాన్యాలు, టమోటాలు, వేరుశనగలు, నువ్వులు తినొద్దు. కొద్దిగా మాంసం మంచిదే అయినప్పటికీ చికెన్‌కి దూరంగా ఉండాలి. ఇలా ఎంపిక చేసిన ఫుడ్ ఐటెమ్స్ తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు ఎప్పటికప్పుడు వైద్యులు ఇచ్చే సూచనలు, సలహాలు తీసుకోవడం మరిచిపోవద్దని చెబుతున్నారు.
ఏబీ బ్లడ్ గ్రూప్..
ఈ బ్లడ్ గ్రూప్ వాళ్లు చేపలు, ధాన్యాలు, పండ్లు, కూరగాయలను భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇక ఏబీ బ్లడ్ గ్రూప్ వారు.. చికెన్, మొక్కజొన్న, బీన్స్ వంటి వాటిని తీసుకోవాలి. ఈ బ్లడ్ గ్రూప్‌లోని వ్యక్తులు సీ ఫుడ్, టోఫు, డెయిరీ, బీన్స్, ఆకుకూరలు, ధాన్యాలను తినాలి. కానీ, మొక్కజొన్న, గొడ్డు మాంసం, చికెన్‌కి దూరంగా ఉండాలి. ఏబీ రక్తం ఉన్నవారిలో కడుపులో ఆమ్లం తక్కువగా ఉంటుంది. కెఫిన్, ఆల్కహాల్, స్మోక్డ్ నాన్‌వెజ్‌కి దూరంగా ఉండాలి. ఈ రక్త వర్గానికి చెందినవారు ఎక్కువగా ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని తీసుకోవచ్చు. ఇందులో లీన్ మాంసం, పౌల్ట్రీ, చేపలు, కూరగాయలు ఉంటాయి. వారు ధాన్యాలు, బీన్స్ పాలు తీసుకోవచ్చు. వీటిని తింటూనే వారి శరీరతత్వానికి ఏ ఫుడ్స్ సరిపోతాయో గమనించాల్సి కూడా ఉంటుంది.