divorce
బాలీవుడ్ బ్యూటీపూల్ కపుల్ ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారా? సోషల్ మీడియాలో మాత్రం ఇవే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ రూమర్లకు బలం చేకూర్చుతూ ఐశ్వర్యారాయ్ , అమితాబ్ ఇంటి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోయిందనే వార్తలు బయటకు వస్తున్నాయి. వీటిపై అటు ఐష్ గానీ, ఇటు బిగ్ బీ కుటుంబం కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఐష్ తెగ తెంపులు చేసేసుకుందా? divorce
ఐశ్వర్య రాయ్ గురించి బాలీవుడ్ మీడియాలు పలు కథనాలను ప్రచురిస్తున్నాయి. ప్రస్తుతం ఐశ్వర్య రాయ్ తన కుమార్తె ఆరాధ్య బచ్చన్‌ను తీసుకుని తన భర్త ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో కథనాలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలియదు కానీ పుకార్లయితే జోరుగా సాగుతున్నాయి.
అత్తా కోడళ్లకు ఏళ్లుగా మాటలే లేవా?
భర్తతో చాలా కాలంగా విభేదాలు ఉండటంతో అవి ఇక భరించలేనని ఐశ్వర్య తన అమ్మగారి ఇంటికి చేరుకుందట. అత్తగారి ఇంట్లో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులను తల్లికి చెప్పుకుందట. ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ తన అత్తగారు జయా బచ్చన్‌తో చాలా ఏళ్లుగా కనీసం మాటలు కూడా లేవని ఐశ్వర్య చెప్పినట్లు సమాచారం. అటు అత్తగారితో, ఇటు భర్తతో గోడవలు రోజురోజుకి పెరుగుతూ వచ్చాయని ఐష్ తల్లితో చెప్పి బాధపడిందట. ఇటీవలే అమితాబ్ కూతురు శ్వేత జల్సా బంగ్లాలోకి షిప్ట్ అవ్వడం ఐశ్వర్య- అత్తమామల మధ్య మరింత వైరానికి కారణం అయ్యిందని తెలుస్తోంది. వస్తున్న పుకార్ల పై బచ్చన్ ఫ్యామిలీ కానీ ఐశ్వర్య కానీ స్పందిస్తే ప్రేక్షకులకు క్లారిటీ వస్తుంది.
ఐష్ ను అన్ ఫాలో చేసిన బిగ్ బీ divorce
ఈ మధ్య కాలంలో అమితాబ్ బచ్చన్ తన కోడలు ఐశ్వర్య రాయ్ ను ఇన్ స్టాగ్రామ్ లో అన్ ఫాలో చేశాడట. తర్వాత అమితాబ్ వెంటనే ట్విటర్ లో మరొక పోస్ట్ చేశాడట. అందులో అంతా అయిపోయింది అన్నట్లు అర్ధం వచ్చేలా ఒక కొటేషన్ ను షేర్ చేశాడట. ఇలా అమితాబ్ ట్వీట్ చేయడం, కూతురు ఇంటికి షిప్ట్ అవ్వడం, అంతా అయిపోయింది…. వంటి వార్తలు ఐశ్యర్య, అభిషేక్ విడిపోయారన్న వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. పరువు, మర్యాదలకు విలువనిచ్చే బచ్చన్ ఫ్యామిలీ లో ఇలాంటి ఘటన జరిగిందంటే నమ్మశక్యంగా లేదు.. కానీ కొంత కాలంగా ఐశ్వర్య, అభిషేక్ మధ్య సఖ్యత లేదన్నది మాత్రం అందరికీ కనిపిస్తున్న అంశం… అయితే బచ్చన్ ఫ్యామిలీ నుంచి ఐశ్వర్యకు దూరం పెరగడం పై అభిమాలు చాలా బాధపడుతున్నారు.
ఎక్కడికి వెళ్లినా సింగిల్ గానే ఐష్
ఐశ్వర్య-అభిషేక్ ఇద్దరూ ఎక్కడికి వెళ్లినా జంటగా కనపడి ఫోటోలకు ఫోజులు ఇస్తుంటారు. ఈ మధ్య కాలంలో ఐశ్వర్య ఎక్కడికి వెళ్లినా, తన కుతూరు ఆరాధ్యతో మాత్రమే కనిపిస్తున్నారు వారి పక్కన అభిషేక్ ఉండటం లేదు. ఇది చూస్తే వారు విడిపోయిన మాట నిజమేననిపిస్తోంది. ఏదేమైనా ఈ జంట గానీ,లేదా బిగ్ బీ గానీ ఒక ప్రకటన చేస్త తప్ప ఈ విషయంపై క్లారిటీ రాదు. divorce