colors
రంగుల ప్రభావం మెదడుపై, శరీరంపై ఖచ్చితంగా పడుతుంది. వివిధ రంగుల బట్టి ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతూ ఉంటారు. అలాగే వారి భావోద్వేగాలు కూడా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఇలా కలర్ థెరపీతో పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. కలర్ థెరపీతో వివిధ రకాల సమస్యలకు చికిత్సలు చేస్తూ ఉంటారు. ఈ కలర్ థెరపీని ‘క్రోమో థెరపీ’ అని కూడా పిలుస్తారు. పురాతన ఈజిప్షియన్ యుగంలో ఈ చికిత్సను ఉపయోగించే వారు. ఇప్పుడు ఈ చికిత్సను ఎవరూ పెద్దగా పట్టించు కోవడం లేదు. మళ్లీ ఈ కలర్ థెరపీ లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చింది.
భారతీయ ఆయుర్వేదంలో కూడా నిర్దిష్ట రంగుల ద్వారా శారీరక సమస్యలను సరి చేసే పద్ధతి ఉంది. ఈ రంగుల థెరపీ ద్వారా మానసిక స్థితిని మెరుగుపరచవచ్చు. ఈ థెరపీ ద్వారా హార్మోన్ల మార్పులను, ఒత్తిడిని తగ్గించవచ్చు. ఈ కరల్ థెరపీ ద్వారా మానసిక స్థితిని కూడా మెరుగు పరచవచ్చు. ఈ థెరపీ ద్వారా హార్మోన్ లలో మార్పులు, ఒత్తిడి కూడా తగ్గుతుంది. మరి ఏ కలర్ ఎలాంటి ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
రెడ్ కలర్… colors
క్రోమోథెరపిస్టులు చెబుతున్న ప్రకారం ఎరుపు రంగు శక్తి ఉద్దీపన చేస్తుంది. శారీరకంగా అలసిపోయిన వ్యక్తులలో శక్తిని పెంచుతుంది. వాళ్ళని ఉత్సాహంగా మారుస్తుంది. రక్తప్రసరణ లోపాలు ఉన్నవారు, పక్షవాతం బారిన పడినవారు, రుమటిక్ వ్యాధులతో బాధపడే వారికి రెడ్ కలర్ థెరిపీ చేస్తే మంచిది. రుమటిక్ వ్యాధులతో ఇబ్బంది పడే వారు, రక్త ప్రసరణ లోపాలు ఉన్న వారు, పక్షవాతం బారిన పడే వారికి ఈ రెడ్ కల్ థెరపీని చేస్తారు.
బ్లూ కలర్…
ఈ కలర్ లో అనేక రకాలైన షేడ్స్ ఉంటాయి. మానసిక స్థితితో ఇబ్బంది పడేవారికి, ఒత్తిడి, తల నొప్పి, నిద్ర లేమి, నిరాశ, సయాటికా వంటి సమస్యలతో ఇబ్బంది పడే వారికి ఈ నీలం రంగు థెరపీని ఉపయోగిస్తారు. ఇవి మానసిక స్థితిని మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. తలనొప్పి, ఒత్తిడి, నిద్రలేమి, నిరాశ, సయాటికా వంటి సమస్యలతో బాధపడే వారికి నీలం రంగు థెరపి మంచిది. colors
పసుపు… colors
ఒకరి మానసిక స్థితిని మెరుగుపరిచేందుకు పసుపు రంగు థెరపీ మేలు చేస్తుంది. వారిని ఆనంద ప్రపంచంలోకి ప్రవేశించేలా చేస్తుంది. మానసిక ఆందోళన, ఒత్తిడి, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు పసుపు రంగు థెరపీని చేయించుకుంటే మంచిది. శ్వాస కోశ సమస్యలు, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో బాధ పడేవారికి ఈ పసుపు రంగు థెరపీని చేస్తారు. ఈ రంగు థెరపీ చేయించు కోవడం వల్ల సంతోషంగా ఉంటారు. చర్మ ఇన్ ఫెక్షన్ లను కూడా తగ్గించు కోవచ్చు.
ఆరెంజ్, ఆకుపచ్చ……
క్రోమోథెరపిస్టులు చెబుతున్న ప్రకారం నారింజరంగు సంతోషాన్ని కలిగించే రంగు. భావోద్వేగాలు, ఆకలి, మానసిక ఆనందం వంటి వాటిని ప్రేరేపిస్తుంది. ఆరెంజ్ కలర్ తో ఆకలి, భావోద్వేగాలను కంట్రోల్ చేయడంలో సహాయ పడుతుంది. అలాగే ఈ థెరపీ వల్ల మానసిక ఆనందం రెట్టింపు అవుతుంది. ఉదాహరణకు ఆకుపచ్చ రంగును చూడగానే ఒక రకమైన హాయి, ప్రశాంతత కలుగుతుంది. స్థిరత్వం సిద్ధిస్తుంది. ప్రకృతి రంగుగా చెబుతారు ఆకుపచ్చని. నరాలలో ఉదృతను తగ్గించి శాంత పరుస్తుంది. ప్రశాంతంగా జీవించేలా చేస్తుంది.
కలర్ థెరపీ ఎవరికి అవసరం… colors
అతిగా దూకుడుగా ఉండేవారిలో, మానసిక ఆందోళన బారిన పడిన వారిలో, ఒత్తిడితో బాధపడుతున్న వారిలో, అధిక రక్తపోటు, డిప్రెషన్, చర్మ ఇన్ఫెక్షన్లు, నిద్ర సమస్యలు వంటి వాటితో బాధపడే వారికి కలర్ థెరపీ ఎంతో ఉపయోగపడుతుంది.